police impliments 144 section in Amaravati villages అమరావతి గ్రామాల్లో బంద్.. రోడ్డెక్కిన రైతన్నలు.. 144 సెక్షన్..

Amid bandh in amarvati villages police impliments 144 section security tightened

YS Jagan, Capitals, Amaravati protesters, Amaravati Bandh, !44 Section, Police forces beefedup, mandadam villagers, Tension at Amaravati Farmers protest, Amaravati farmers indefinate fast, Amaravati, Visakhapatnam, kurnool, Assembly, committee report, executive capital, legislative capital, judicial capital, Andhra Pradesh, Politics

Tension prevails in Andhra Pradesh Amarvati CRDA area as the villagers of the surrounding area calls for Bandh, Amid police tightens security and impliments 144 section.

అమరావతి గ్రామాల్లో బంద్.. రోడ్డెక్కిన రైతన్నలు.. 144 సెక్షన్..

Posted: 12/21/2019 11:40 AM IST
Amid bandh in amarvati villages police impliments 144 section security tightened

ఆంధ్రప్రద్రేశ్ రాష్ట్రానికి మూడు రాజధానుల ఆంశంపై సొంత పార్టీ కార్యకర్తల నుంచే అధికార వైసీపీ పార్టీకి నిరసనలు ఎదురవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్ గా తీర్చిదిద్దుతామన్న ఊహాగానాలతో రగలిపోతున్న అమరావతి రైతన్నలు మండిపడుతున్నారు. మూడు రాజధానులు ప్రతిపాదనను తక్షణం ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని.. పూర్తిస్థాయిలో అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేయాలని గత నాలుగు రోజులుగా నిరసనలు చేపడుతూనే వున్నారు. పోలీసులు 144 సెక్షన్, 30 పోలీస్‌ యాక్ట్‌ అమలు చేస్తున్నా ఏ మాత్రం వెనక్కు తగ్గని అమరావతి ప్రజలు శాంతియుతంగానే తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

రాజధాని పరిధిలోని 29 గ్రామాలలో ప్రజలు ఆందోళనల్లో పాల్గోంటున్నారు. ఈ క్రమంలో సచివాలయం వెళ్లే మార్గాల్లో పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. తుళ్లూరు, మందడం, మంగళగిరిలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఆందోళన కార్యక్రమాలపై ఇప్పటికే రాజధాని అమరావతితోపాటు గుంటూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తం అయ్యారు. దీంతో స్థానిక రైతన్నలు కూడా విభిన్నంగా అలోచిస్తూ.. తమ నిరసనను వ్యక్తం చేశారు. అయితే ఈ వినూత్న నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. వెలగపూడిలో గ్రామ పంచాయతీ కార్యాలయానికి వైసీపీ నేతలు ఇటీవల తమ పార్టీ రంగులు వేసుకున్నారు.

కాగా, రాజధానిని మూడు భాగాలుగా చేస్తామని.. ప్రకటించిన క్రమంలో స్థానికి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు.. గ్రామ పంచాయతీ కార్యాలయంపైకి తమ సొంత పార్టీ రంగులను తుడిచేస్తూ నలుపు రంగు వేస్తున్నారు. వారికి గ్రామస్థులు మద్దతు పలికారు. అయితే, వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీంతో నిరసనకారులు, పోలీసుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పోలీసులను నెట్టుకుని మరీ పంచాయతీ కార్యాలయానికి నల్లరంగు వేస్తున్నారు. భూములు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం తమకు అన్యాయం చేయొద్దని రైతులు నినాదాలు చేస్తున్నారు.

రోడ్లపై వాహనాలు వెళ్లకుండా టైర్లు అంటించారు. అమరావతికి వెళ్లే ప్రధాన రహదారి పొడుగునా అందోళనకారులు నిరసనలు చేపట్టారు. గ్రామాల వద్ద టైర్లు అంటించి వాహనాల వెళ్లకుండా అడ్డుగా పెట్టగా.. వాటని పోలీసులు నీల్లు పోసి చల్లార్చారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు, మందడం మెయిన్ సెంటర్‌లో రోడ్డుకు అడ్డంగా ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, జనసేన అధినేత పవన్ కల్యాణ్, బుద్ధుడి ఫొటోలు ఉన్న ఫ్లెక్సీలను కట్టారు. అలాగే, రిలే నిరాహార దీక్షలకు సంబంధించిన ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు.

మరోవైపు, రాయపూడిలోని సీడ్ యాక్సెస్ రోడ్డుపై రైతులు అర్ధనగ్నంగా కూర్చుని నిరసన తెలిపారు. రోడ్డుపైనే వంటావార్పు చేపట్టిన రైతులు.. మూడు రాజధానుల ఆలోచనను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంగళగిరిలోని కోరగల్లులోనూ నిరసనలు వెల్లువెత్తాయి. స్థానికులు తమ పిల్లాపాపలతో కలిసి రోడ్డుపైకి చేరుకుని బైఠాయించారు. నీరుకొండ కొండవీటి వాగు వద్ద రైతులు ఆందోళనకు దిగడంతో కిలోమీటర్ మేర ట్రాఫిక్ స్తంభించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles