Disha rape-murder accused were minors ‘దిశ’ ఎన్ కౌంటర్ కేసులో ఇద్దరు మైనర్లు.?

Parents of accused rapists claim 2 of them were minors

Disha, veterinary doctor, veterinary disha, disha case parents, disha parents encounter, disha case accused, cyberabad police, commissioner Sajjanar, mohammad arif, Siva, Navin, Chennakeshavulu, National Human Rights Commission, minors in disha case, minors encounter, NHRC, crimes against women, Telangana, Crime

At least two of the four men accused of raping and murdering Disha and later killed in a police encounter were minors, according to their family members. The families have also alleged before National Human Rights Commission (NHRC) that all four were killed in a fake encounter.

‘దిశ’ ఎన్ కౌంటర్ కేసులో మరో ట్విస్టు.. మృతుల్లో ఇద్దరు మైనర్లు.?

Posted: 12/10/2019 11:20 AM IST
Parents of accused rapists claim 2 of them were minors

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన దిశ హత్యాచార నిందితుల ఎన్ కౌంటర్ లో కొత్త ట్విస్టు నెలకొంది. జాతీయ మానవహక్కుల సంఘం సభ్యులు వచ్చి నిందితుల  కుటుంబసభ్యుల నుంచి వివరాలు సేకరించిన క్రమంలో నిందితుల్లో ఇద్దరు మైనర్లని తేలింది. ఈ విషయంలో ఎన్ కౌంటర్ జరిగిన తరువాత పోలీస్ కమీషనర్ వెలువరించిన వివరాల్లో నిజం లేదని స్పష్టం అవుతోంది. ఈ వివరాలను ఎన్ హెచ్ఆర్సీ సభ్యులు ఆదారాలతో పాటు సేకరించారని తెలుస్తోంది. ఎన్ కౌంటర్ లో హతమైన ప్రధాన నిందితుడు మహమ్మద్ ఆరిఫ్ వయస్సు 26గా, జోల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు వయస్సు 20 అని సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్ తెలిపారు.

కాగా నిందితుల్లో ఇద్దరు మైనర్లు వున్నారని వారి పుట్టిన రోజు తేదీలను బట్టి తెలుస్తొందని, ఇదే విషయాన్ని నిందితులు తల్లిదండ్రులు మానవ హక్కుల సంఘం విచారణ బృందానికి కూడా వివరించి.. తగు ఆదారాలను కూడా సమర్పించారని సమాచారం. మైనర్లైన తమ బిడ్డలను పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయం నుంచి ఎన్ కౌంటర్లో హతమార్చే సమయం వరకు అంతా పోలీసుల డైరెక్షన్ లో నడిచిందని, ఈ వ్యవహారంలో కనీసం తమను తమ బిడ్డలతో మాట్లాడించలేదని నిందితుల తల్లిదండ్రులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

ఈ మేరకు నిందితుల ఆధార్ కార్డులు, పాఠశాల బోనఫైడ్ సర్టిఫికెట్లను అధికారులు సేకరించారు. వాటి ప్రకారం ఓ నిందితుడి పుట్టిన రోజు ఆగస్టు 15, 2002. దాని ప్రకారం అతడి వయసు 17 సంవత్సరాల ఆరు నెలలు. అయితే, ఆధార్‌కార్డులో మాత్రం 2001గా నమోదైంది. మరో నిందితుడి పుట్టిన తేదీ ధ్రువపత్రంలో 10 ఏప్రిల్ 2004గా ఉంది. అంటే అతడి వయసు 15 సంవత్సరాల 8 నెలలు మాత్రమే. దీంతో నిందితుల వయసుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మహ్మద్ ఆరిఫ్, చెన్నకేశవులు లారీ డ్రైవర్లు అని పోలీసులు పేర్కొన్నారు. అయితే, వారికి డ్రైవింగ్ లైసెన్స్ లేదని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Disha  veterinary doctor  encounter  minors in disha case  minors encounter  NHRC  Congress  

Other Articles