Dundigal police traced out missing girl from KPHB గాయత్రి సేఫ్.. మిస్సింగ్ లో ట్విస్ట్.. పోలీసులపై ప్రశంసలు

Dundigal police traced out missing girl from kphb

Gayatri, 19 Years Old woman, Girl Missing Case, Dundigal, Ratnadeep SuperMarket, Dundigal Police Station, Cyberabad Police, Telangana, Crime

Dundigal Police traced out the where abouts of Missing girl Gayatri within 24 hours from KPHB colony, whose parents has approched police after she was been missing from yesterday noon.

గాయత్రి సేఫ్.. మిస్సింగ్ లో ట్విస్ట్.. పోలీసులపై ప్రశంసలు

Posted: 12/20/2019 11:53 AM IST
Dundigal police traced out missing girl from kphb

హైదరాబాద్ లో క్రితంరోజు మధ్నాహ్నం అదృశ్యమైన యువతి కథ సుఖాంతమైంది. 24 గంటల కూడా తిరగకుండానే పోలీసులు అమె ఆచూకిని తెలుసుకుని.. అమెను తీసుకువచ్చి అమె తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో తీవ్ర కలకలం రేపిన యువతి అదృశ్యమైన కేసు సుఖాంతం కావడంతో పోలీసులు కూడా ఊపిరిపీల్చుకున్నారు. వరుసగా మహిళలు, యువతులపై జరుగుతున్న ఘటనల నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు గాయత్రిని సురక్షితంగా అమె తల్లిదండ్రులకు అప్పగించారు. యువతిని విషయంలో అప్రమత్తంగా వ్యవహరించిన పోలీసులపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేటకు చెందిన గాయత్రి అనే యువతి స్థానిక రత్నదీప్ సూపర్ మార్కెట్ లో క్యాషియర్ గా విధులు నిర్వహిస్తోంది. విధులకు హాజరయ్యేందుకు వెళ్తానని చెప్పి నిన్న మధ్యాహ్నం ఇంటి నుంచి బయల్దేరి వెళ్లిన ఆమె.. సాయంత్రం అయినా ఇంటికి తిరిగిరాలేదు. దీంతో కుటుంబ సభ్యులు గాయత్రికి ఫోన్‌ చేయగా..స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది. వెంటనే యువతి పనిచేస్తున్న స్టోర్‌కు ఫోన్ చేయగా..అసలు గాయత్రీ విధులకు హాజరుకాలేదని తెలిసింది. దీంతో కంగారుపడిన యువతి తల్లిదండ్రులు గురువారం దుండిగల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వరేసగా మహిళలు, యువతులపై జరుగుతున్న ఘటనల నేపథ్యంలో అప్పమత్తమైన పోలీసులు ఈ కేసును సవాల్ గా తీసుకున్నారు. అమె వెళ్లిన సిసిటీవీ ఫూటేజీలను పరిశీలించి.. ఆమె సెల్ ఫోన్ ఆధారాంగా తక్కువ సమయంలోనే గాయత్రి ఆచూకీని గుర్తించారు. కేపీహెచ్ బీలోని సర్దార్ పటేల్ నగర్ లో గాయత్రిని పోలీసులు గుర్తించి.. సురక్షితంగా దుండిగల్ పీఎస్ కు తీసుకొచ్చారు. కాగా గాయత్రి మిస్సింగ్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది... ఇంట్లో‌ చూసిన పెళ్లి సంబంధం నచ్చకపోవడంతోనే గాయత్రి ఇల్లు వదిలి వెళ్లిపోయినట్టు పోలీసులు గుర్తించారు.

ఈ మేరకు గాయత్రి తన తల్లిదండ్రులకు ఒక లేఖను కూడా రాసిపెట్టిందని తెలిపారు. తనను వెతకొద్దని.. అంతేకాదు తాను మిస్ అయినట్టు పోలీసులకు కూడా పిర్యాదు చేయవద్దని తన తల్లిదండ్రులను లేఖలో కోరింది గాయత్రి. గాయత్రి రాసిన లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు... ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానిస్తున్నారు. అయితే, గాయత్రి తల్లిదండ్రులు ఫిర్యాదుతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన దుండిగల్ పోలీసులు... సీసీ కెమెరాలు, సెల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా గాయత్రి కోసం గాలింపు ముమ్మరం చేసిన పోలీసులు అమెను కేపీహెచ్ బి లోని సర్ధార్ వల్లభబాయ్ పటేల్ నగర్ కాలనీ నుంచి తీసుకువచ్చి అమె తల్లిదండ్రులకు అప్పగించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles