Hurdles for Three Capitals Bill In AP Legislative Council మండలిలో మూడు రాజధానుల బిల్లును టీడీపీ అడ్డుకట్ట

Minister botsa objects chairman s behaviour makes severe comments

Amaravati, Capital, Council Chairman, Sharrief, Buggana ChandraShekar Reddy, Botsa Satyanarayana, Pilli Subash Chandrabose, Shamantakamani, Dokka Manikya vara prasad, TDP MLC, Resignation, Chandrababu, Yanamala Ramakrishnudu, TDP MLC, Vijayawada, YS Jagan, Capitals, Andhra Pradesh, Politics

YSRCP Minister Botsa Satyanarayana expressed objection and angry over Council chairman Sharif's behaviour on accepting opposition's Rule 71. He said that the chairman should not work for any political benefit. He made remarks that the behaviour will remain as 'mark' in history.

మండలిలో మూడు రాజధానుల బిల్లును టీడీపీ అడ్డుకట్ట

Posted: 01/21/2020 03:10 PM IST
Minister botsa objects chairman s behaviour makes severe comments

అమరావతిలోనే రాష్ట్ర రాజధానిని కొనసాగించాలని.. మూడు రాజధానుల ప్రతిపాదనను తాము వ్యతిరేకిస్తున్నా.. అమరావతి ప్రాంత రైతులు వ్యతిరేకిస్తున్నా ఏమాత్రం లక్ష్యపెట్టకుండా ముందుకు సాగుతున్న అధికార వైసీపీ ప్రభుత్వంపై తమకు బలమున్న చోట పంతాన్ని నెగ్గించుకునే పనిలో తాత్కాలికంగా సక్సెస్ అయ్యింది టీడీపీ. అమరావతి రాజధానితో పాటు తమ నేతలను అదుపులోకి తీసుకుని రాత్రంతా ఎక్కడెక్కడో తప్పి.. రాజధాని కోసం పోరాడుతున్నవారిపై నాన్ బెయిలెబుల్ సెక్షన్లు పెట్టి మరీ జైలుకు పంపడాన్ని టీడీపీ అక్షేపించింది.

తమ పార్టీకి బలమున్న రాష్ట్ర శాసనమండలిలో, చెప్పినట్టుగానే మూడు రాజధానుల బిల్లును తెలుగుదేశం పార్టీ అడ్డుకుంది. ఈ ఉదయం పాలనా వికేంద్రీకరణ బిల్లును ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టగానే, టీడీపీ, ఈ బిల్లును వ్యతిరేకిస్తూ, రూల్ నంబర్ 71 కింద నోటీసులు ఇచ్చింది. బిల్లును ప్రవేశపెట్టేముందు తామిచ్చిన నోటీసుపై చర్చించాలని టీడీపీ పక్ష నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.

అసెంబ్లీలో ఆమోదం పొందినందున వికేంద్రీకరణ బిల్లుపై చర్చ జరపాల్సిందేనని, రూల్ 71 పేరు చెప్పి, బిల్లును తిరస్కరించే అధికారం మండలికి లేదని బుగ్గన స్పష్టం చేశారు. దీనిపై నిబంధనలను పరిశీలించిన మండలి చైర్మన్, రూల్ 71ను పరిగణనలోకి తీసుకుని టీడీపీకి అనుకూలంగా నిర్ణయం తీసుకుని, చర్చకు అనుమతిచ్చారు. దీంతో మంత్రి బోత్స సత్యానారాయణ మండలి చైర్మెన్ షరీఫ్ పై ఘాటు వ్యాఖ్యాలు చేశారు. మండలి చైర్మన్ హోదాలో తమకుండే విఛక్షణా అధికారాలను రాజకీయాల కోసం వినియోగించరాదని ఆయన మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

అంతటితో ఆగకుండా రాజకీయాలకు మండలి చైర్మన్ అతీతంగా వ్యవహరించాలని.. అలా కాకుండా ఏకపక్షంగా రూల్ 71పై చర్చకు చైర్మన్ రూలింగ్ ఇవ్వడం సముచితం కాదని బొత్స వ్యాఖ్యానించారు. దీంతో చైర్మన్ షరీఫ్ కూడా అంతే ధీటుగా బోత్సకు బదులిచ్చారు. తాను రాజీకీయాలకు అతీతంగా రూల్స్ ప్రకారం మాత్రమే రూల్ 71పై చర్చకు అనుమతించానని చెప్పారు. తన, తన హోదాకు రాజకీయాలను అపాదిస్తూ వ్యాఖ్యలు చేయడం సముచితం కాదని మంత్రి బోత్స సహా మంత్రులకు ఆయన సూచనలు చేశారు.

దీంతో మరోమారు మండలిని పది నిమిషాల పాటు వాయిదా వేసిన చైర్మన్ షరీఫ్.. తన ఛాంబర్ లోకి వెళ్లారు. మండలిలో ఈ బిల్లుకు ప్రస్తుతానికి అడ్డుకట్ట పడినట్టే. ఒకవేళ ఇక్కడ బిల్లు వీగిపోతే, డీమ్డ్ టూ బీ పాస్డ్ కింద అధికార పక్షం, దీన్ని ఆమోదింపజేసుకునే వీలుంటుంది. కాగా, ప్రస్తుతం ఏపీ శాసన మండలిలో సభ్యుల సంఖ్య 58 కాగా, మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బిల్లు పాస్ కావడానికి 28 మంది సభ్యుల బలం అవసరం. టీడీపీకి 34 మంది సభ్యుల బలం ఉండటం వారికి కలిసొచ్చే అంశం. వైసీపీకి మండలిలో 9 మంది పీడీఎఫ్ తరఫున ఆరుగురు, బీజేపీ తరఫున ఇద్దరు, స్వతంత్రులు ముగ్గురు, కాంగ్రెస్ తరఫున ఒక్కరు ఉండగా, మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh