Marathon Runner Banned From Future Races మహిళా రిపోర్టర్ కు పరాభవం.. లైవ్ కవరేజీలో ఇలా..

Marathon runner smacks reporter on the butt on live tv

US Reporter, US Reporter Slapped, US Reporter Butt Slapped, Marathon Runner Slaps Reporter, Runner US Reporter, US Reporter Slapped Live TV

More recently, another US reporter fell victim to ON-AIR sexual molestation. For Georgia journalist, Alex Bozarjian, it was a shocking moment she experienced while on live TV, this weekend.

ITEMVIDEOS: మహిళా రిపోర్టర్ కు పరాభవం.. లైవ్ కవరేజీలో ఇలా..

Posted: 12/14/2019 07:29 PM IST
Marathon runner smacks reporter on the butt on live tv

జనాల మధ్యలో రిపోర్టింగ్ చేయడం కాసింత కష్టమే. అందులోనూ మహిళా రిపోర్టులకు మాత్రం ఇది కత్తి మీద సామే. ఎందుకంటే భిన్న మనస్తత్వాల మనుషులు, భిన్న కోరికలు, భిన్న ప్రవర్థనలు అన్ని కలియచుట్టితే.. విభిన్నమైన అనుభవం మిగిలేది రిపోర్టర్లకే. చెడ్డవాళ్లుటుంటారని ఎంతో జాగ్రత్తాగా మసలుకున్న చోట ఎలాంటి ఇబ్బంది ఎదురవ్వదు.. కానీ అంతా మంచివారే అనుకుని వెళ్లిన చోట పరాభావాలు చెప్పనలవి కాని విధంగా ఎదురవుతున్నాయి. విచక్షణలేని వ్యక్తులు ఎదురయితే ఎంతటి దారుణ అనుభవాలను కూడగట్టుకోవాల్సి వస్తుందని అమెరికాలో జరిగిన ఈ ఘటనే చెబుతోంది.

డబ్యూఎస్ఏవీ టీవీ రిపోర్టర్ అలెక్స్ బోజార్జియన్ ఇటీవల ఎన్మార్కెట్ సవన్నా బ్రిడ్జ్ రన్ కార్యక్రమాన్ని లైవ్‌లో ప్రసారం చేసేందుకు వెళ్లింది. ఈ సందర్భంగా ఆమె మారథన్ జరుగుతున్న రహదారిపై నిలుచుని లైవ్ ప్రసారంలో సమాచారం ఇస్తుండగా.. వెనుక నుంచి వచ్చిన మారథాన్లు కవరేజీలో కనబడేందుకు ఒక్కొక్కరు ఒక్కోలా వ్యవహరించారు. అయితే ఓ వ్యక్తి ఆమె వెనుకనుంచి వస్తూ అమె పిరుదులపై బలంగా కొట్టి పరిగెట్టాడు. దీంతో ఆమె కాసేపు షాకైంది. ఆమె నోటి నుంచి మాట రాలేదు. ఆ వెంటనే ఆమె తేరుకుని సమాచారం చెప్పడం కొనసాగించింది.

టోన్యా అనే మహిళ ట్వీట్ చేసిన ఈ వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది. ఇది రిపోర్టర్ అలెక్స్ కు కూడా చేరింది. ఈ వీడియోను ఆమె రిట్వీట్ చేస్తూ.. ‘‘ఉదయం లైవ్‌ చెబుతున్నప్పుడు నా పిరుదులపై కొట్టిన వ్యక్తికి ఈ విషయం చెబుతున్నా: నువ్వు విచక్షణ తప్పావు. నన్ను ఆందోళనకు గురిచేశావు. విధి నిర్వహణలో గానీ, మరెక్కడైనా గానీ.. మరే మహిళతో ఇలా ప్రవర్తించకు. మర్యాదగా వ్యవహరించు’’ అని పేర్కొంది.

ఈ వీడియో వైరల్ కావడంతో మొత్తానికి ఆ వ్యక్తిని గుర్తుపట్టారు. అతను 43 ఏళ్ల టామీ కాల్వే అని తెలిసింది. ఓ పత్రిక ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. ‘‘నేను ఆమె వెనుక తాకాను. కానీ, ఎక్కడ తాకానో తెలియదు. నేను పరుగులో ఉండటం వల్ల వెనక్కి తిరిగి ఆమె ముఖాన్ని కూడా చూడలేదు. అలా చేసినందుకు నాకు కూడా బాధగా ఉంది. చాలా సిగ్గుగా ఉంది. వెనక్కి వెళ్లి ఆమెను క్షమాపణలు కోరి ఉండాల్సింది’’ అని తెలిపాడు. టామీకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతడు చర్చ్ యూత్ మినిస్టర్‌గా పనిచేస్తున్నాడు.

అయితే, అలెక్స్.. అతడిని క్షమించబోనని తెలిపింది. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనని అతడు లైంగికంగా వేధించాడని తెలిపింది. ‘‘మహిళ శరీరమంటే ఆట వస్తువు కాదు.. ఎక్కడపడితే అక్కడ తాకి ఆనందించడానికి’’ అని తెలిపింది. ఈ ఘటన ఫలితంగా టామీని మారథన్ నుంచి బహిష్కరించారు. భవిష్యత్తులో మరే మారథన్‌లో పాల్గోకుండా నిషేదం విధించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles