Trial in Hajipur case will end soon, says Police హాజీపూర్ శ్రీనివాస్ రెడ్డికి త్వరలోనే శిక్ష ఖరారు..!

Hajipur serial rape murders trial in case will end soon says police

disha rape case, Unnao, accuses, srinivas reddy, hajipur, bommalaramaram, hyderabad rape murder case, hyderabad encounter, hyderabad rape accused killed, hyderabad rape accused shot dead, Hyderabad, Telangana, Crime

"All the evidences and DNA samples that match with the accused have been handed over to the fast-track trial court,” ACP Bhongir, Bhujanga Rao told

హాజీపూర్ శ్రీనివాస్ రెడ్డికి త్వరలోనే శిక్ష ఖరారు..!

Posted: 12/07/2019 04:42 PM IST
Hajipur serial rape murders trial in case will end soon says police

దిశ హత్యాచార ఘటనలో నిందితులను ఎన్ కౌంటర్ చేసి హతమార్చిన క్రమంలో.. ముక్కుపచ్చలారని పదకొండేళ్ల చిన్నారితో పాటు ముగ్గురు మైనర్ బాలికలపై అత్యాచారం చేసి అత్యంత దారుణంగా హతమార్చి.. తన భావిలోనే పూడ్చిపెట్టిన కరుడగట్టిన నేరగాడు హాజీపూర్ శ్రీనివాస్ రెడ్డి అంశం కూడా మరోమారు తెరపైకి వచ్చింది. శ్రీనివాస్ రెడ్డిని కూడా ఎన్ కౌంటర్ చేయాలని.. లేదా.. తమకు అప్పగించాలని హాజీపూర్ గ్రామస్థులు డిమాండ్ చేస్తూ యాదాద్రి జిల్లా బోమ్మల రామారం మండలకేంద్రంలో ధర్నాకు దిగారు.  

గత ఏప్రిల్‌ 25న బొమ్మలరామారంలోని పాఠశాల నుంచి హాజీపూర్‌కు తిరిగి వెళ్తుండగా శ్రావణి (16) అదృశ్యమైంది. అదే రోజు రాత్రి ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు ఏప్రిల్‌ 26న శ్రీనివాస్‌రెడ్డి బావిలో శ్రావణి మృతదేహాన్ని కనుగొన్నారు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. విస్తుగొలిపే నిజాలు వెల్లడయ్యాయి. దీంతో ఆగ్రహానికి గురైన హాజీపూర్‌ వాసులు శ్రీనివాస్‌రెడ్డి ఇంటిని తగలబెట్టారు. అదే గ్రామానికి చెందిన తిప్పరబోయిన మనీషా (20) ఇంటర్‌ చదువుతోంది. ఈ అమ్మాయి ఈ ఏడాది మార్చి 9న అదృశ్యమైంది. ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

శ్రావణి హత్యనంతరం పోలీసులు తమదైన శైలిలో శ్రీనివాస్‌రెడ్డిని విచారించగా మార్చిలో అదృశ్యమైన మనీషానూ తానే అత్యాచారం చేసి హత్య చేశానని ఒప్పుకొన్నారు. దీంతోపాటూ 2015 ఏప్రిల్‌ 22న అదృశ్యమైన మైసిరెడ్డిపల్లికి చెందిన కల్పన (11)నూ తానే హత్య చేశానని అంగీకరించడంతో యావత్‌ రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ముక్కుపచ్చలారని బాలికలను అత్యాచారం చేసి హత్య చేయడంతో నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆ రెండు గ్రామాల ప్రజలతో పాటూ ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు డిమాండ్‌ చేశాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : disha rape case  Unnao  accuses  srinivas reddy  hajipur  bommalaramaram  Hyderabad  Telangana police  Crime  

Other Articles