Fools Should Shut Their Mouths About Pawan’s Marriage పవన్ కు నరేష్ సపోర్ట్.. ‘‘మీకు సిగ్గనిపించడం లేదా.?’’

Fools should shut their mouths about pawan s marriage

Pawan Kalyan, JanaSena, Senior Actor Naresh, personal matters, multiple marriages, YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, Religion, caste, Chirstianity, HInduism, colourism, pawan kalyan twitter, pawan tweet attack on ycp, YSRCP, Andhra Pradesh, Politics

Quite seriously, senior actor Naresh was seen taking Pawan Kalyan’s side and calling Pawan’s political opponents as fools who are attacking the power star on his multiple weddings.

పవన్ కు మద్దతుగా నిలిచిన నరేష్.. ‘‘మీకు సిగ్గనిపించడం లేదా.?’’

Posted: 12/10/2019 05:45 PM IST
Fools should shut their mouths about pawan s marriage

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై ‘మా’ అధ్యక్షుడు, సీనియర్ నటుడు నరేశ్ ప్రశంసలు కురిపించారు. రాజకీయం కూడా వ్యాపారంగా మారిన నేటి తరుణంలో పవన్ కల్యాణ్ లాంటి నేతలు ప్రజలకు అవసరమని, సమాజానికి అంతకన్నా అవసరమని ఆయన అన్నారు. ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే వందో, రెండొందల కోట్లో కావాలని అన్నారు. ఇక అన్ని కోట్లు ఖర్చుబెట్టి గెలిచిన వ్యక్తులు ఆ తరువాత ఏం ప్రజా సేవ ఎలా చేస్తారని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ లాంటి వాళ్లు ప్రస్తుత రాజకీయాలకు ఎందుకు అవసరమన్న విషయాన్ని ఆయన వివరించారు.

‘ఐ లైక్ పవన్ కల్యాణ్.. ఐ సపోర్ట్ పవన్ కల్యాణ్. ఎందుకంటే, పీక్ లో ఉన్నటువంటి కెరీర్ ని వదిలి.. ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజల్లోకి వెళ్లి పాటిస్తున్నారు. అలాంటి వ్యక్తి ఇక్కడి రాజకీయంలోకి కావాలి’ అని అభిప్రాయపడ్డారు. రాజకీయం సామాన్యుడికి అందుబాటులోకి రావాలని పవన్ కల్యాణ్ కోరుకుంటున్నారని అన్నారు. ధనవంతులకు చేతుల్లో రాజకీయం చిక్కకుపోయిందని అభిప్రాయపడిన ఆయన.. ఇలాంటి పరిణామాలలో పవన్ కల్యాణ్ లాంటి నేతలు ముందుకెళుతున్న విధానం తనకు నచ్చిందని, ఆయనకు తన నైతిక మద్దతు అని అన్నారు.

పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారన్న విమర్శలపై ఆయన స్పందిస్తూ, ఒకరి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే హక్కు ఎవరికైనా ఉందా? అని ప్రశ్నించారు. ప్రతి వ్యక్తీ తన వ్యక్తిగత జీవితంలో వచ్చే ‘స్ట్రగుల్స్’ వల్ల కొన్ని నిర్ణయాలు తీసుకుంటాడని, ఆ విషయాలను బహిరంగంగా ప్రస్తావించేవారికి ఆ రాజకీయ నాయకులకు సిగ్గు అనిపించదా అని ప్రశ్నించారు. ఇకనైనా నిస్వార్థ సేవ చేసేందుకు ముందుకువచ్చిన పవన్ కల్యాణ్ లాంటి వ్యక్తులను ఆదరిస్తేనా.. ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులోకి తీసుకువస్తారని నరేష్ అభిప్రాయపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles