Pawan Kalyan viral Photo goes viral online కాకినాడ ఎయిర్ పోర్టులో నేలపై పడుకున్న పవన్.!

Pawan kalyan sleeps at kakinada airport waiting for his plane to rajamundry

Pawan Kalyan, JanaSena, Naga babu, YS Jagan Mohan Reddy, Janasena Pawan Kalyan, Pawan Kalyan Viral Video, Pawan Kalyan latest video, Pawan Kalyan Reaction, Janasena Party Songs, Janasena Party, AP CM YS Jagan, pawan kalyan twitter, pawan kalyan viral video, pawan kalyan video viral, pawan kalyan viral photo, Andhra Pradesh, Politics

Jana Sena Chief Pawan Kalyan had a short sleep in kakinada airport, while on his way to Rajamundry after being tired due to Rythu soubhagya deeksha conducter at kakinada. Pawans Photo and video goes viral on net.

ITEMVIDEOS: వైరల్: కాకినాడ ఎయిర్ పోర్టులో నేలపై పడుకున్న పవన్.!

Posted: 12/14/2019 06:16 PM IST
Pawan kalyan sleeps at kakinada airport waiting for his plane to rajamundry

తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన పవన్ కల్యాణ్.. తన పార్టీ గుర్తు గాజు గ్లాజు ఎంతటి సామాన్యమైనదో.. తాను కూడా అంతటి సామాన్యుడినేనన్న సందేశాన్ని ప్రజల్లోకి పంపాడు. తాను సినిమాస్టార్ అయినా.. సినిమాలు తీసుకుంటూ పోతే తనకు ఏడాదికో వంద కోట్ల రూపాయలు వస్తాయని.. వాటిన్నింటినీ త్యాజించి ప్రజల కోసం.. ప్రజా సేవ కోసం తాను సామాన్యుడిగా మీ మధ్యకు వచ్చానని ఆయన పలు సందర్భాల్లో తెలిపారు. ఈ మాటలు ఎన్నికల సమయంలో ప్రతీ నాయకుడు చెప్పేవే అని సాధారణంగానే తీసుకున్నారు ప్రజలు.

అయితే ప్రస్తుతం మాత్రం ఎన్నికలు లేవు. కానీ సామాన్యుడు అన్న పదానికి మాత్రం పవన్ కల్యాణ్ కట్టుబడివున్నారు. ఎలక్షన్ల సమయంలో మట్టి పాత్రలో భోజనం చేసి.. గాజు గ్లాసులో టీ తాగి.. పశువులకు మేత వేస్తూ.. తువ్వాయిలను ముద్దాడి.. కొబ్బరి చెట్టుకింత సేద తీరడం.. అత్యంత సాధారణ వ్యక్తిలా జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యవహరించినా.. ఎన్నికల జిమ్మికులని కొందరు ఈజీగా కొట్టిపారేశారు. అయితే ఆయన ఏదైనా అంటే అందుకు కట్టబడి వుంటారన్న మాత్రం తాజాగా మరోమారు నిరూపితం అయ్యింది.

తాజాగా మరోసారి కామన్ మేన్లా తన అభిమానులను ఆకట్టుకున్నారు. విమానం లేటయితే అక్కడే నేలపై పడుకుని వెయిట్ చేశారు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రైతుల కోసం కాకినాడలో రైతు సౌభాగ్య దీక్ష చేసిన పవన్.. దీక్ష అనంతరం రాజమండ్రికి వెళ్లాలనుకున్నారు. అయితే రాజమండ్రి విమానం లేట్ అవ్వడంతో విమానాశ్రయం వెలుపలే ఓ సాధారణ వ్యక్తిలా పడుకున్నారు. ఉదయం నుంచి దీక్షలో అలిసిపోయిన పవన్.. కాసింత సేపు విమనాశ్రయంలో సేద తీరారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  JanaSena  viral photo  Rythu Soubhagya deeksha  Rajamundry  Kakinada  Andhra Pradesh  Politics  

Other Articles