Vandals' assets to be confiscated to pay for damages: CM హింసకు పాల్పడిన వారి ఆస్తుల వేలం: యూపీ సీఎం

Will take revenge against those involved in violence cm yogi adityanath

Yogi Adityanath, Citizenship Act Protest, UP protests, UP Violence, Sambhal, Lucknow, Uttar Pradesh, Crime

Uttar Pradesh Chief Minister Yogi Adityanath said on Thursday his government will take "revenge" on those involved in the violence over the amended Citizenship Act by auctioning their property to compensate for the losses.

హింసకు పాల్పడిన వారి ఆస్తుల వేలం: యూపీ సీఎం

Posted: 12/20/2019 12:40 PM IST
Will take revenge against those involved in violence cm yogi adityanath

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న నిరసనకారులను ఉద్దేశించి జార్ఖండ్ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలనే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిథ్యనాథ్ ఊటంకిస్తూ.. తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. నిరసనకారులు వేసుకున్న దుస్తులను బట్టి వారిని గుర్తించి.. అరెస్టు చేస్తామని ప్రధాని అనగా, రమారమి అలాంటి వ్యాఖ్యలనే చేసిన సీఎం యోగీ.. మరో అడుగుముందుకేసీ.. వారి ఆస్తులను కూడా గుర్తించి వాటితో నష్టాన్ని భర్తీ చేసుకుంటామని వ్యాఖ్యానించారు.

సిఏఏ ను వ్యతిరేకిస్తూ.. దానిపేరుతో హింసకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు. ఆందోళనల పేరిట ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న విషయం విదితమే. ఈ క్రమంలో యూపీలో సైతం ఆందోళనకారులు రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు నిర్వహిస్తున్నారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని చెదరగొడుతుండగా.. ఇరువర్గాల మధ్య ఘర్షణలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించే పేరిట కాంగ్రెస్‌ పార్టీ, ఎస్పీ, వామ పక్షాలు దేశాన్ని అగ్నిగుండంగా మారుస్తున్నాయి. లక్నో, సంభాల్‌లో తీవ్ర స్థాయిలో హింస చెలరేగింది. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిని గుర్తించి.. వారి ఆస్తులను వేలం వేసి.. జరిగిన నష్టాన్ని పూడుస్తాం. మీరు చేసిన పనులు సీసీటీవీలో ఫుటేజీల్లో రికార్డయ్యాయి. ఇందుకు కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాం’ అని హెచ్చరికలు జారీ చేశారు.

అదే విధంగా రాష్ట్రంలో పలుచోట్ల 144 సెక్షన్‌ అమల్లో ఉందని.. అనుమతి లేకుండా రోడ్ల మీదకు వస్తే కఠిన చర్యలు ఉంటాయని యోగి ఆదిత్యనాథ్‌ పేర్కొన్నారు. ఆందోళనకారుల కారణంగా సామాన్య పౌరులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోమని అధికారులకు సూచించినట్లు పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ చట్టం ఏ మతానికి వ్యతిరేకం కాదని, హింసకు గురై భారత్‌కు శరణార్థులుగా వచ్చే మైనార్టీలకు మాత్రమే మేలు చేస్తుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా... సంభాల్‌లో హింసకు పాల్పడ్డారన్న ఆరోపణలతో 17 మందిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వీరిలో పలువురు సమాజ్‌వాదీ పార్టీ నేతలు, ఎంపీ షఫికర్‌ రహమాన్‌ బర్క్‌ తదితరులు ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yogi Adityanath  Citizenship Act Protest  UP protests  UP Violence  Sambhal  Lucknow  Uttar Pradesh  Crime  

Other Articles