Nara Lokesh protest on increased bus fares లోకేష్ కు తప్పిన ప్రమాదం.. బస్సు చార్జీల పెంపుపై నిరసన

Nara lokesh travels in apsrtc bus in protest to increased bus fares

nara lokesh, ap cm jagan, ap cm jagan mohan reddy, tdp mlc, drone camera accident, Mangalagiri APSRTC bus fares, tdp, chandrababu naidu, ap news, ap politics, andhra pradesh

Former minister and TDP general secretary Nara Lokesh along with the MLCs protested at Mangalagiri bus stand in demand to reduction in the inflated RTC charges. Lokesh travelled in a bus from Mangalgiri to AP Assembly along with TDP MLCs.

లోకేష్ కు తప్పిన ప్రమాదం.. బస్సు చార్జీల పెంపుపై నిరసన

Posted: 12/11/2019 11:17 AM IST
Nara lokesh travels in apsrtc bus in protest to increased bus fares

టీడీపీ పార్టీ అగ్రనేతలను ప్రభుత్వం టార్గెట్ చేస్తోందా.? వర్షాకాలం ముగిసిన తరువాత కురిసిన అకాలవర్షాలకు కృష్ణ నది పరివాహిక ప్రాంతంలోని ఇళ్లు, పోలాలు నీట మునగిన సమయంలో ప్రభుత్వ అదేశాల మేరకు కొందరు నీటిపారుదల శాఖ సిబ్బంది డ్రోన్ లతో కృష్ణా కరకట్టపైనున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి పరిస్థితులను పర్యవేక్షించారని అరోపణలు ఎదుర్కోన్నారు. ఈ ఘటన జరిగి మూడు నెలలు కూడా తిరగకముందే.. తాజాగా ఇవాళ ఎమ్మెల్సీ నారా లోకేష్ కు అదే డ్రోన్ ల ప్రమాదం తృటిలో తప్పింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ్లి నుంచి పెరిగిన బస్సు చార్జీల పెంపును నిరసిస్తూ టీడీపీ అందోళన కార్యక్రమాలను చేపట్టింది. ఇందులో భాగంగా బస్సును దిగి.. అసెంబ్లీకి పాదయాత్రగా వస్తుండగా ఆయన సమీపంలో ఓ డ్రోన్ కెమెరా కింద పడింది. ఆపరేటింగ్ లోపంతో విద్యుత్ తీగలకు తగిలి డ్రోన్ కెమెరా ఒక్కసారిగా కింద పడింది. దీంతో నారా లోకేష్‌తో పాటు.. ఆయన చుట్టూ ఉన్న ఎమ్మెల్సీలు కూడా ఉలిక్కిపడ్డారు. దీని ప్రయోగం ఎవరు చేశారు.. కావాలని ప్రయోగించారా.? లేక కాకతాళీయంగా జరిగిందా.? అన్న అంశమై పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది.

ఇదిలావుండగా మంగళగిరి బస్టాండ్ వద్ద లోకేష్ నేతృత్వంలో టీడీపీ ఎమ్మెల్సీల నిరసన తెలిపారు. ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీలతో కలిసి మంగళగిరి నుంచి ఏపీ అసెంబ్లీ వరకూ బస్ లో లోకేష్ ప్రయాణించారు. పెంచిన ధరలు, పెరిగిన భారం గురించి ప్రయాణికులతో మాట్లాడి తెలుసుకున్నారు. 15 కిలోమీటర్లకు పెంచిన రేటు ప్రకారం ఛార్జీలు రూపాయిన్నర పెరగాలి కానీ ... ఐదు రూపాయిలు అధికంగా వసూలు చేస్తున్నారు అని లోకేష్ దృష్టికి ప్రయాణికులు తీసుకొచ్చారు.

పెంచిన బస్సు చార్జీల నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రయాణికులపై సంవత్సరానికి రూ. 700 నుండి రూ.. 1000 కోట్ల భారం పడుతుందన్నారు. పెంచిన ఆర్టీసీ రేట్లు తగ్గించే వరకూ పోరాటం చేస్తామన్నారు. పెంచుకుంటూ పోతాం అని జగన్ చెబుతుంటే.. ప్రజలంతా సంక్షేమ కార్యక్రమాలు పెంచుతారు అనుకున్నారు. కానీ ఇసుక ధర, ఆర్టీసీ ధరలను ప్రభుత్వం పెంచుకుంటూ పోతొందని విమర్శించారు. త్వరలో విద్యుత్ ఛార్జీలు కూడా జగన్ సర్కార్ పేంచేస్తోందని చెప్పారు. ఆర్టీసీ ఛార్జీలు పెంపుపై ఆందోళన వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles