Woman cop beats eve teaser with shoe in Kanpur అకతాయి తాట తీసిన మహిళా కానిస్టేబుల్..

Woman cop beats eve teaser with shoe in kanpur

female cop, lady cop thrashes eve-teaser, eve-teasing, eve teaser, woman constable, school girls, Bithoor police station, Anti-Romeo Squad, Kanpur, Viral video, UP Police, Uttar Pradesh crime

This road Romeo was beaten up with a shoe by a lady constable. This youth was allegedly teasing girls going to school in Kanpur. The lady constable seems to have taught him a good lesson.

ITEMVIDEOS: అకతాయి తాట తీసిన మహిళా కానిస్టేబుల్.. చెప్పుతో కొట్టి..

Posted: 12/11/2019 10:30 AM IST
Woman cop beats eve teaser with shoe in kanpur

మహిళలు, బాలికలపై రోజురోజుకు శృతిమించితున్న ఆగడాల నేపథ్యంలో ఏకంగా పార్లమెంటు ఉభయ సభలనే ఈ అంశం దద్దరిల్లేలా చేస్తున్న తరుణంలో.. పాఠశాలల వద్ద తిష్ట వేసి.. విద్యాలయాలకు వెళ్తున్న బాలికలను వేధిస్తున్న ఓ అకతాయికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. సదరు ఆకతాయికి తగిన గుణపాఠం లభించిందని నెట్ జనులు కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు ఆకతాయి తాట తీసిన మహిళా కానిస్టేబుల్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

వెల్ డన్ మేడం.. మీలాంటి వాళ్లు వర్థిల్లాలని, కనీసం పది కిలోమీటర్లకు ఒకరు వున్నా మహిళలు భద్రంగా వుంటారని నెట్ జనులు కామెంట్లు పెడుతున్నారు. అసలేం జరిగింది.? ఎందుకిలా కామెంట్లతో అమెపై ప్రశంసలు కురిపిస్తున్నారని అనుకుంటున్నారా.? ఇంతకీ ఆకాతాయి అమె ఏం చేసిందని ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయా.? ఈ ఘటన ఎక్కడ జరిగిందీ.? ఈ ఘటనకు సంబందించిన వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ జిల్లాలో బీతూర్ పోలిస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన.

బీతూర్ లోని విద్యాలయానికి వెళ్తున్న విద్యార్ధినులను చూసి అదే రోడ్డున వెళ్తున్న ఓ ఆకతాయి.. కామెంట్లు చేశాడు. అంతేకాకుండా అనుచితంగా ప్రవర్తించాడు. ఇవి అతని వెనుక వున్న మహిళా కానిస్టేబుల్ కంట పడ్డటంతో పాటు అకాతాయి మాటలను అమె వినింది. వెంటనే అతడి వద్దకు చేరుకుని కాలర్ పట్టుకుని చెడాపెడా కొట్టేసింది. అంతటితో ఆగకుండా తన కాలికి వున్న షూ తీసి.. దాంతో కూడా వడ్డించింది. 33 సెకన్ల నిడివి వున్న వీడియోలో అమె ఏకంగా 22సార్లు అకాతాయిని వాయించింది. ఇదంగా నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా జరిగిందీ.

దీంతో నెటిజనులు ఈ ఘటనకు సంబంధించిన వీడియోను తమ మోబైల్ లో తీయడంతో పాటు నెట్టింట్లోనూ పోస్టు చేశారు. అంతే క్షణాల్లో ఈ వీడియో నెట్టింట్లో సంచలనంగా మారింది. ఆ మహిళా కానిస్టేబుల్ తన విధిని సక్రమంగా నిర్వహించిందని నెటిజనులు కామెంట్లు పోస్టు చేస్తున్నారు. బీతూర్ పోలిస్ స్టేషన్ పరిధిలోని విధులు నిర్వహిస్తున్న ఈమె పేరు చంచల్ చౌరాసియా. అమె యాంటీ రోమియో స్వాడ్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తోంది. దీంతో అకతాయిని పోలిస్ స్టేషన్ కు కూడా తరలించింది.
 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : eve teaser  woman constable  school girls  Kanpur  Viral video  UP Police  Uttar Pradesh crime  

Other Articles