Cops parade bar dancers for safety check భద్రత కోసమే.. అభద్రతాభావంతో.. బార్ గర్ల్స్ వీడియో వైరల్..

Cops parade bar dancers for safety check probe launched

Safety check, Mira-Bhayandar, Human rights, Humiliation, kashimira police, cops parade, bar dancers, viral video, video viral, Varsha Kale, Mumbai, crime

A departmental inquiry has been launched against Kashimira police personnel for allegedly parading bar dancers in Mira-Bhayandar. An officer from the Kashimira police said bar dancers are allowed to work till 9.30 pm while singers can stay on till 1.30 am.

భద్రత కోసమే.. అభద్రతాభావంతో.. బార్ గర్ల్స్ వీడియో వైరల్..

Posted: 12/09/2019 03:46 PM IST
Cops parade bar dancers for safety check probe launched

ముంబైలో బార్ గాళ్స్ ను చెప్పులు లేకుండా పోలిస్ స్టేషన్ కు నడిపించుకుంటూ తీసుకెళ్లిన ఘటనపై ముంబై పోలీస్ ఉన్నతాధికారులు శాఖపరమైన విచారణను అదేశించారు. ముంబై లాంటి ప్రాంతాల్లో బార్లలో బార్ గాళ్స్ ను వినియోగించుకోవచ్చిన దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన అదేశాల నేపథ్యంలో స్థానిక పోలీసు అధికారి కొత్తగా వచ్చారని వెంటనే బార్ గాళ్ల్స్ ను పోలిస్ స్టేషన్ ను కాళ్లకు చెప్పులు లేకుండా తీసుకెళ్లారు. అయితే వీరిని అలా తీసుకెళ్లే దృష్యాలు నెట్టింట్లో హల్ చల్ చేయడం.. కామెంట్లు రావడంతో.. స్పందించిన అధికారులు ఈ ఘటనపై విచారణకు అదేశించారు.

ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ముంబై లోని మీరా భయాందర్ ప్రాంతంతో పాటు శాంతా క్రూజ్ ప్రాంతంలో బార్లలో కొందరు మహిళా డాన్సర్లుగా, కొందరు సింగర్లుగా పనిచేస్తున్నారు. అయితే డాన్సర్లలో పలువురిని కొందరు అర్థనగ్నంగా నృత్యాలు చేయాలన్న వార్తలు వెలుగులోకి వచ్చాయి. దీంతో మరుసటి రోజున పోలీసులు డాన్సర్లను పోలిస్ స్టేషన్ కు తరలించారు. అయితే హుటాహుటిన వచ్చిన పోలీసులు వారిని కదలాలని అదేశాలు జారీ చేయడంతో.. వారు కాళ్లకు చెప్పులు కూడా లేకుండా పోలిస్ స్టేషన్ కు బయలు దేరారు.

ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయ్యింది. దీంతో ఉన్నతాధికారులు ఈ ఘటనపై విచారణకుఅ అదేశించారు. ‘‘తాము రోడ్డుపై నడుచుకుంటూ వస్తుంటే రోడ్డుపై వెళ్లే పోకిరీలు తమను చూసి అసభ్యంగా కామెంట్ చేశారని, దీంతో తాము ఎంతో మనోవేదనకు గురయ్యామని’’ ఈ క్రమంలో ఓ బార్ డాన్సర్ తన బాధను వ్యక్తం చేసింది. కాగా, ముంబైలో రాత్రి 9.30 గంటల సమయం వరకు బార్ డాన్సర్లు వుండవచ్చునని, రాత్రి 1.30 నిమిషాల వరకు సింగర్లు కూడా విధులు నిర్వహించుకునే వెసలుబాటును న్యాయస్థానం కల్పించిందని తెలిపారు. అయితే సాధారణ తనిఖీల్లో భాగంగా నే బార్ డాన్సర్లను ఇలా తీసుకెళ్లామని కొందరు అధికారులు పేర్కోంటుండగా, బార్ డాన్సర్లు, సింగర్ల భద్రత నేపథ్యంలోనే స్టేషన్ కు పిలిపించామని మరికొందరు తెలిపారు. మరి విచారణ అధికారులు ఏం తేలుస్తారో వేచి చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Safety check  Mira-Bhayandar  Human rights  Humiliation  cops parade  bar dancers  Mumbai  crime  

Other Articles