Shirdi locals 'satisfied', end agitation షిరిడీ సాయి జన్మస్థలంపై వెనక్కి తగ్గిన సీఎం..

Shirdi bandh called off issue is resolved amicably after meeting with cm

Shirdi Sai janmashtan, Shirdi Saibaba's birthplace, Uddhav Thackeray, radhakrishna vikhe-patil, Ajit Pawar, Aaditya Thackeray, DM Muglikar, mumbai, Maharashtra Congress, Maharashtra, Balasaheb Thorat, shirdi bandh called off, shirdi shutdown called off, Maharashtra, Politics

The Shiv Sena said Maharashtra CM Uddhav Thackeray should not be blamed for the "uncalled for" controversy over the birthplace of Sai baba as nobody can tell whether the 19th century saint was actually born in Shirdi. Thackeray did not refer to Pathri in Parbhani district as Sai baba's birthplace "on his own", but on the basis of versions of some historians.

షిరిడీ సాయి జన్మస్థలంపై వెనక్కి తగ్గిన సీఎం.. ట్రస్టు సభ్యుల సంతృప్తి..

Posted: 01/21/2020 12:43 PM IST
Shirdi bandh called off issue is resolved amicably after meeting with cm

షిరిడీ సాయిబాబా జన్మస్థలం విషయంలో తలెత్తిన వివాదంపై షిరిడీ పట్టణంలో కొనసాగుతున్న బంద్ ను మహారాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన చర్చల నేపథ్యంలో స్థానికులు ఉపసంహరించుకున్నారు. షిరిడి సాయిబాబు సంస్థాన్ ట్రస్ట్ కు చెందిన పలువురితో పాటు షిరిడీలోని 40 మంది పెద్దలతో కలసి ముంబైలో ఈవిషయమై ప్రభుత్వం చర్చించింది. ఈ క్రమంలో షిరిడీ సాయి జన్మస్థలం ఫథ్రీ అని తామకుతాముగా చెప్పలేదని.. ఎవరో చరిత్రకారులు తెలిపిన విషయాన్ని మాత్రమే తాము ప్రస్తావించామని ప్రభుత్వం సంస్థాన్ సభ్యులకు తెలిపింది.

ఇకపై సాయిబాబా జన్మస్థలంగా పథ్రిని పేర్కొనబోమని, కొత్త వివాదం సృష్టించే ఉద్దేశం తమకు లేదని పేర్కొంది. షిరిడీ ట్రస్టు ప్రతినిధులతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌, కాంగ్రెస్ మహారాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి బాలాసాహెబ్ తోరట్, పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య థాకరేతో పాటుగా షిరిడి సాయిసంస్థాన్ ట్రస్ట్ సీఈఓ డీఎం ముగ్లీకర్ సహా 40 మంది ప్రతినిధులు ఈ భేటీలో సమావేశమయ్యారు. సాయి జన్మస్థలంపై తాను చేసిన ప్రకటనను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఉపసంహరించుకున్నారు.

రాష్ట్రంలో తాము ఏ ప్రాంత అభివృద్దికీ వ్యతిరేకం కాదని అయితే సాయి జన్మస్థలం అంటూ చేస్తున్న ప్రచారంతోనే ఇబ్బందని సంస్థాన్ సభ్యులు తమ అవేదనను వ్యక్తంచేశారు. అనంతరం శివసేన నేత కమలాకర్ కోతే మాట్లాడుతూ.. షిరిడీ సాయిబాబా జన్మస్థలంగా పథ్రిని ఇకపై పేర్కొనరాదని సమావేశంలో నిర్ణయించినట్టు చెప్పారు. ఇందులో కొత్త వివాదాలకు చోటు లేదని, ఇక ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్టేనని స్పష్టం చేశారు. సీఎంతో చర్చలపై సంతృప్తి చెందినట్లు ట్రస్ట్‌ సభ్యులు తెలిపారు. ఈ సమావేశాలకు హాజరైన బీజేపి నేత రాధాకృష్ణ విక్కే పాటిల్ కూడా ముఖ్యమంత్రి, మంత్రులతో జరిగిన చర్చలపై సంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో షిరిడి బంద్ పిలుపును ఉపసంహరించుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles