rachakonda police urges pillon drivers not to do this act బైక్ పై వెళ్లేపుడు ఇలా చేయకండీ: రాచకొండ పోలీస్

Rachakonda police urges pillon drivers not to do this act while driving

Rachakonda police, vijayawada highway, sagar highway, mohan bhagawat, umbrella, two wheelers, pillon driver

The Rachakonda police urges bike pillon drivers not to do this act while driving, which may lead to loss of life. please watch the video for more details.

ITEMVIDEOS: బైక్ పై వెళ్లేపుడు ఇలా చేశారో.. అంతే: రాచకొండ పోలీస్

Posted: 12/21/2019 12:32 PM IST
Rachakonda police urges pillon drivers not to do this act while driving

విజయవాడ వెళ్తున్న ఓ కుటుంబం.. రాత్రి వేళ మార్గమధ్యంలో తమ కారు టైరు పంక్చర్ కావడంతో 100 నెంబరుకు ఫోన్ చేయడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు వారి కారు టైరుకు పంక్చర్ వేయించి వారిని క్షేమంగా విజయవాడ చేరుకోవాల్సిందిగా తగు సూచనలు, జాగ్రత్తలు చెప్పిన రాచకొండ పోలీసులు తాజాగా వాహనచోదకులకు మరో సూచనను కూడా అందిస్తున్నారు. రానున్న వేసవి కాలం నేపథ్యంలో గ్రీష్మతాపం నుంచి వాహనచోదకులు తమను తామ రక్షించుకునేందుకు గొడుగును ఉపయోగిస్తుంటారు. ఈ క్రమంలో రాచకోండ పోలీసులు ఇలా చేయడం సరికాదని సూచిస్తూన్నారు.

ఎందుకంటే.. వేగంగా ప్రయాణించే సమయంలో.. అదెంత ప్రమాదకరమో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ఓ యువతి అలాగే గొడుగు తెరిచి.. గాలి వాటుకు కిందపడిపోయింది. అమాంతం కిందపడిపోవడంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే గమనించిన స్థానికులు ఆమెకు ప్రథమ చికిత్స అందించారు. ఈ వీడియోను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ ట్వీట్టర్‌లో షేర్ చేశారు. డ్రైవింగ్ చేస్తుండగా.. గొడుగులు వినియోగించరాదని విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. ఈ వీడియోను పలువురు ట్వీట్ చేస్తూ.. వైరల్‌ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles