SC notice to Centre: EC on mismatch of votes ఈసీకి ‘సుప్రీం’ షాక్.. తేడా లెక్కలపై నోటీసులు

Discrepancies in 347 ls seats poll data supreme court issues notice to ec

Supreme Court, Association for Democratic Reforms, 2019 Lok Sabha election, Election Counting, Voter Turnout, Number of votes, difference of votes, Election Commisison of India, politics

The Supreme Court has issued a notice to the Election Commission of India (ECI) on the pleas of two NGOs seeking a probe into alleged discrepancies between voter turnout and the number of votes counted in 347 constituencies during the 2019 Lok Sabha polls.

ఎన్నికల కమీషన్ కు ‘సుప్రీం’ షాక్.. తేడా లెక్కలపై నోటీసులు

Posted: 12/14/2019 05:36 PM IST
Discrepancies in 347 ls seats poll data supreme court issues notice to ec

ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ అఖండ మెజార్టీ సాధించి రెండో సారి అధికారం చేపట్టింది. ఇలా అందుకోగానే ఏకంగా కాశ్మీర్ అంశంపై దృష్టి సారించి.. ఆర్టీకల్ 370ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుని.. యావత్ దేశ ప్రజల మనన్నలను అందుకుంది. అంతేకాదు కాశ్మీర్ ను రెండు భాగాలుగా చేసి.. కాశ్మీర్ ను చట్టసభ ఉన్న కేంద్రపాలిత ప్రాంతంగా, లడఖ్ పై పూర్తి అధికారలను రాష్ట్రపతికి అప్పగిస్తూ కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించింది. ఇది ఆగస్టు 5 నుంచి అమల్లోకి వచ్చింది. ఆ తరువాత తాజాగా దేశవ్యాప్త క్యాబ్ చట్టాన్ని అమలు చేసింది.

ఇదిలావుంటే.. ఇటీవల జరిగిన ఎన్నికలలో ప్రజల నుంచి వచ్చిన అరోపణలు అన్ని ఇన్నీ కావు. వాటిని పక్కన బెడితే తాజాగా, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలైంది. పిటిషన్ పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం ఎన్నికల కమిషన్ కి నోటీసులు జారీ చేసింది. 2019 లోక్సభ ఎన్నికల్లో చోటు చేసుకున్న అవకతవకల పై విచారణ జరపాల్సిందిగా దాఖలైన పిటిషన్ల పై సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ కు నోటీసులు జారీ చేసింది.

దాదాపు 347 లోక్సభ నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్యకు పోలైన ఓట్లకు మధ్య తేడాలు ఉన్నాయని దీని పై విచారణ జరపాలని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫామ్స్ (ఏడీఆర్) కామన్ కాజ్ అనే రెండు స్వచ్ఛంద సంస్థలు సుప్రీంకోర్టు ను ఆశ్రయించాయి. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో ఇలాంటి తేడాలు రాకుండా ఓ పటిష్టమైన పద్ధతి రూపకల్పనకు ఎన్నికల కమిషన్ ను ఆదేశించాలని వీరు సుప్రీం కోర్ట్ ని కోరారు.

అలాగే ఎన్నికల ఫలితాలను ప్రకటించే ముందుగా అంకెలను ఎన్నికల కమిషన్  స్పష్టంగా లెక్క కట్టాలని 2019 లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల పత్రాలు 17సీ 20 21సీ 21డీ 21ఈల సమాచారాన్ని అందరికీ అందుబాటులో ఉంచాని ఏడీఆర్ కోరింది. దేశవ్యాప్తంగా ఎన్నికల వివాదాన్ని పరిష్కరించుకునేందుకు పిటిషన్ వేసుకునేందుకు అవకాశముండగా ఫలితాల కచ్చితత్వం అంకెల్లోని తేడాల కారణంగా వచ్చే అనుమానాలను తీర్చేందుకు మాత్రం ఎలాంటి ఏర్పాట్లూ లేవని ఏడీఆర్ సుప్రీంకోర్టు కి తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles