Jharkhand may not go BJP’s way: Exit polls జార్ఖండ్ లో కాంగ్రెస్-జేఎంఎం కూటమిదే హవా: ఎగ్జిట్ పోల్స్

Jharkhand exit poll congress jmm set to storm to power with 38 50 seats

Jharkhand Election Exit Poll Results, Jharkhand Exit Poll Results, Jharkhand Election Exit Poll Results 2019, Jharkhand Exit Poll Results 2019, Jharkhand Assembly Election Exit Poll Results, Jharkhand Assembly Exit Poll Results, Jharkhand Chunav Exit Poll Results, Jharkhand Chunav 2019 Exit Poll Results, Jharkhand Exit Poll, opinion poll, opinion poll 2019, Jharkhand Exit Poll Result, Jharkhand, Politics

The Congress and Jharkhand Mukti Morcha are all likely to form the next government in Jharkhand, the India Today and Axis My India Jharkhand exit poll results have predicted.

జార్ఖండ్ లో కాంగ్రెస్-జేఎంఎం కూటమిదే హవా: ఎగ్జిట్ పోల్స్

Posted: 12/21/2019 01:31 PM IST
Jharkhand exit poll congress jmm set to storm to power with 38 50 seats

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) సహా నిత్యావసర సరుకులు ధారాఘాతం.. దిగజారుతున్న దేశ అర్థిక పరిస్థితులు.. అదే సమయంలో కారుచౌకగా ప్రభుత్వ అధీనంలోని పబ్లిక్ సెక్టార్ యూనిట్లను తమవారైన పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టడం వంటి చర్యలకు పాల్పడినట్లు విపక్షాలు సంధించిన అరోపణలను నూటిలో ఆరవై శాతం మంది అక్కడి ఓటర్లు నమ్మారా.? అంటే అవుననే అంటున్నాయి అక్కడి ఎగ్జిట్ పోల్స్. దీంతోనే జార్ఖండ్ లో మరోమారు బీజేపి ప్రభుత్వం అధికారం దక్కించుకోవడం కష్టమనే అభిప్రాయానికి వచ్చినట్లు వున్నారు.

81 మంది సభ్యులన్న జార్ఖండ్ అసెంబ్లీలో బీజేపి మరోమారు అధికారాన్ని అందిపుచ్చుకోవడం కల్ల అని జార్ఖండ్ ఎన్నికల తుదిదశ పోలింగ్ ముగిసిన క్రమంలో వెలువడిన ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. అయితే పలు ఎగ్జిట్ పోల్స్ మాత్రం జార్ఖండ్‌లో త్రిశంకు సభ ఏర్పడుతుందని, బీజేపీ అధికారం కోల్పోతుందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. ఐదు దశల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ లేదా కూటమికీ మెజారిటీ రాదని తెలిపాయి. శుక్రవారం చివరి దశ పోలింగ్‌ ముగియడంతో వివిధ సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను వెల్లడించాయి.

jharkhand bjp no majaority

ఈ దశలో 16 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరిగింది. 70.83ు పోలింగ్‌ నమోదైంది. బీజేపీకి 32 సీట్లు, జేఎంఎం-కాంగ్రె్‌స-ఆర్జేడీ కూటమికి 35 సీట్లు వస్తాయని సీవోటర్‌ ఎగ్జిట్‌ పోల్‌ పేర్కొంది. ఏకైక అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించినా ప్రభుత్వ ఏర్పాటుకు తగిన సంఖ్యాబలం రాదన్న అంచనాలే నిజమైతే ఆ పార్టీ ఎదురుదెబ్బ తగిలినట్టే! ఈ ఎన్నికల సమయంలోనే అయోధ్య తీర్పు వెలువడింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని కేంద్రం తెచ్చింది. ఇవి బీజేపీకి ఓట్లు రాల్చలేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. లెక్కింపు 23న జరుగుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles