Man gets ready to marry another girl after being engaged కళ్యాణ ఘడికలు.. కటకటాలు లెక్కబెట్టించాయ్..!

Man gets ready to marry another girl after being engaged

Mohan Krishna, assistant manager, Tirupati, State Bank Employee, Kurnool, Nandyal, Engagement, Marriage, Andhra Pradesh, Crime

A man who was engaged with a girl got ready to marry another girl. Mohan Krishna who was a resident of Kurnool was working as an assistant branch manager in SBI in Tirupati. The engagement ceremony of Mohan Krishna with a girl took place earlier and he also received some amount of cash as dowry from the family members.

ITEMVIDEOS: కళ్యాణ ఘడికలు.. కటకటాలు లెక్కబెట్టించాయ్..!

Posted: 12/09/2019 10:24 AM IST
Man gets ready to marry another girl after being engaged

అధిక కట్నం ఆశకు పోయి.. పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు.. కటకటాల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు. కళ్యాణ గడియలు వచ్చాయని భావిస్తున్న క్రమంలో ఆ వరుడికి అరదండాలు వేయించాయ్. అందుకు కారణం అధిక కట్నం. అంతేకాదు మోసం. ఓ యువతితో నిశ్చితార్థం చేసుకుని, అంతకన్నా అధిక కట్నం ఇస్తున్నారన్న కారణంగా మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు పెళ్లిపీటలెక్కాడు. అయితే నిశ్చితార్థం చేసుకున్న అమ్మాయి కుటుంభికులకు ఈ విషయం గురించి సమాచారం ఇవ్వకుండా మోసం చేశాడు.

దీని ఫలితంగా పెళ్లి పీటలు ఎక్కిన యువకుడు పోలీసు స్టేషన్లో ఊచలు లెక్కిస్తున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. చిత్తూరు జిల్లాకు చెందిన మోహనకృష్ణ తిరుపతిలోని ఓ బ్యాంకులో పనిచేస్తున్నాడు. నంద్యాలకు చెందిన యువతితో అతడికి పెళ్లి కుదిరింది. ఆదివారం వివాహం జరగాల్సి ఉంది. ఊరేగింపుగా పెళ్లి మండపానికి చేరుకునేందుకు మోహన్‌కృష్ణ గుర్రం ఎక్కుతున్నాడు. సరిగ్గా అప్పుడే అనుకోని సంఘటన జరిగింది.

మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌కు చెందిన కొందరు అక్కడికి చేరుకుని మోహనకృష్ణను పట్టుకుని చితకబాదారు. ఒకరితో నిశ్చితార్థం చేసుకుని మరొకరిని ఎలా పెళ్లాడతావని నిలదీశారు. కట్నకానుకలు తీసుకుని జాతకాలు కలవలేదని ముఖం చాటేయడమేంటని ప్రశ్నించారు. తీసుకున్న కట్నం తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో వారి బారి నుంచి తప్పించుకున్న నిందితుడు మండపానికి చేరుకుని పెళ్లి పీటలపై కూర్చున్నాడు. వధువు మెడలో తాళి కట్టబోతుండగా అతడిని వెతుక్కుంటూ వచ్చిన మక్తల్ వాసులు మరోమారు అతడిపై దాడిచేశారు.

వరుడు చేసిన మోసం గురించి తెలిసిన వధువు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తామిచ్చిన కట్నకానులు, ఖర్చులు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు పెళ్లి కొడుకును అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తీసుకెళ్లారు. కాగా, నిందితుడు మోహన్‌కృష్ణ ఇరు కుటుంబాల నుంచి కట్నకానుకల కింద రూ. 12 లక్షల వరకు డబ్బులు, 6 తులాల చొప్పున బంగారం తీసుకోవడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles