US commission seeks sanctions against Amit Shah అమిత్ షాపై ఆంక్షలు విధించాలి: యూఎస్ కమీషన్

Federal us commission seeks american sanctions against amit shah

amit shah, Citizenship amendment bill, cab passed in ls, federal us commission, Citizenship (Amendment) Bill 2019, American sanctions, BJP, Union Minister for Home Affairs, Amit Shah, Citizenship ammendment bill, CAB, Parliament, congress, vinayak damodhar savarkar, proposal of two countries, Hindu Maha Sabha Meeting, Parliament, Nation, Politics

A federal US commission on international religious freedom has said that the Citizenship Amendment Bill is a "dangerous turn in wrong direction" and sought American sanctions against Home Minister Amit Shah if the bill is passed by both houses of the Indian Parliament.

అమిత్ షాపై ఆంక్షలు విధించాలి: యూఎస్ కమీషన్

Posted: 12/10/2019 04:50 PM IST
Federal us commission seeks american sanctions against amit shah

దేశ పౌరసత్వ సవరణ బిల్లును వివాదాస్పదమైనదిగా పేర్కొంటూ అంతర్జాతీయ మతస్వేచ్ఛపై అమెరికా కమిషన్‌ (యూఎస్సీఐఆర్ఎఫ్‌) ప్రకటన చేయడాన్ని భారత్‌ తోసిపుచ్చింది. అమెరికా వాదన అసమంజసం, అవాస్తవమని ఆక్షేపించింది. పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందితే పాకిస్తాన్‌, ఆప్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ల నుంచి వచ్చే ముస్లిమేతర శరణార్ధులకు భారత పౌరసత్వం లభిస్తుంది. కాగా ఈ బిల్లు తప్పుడు దిశగా పయనించే ప్రమాదకర మలుపుగా యూఎస్సీఐఆర్ఎఫ్ అభివర్ణించింది. ఈ బిల్లును తీవ్రంగా పరిగణించిన కమీషన్ తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది.

లోక్ సభలో అమిత్ షా ప్రవేశపెట్టిన బిల్లు పూర్తిగా మతపరమైనదిగా ఉందని కమిషన్ వ్యాఖ్యానించింది. కాగా, లోక్ సభలో అమోదం పోందిన బిల్లును త్వరలోనే పెద్దల సభలో కూడా ప్రవేశపెట్టనున్నారు. ఉభయసభల్లో ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే అమల్లోకి రావడమే తరువాయి. పార్లమెంట్ ఉభయసభల్లో బిల్లు అమోదం పోందినపక్షంలో.. దానిని ప్రవేశపెట్టిన హోంమంత్రి అమిత్‌ షా సహా ఇతర నేతలు, అధికారులపై అమెరికా ప్రభుత్వం ఆంక్షలు విధించాలని యూఎస్సీఐఆర్ఎఫ్ వ్యాఖ్యానించింది.

ఈ బిల్లుకు అమోదం లభిస్తే పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి వలస వచ్చి మన దేశంలో ఆశ్రయం పొందుతున్న హిందువులు, సిక్కులు, బౌద్దులు, జైనులు, క్రైస్తవులు, పార్సీలకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ బిల్లు ప్రకారం 2014 డిసెంబర్ 31కి ముందు మన దేశంలోకి వచ్చిన ఈ మతాలవారిని అక్రమ వలసదారులుగా గుర్తించరు. వారికి పౌరసత్వం కల్పించి భారతీయ పౌరులుగా గుర్తిస్తారు. అయితే, ఈ బిల్లు మత వివక్షను సూచిస్తోందని కొన్ని విపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి.

 కాగా అమెరికన్‌ కమిటీ అభ్యంతరాలను భారత్‌ తోసిపుచ్చుతూ మతపరమైన మైనారిటీ శరణార్ధుల కష్టాలను తొలగించడం, వారి కనీస మానవ హక్కులను గౌరవించేందుకే ఈ బిల్లు ఉద్దేశమని స్పష్టం చేసింది. పౌరసత్వ బిల్లు, ఎన్‌ఆర్సీల ద్వారా ఏ ఒక్కరి పౌరసత్వానికి విఘాతం కలగదని తెలిపింది. పౌరసత్వ విధానాలను క్రమబద్ధీకరించే హక్కు అమెరికా సహా ప్రతి దేశానికీ ఉంటుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తేల్చిచెప్పింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles