Hyderabad metro passengers can now stream on the go మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఫ్రీ ఇంటర్నెట్..

Hyderabad metro passengers can now stream on the go

android, favorite movies, freeplay app, hmrl managing director, hyderabad, hyderabad hard news, hyderabad latest news, hyderabad metro, hyderabad news, ios, jbs-mgbs route, local wifi network, metro rail passengers, mobiles, music, nvs reddy, sugarbox, sugarbox zones

Metro Rail passengers can now watch their favorite movies and listen to music of their choice at the click of a button on their mobiles with Hyderabad Metro in association with SugarBox launching a seamless access to the app.

మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఫ్రీ ఇంటర్నెట్..

Posted: 12/10/2019 04:03 PM IST
Hyderabad metro passengers can now stream on the go

మెట్రో రైలు ప్రయాణికులకు హెచ్ఎంఆర్ఎల్ సంస్థ తీపి కబరును అందించింది. ఇకపై ప్రతి రోజు ఈ రైళ్లలో ప్రయాణించేవారికి ఇది గుడ్ న్యూస్. మెట్రో రైలు ప్రయాణికులకు జీ5 మొబైల్‌ అప్లికేషన్‌ సేవలను హైదరాబాద్‌ మెట్రో రైల్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక దీంతో ఉచిత ఇంటర్నెట్ సౌకర్యాన్ని ప్రయాణికులు వినియోగించుకోవచ్చు. ఆందుకోసం లోకల్ వైఫై నెట్ వర్క్ సేవలను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతొ ప్రయాణికులు మొబైల్‌ డేటాను వినియోగించకుండానే వీడియోలు చూసే అవకాశం కల్పించింది.

మెట్రోలో షుగర్‌ బాక్స్‌ నెట్ వర్క్ ను మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి ప్రారంభించారు. షుగర్‌ బాక్స్‌ నెట్ వర్క్ తో ఇంటర్నెట్‌ లేకుండానే వీడియోలు చూసే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఎన్వీఎస్‌ రెడ్డి మాట్లాడుతూ.. తొలుత 10 మెట్రోస్టేషన్లలో షుగర్‌ బాక్స్‌ మెట్రో లోకల్‌ వై-ఫై సేవలను ప్రారంభించినట్లు తెలిపారు. త్వరలోనే మరిన్ని స్టేషన్లలో అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. మెట్రో రైళ్లలో వినోదం, మేధోసంపత్తిని పెంచే పుస్తకాలు ఉంచాలని కోరామని ఎన్వీఎస్‌ రెడ్డి చెప్పారు.

కాగా జీ5 సేవలను 60 రోజుల వరకు ఉచితంగా అందిస్తామని షుగర్‌ బాక్స్‌ సీఈవో రోహిత్‌ తెలిపారు. తర్వాత ప్రీమియం ఛార్జీలు వసూలు చేస్తామని చెప్పారు. ప్రతి రోజు మెట్రోలో ప్రయాణించే వారికి ఎంతో ఉపయోగమన్నారు. గేమింగ్‌, ఫుడ్‌, ఈ-కామర్స్‌, ఈ-లెర్నింగ్‌ లాంటివి కూడా అందుబాటులోకి తెస్తామని రోహిత్‌ వివరించారు. మెట్రో స్టేషన్లలో ప్రజలకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. రెండో దశ మెట్రో డీపీఆర్‌ సిద్ధమైందని, దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles