Man dies in queue for subsidy onions in gudiwada వృద్దుడి ఉసురు తీసిన ఉల్లి.. గుడివాడలో ఘటన

Man dies in queue for subsidy onions in gudiwada

Onion, Subsidy onions, rythu bazar, queue line, sambaiah, suffacation, Heart attack, cardiac arrest, Heart stroke, Gudiwada, Krishna, Andhra Pradesh, Crime

An old man standing in queue line for subsidy onions in gudiwada rythu bazar has suddenly suffered a heart attack and died in krishna district of Andhra Pradesh

వృద్దుడి ఉసురు తీసిన ఉల్లి.. గుడివాడలో ఘటన

Posted: 12/09/2019 11:17 AM IST
Man dies in queue for subsidy onions in gudiwada

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదన్నది పెద్దల నానుడి. అలాంటి ఉల్లి ఏకంగా మనుషుల ప్రాణాలను కూడా తీస్తోందని మాత్రం ఎవ్వరూ ఊహించివుండరు. కానీ అదే జరుగుతోంది. ఉల్లి ధరకు రెక్కలు వచ్చి.. ఆకాశానికి తాకేందుకు వెళ్తున్న క్రమంలో ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజలకు ఊరట కల్పించేందుకు రాయితీపై రైతు బజార్లలో ఉల్లి చౌక ధరకు విక్రయిస్తోంది. దీంతో బహిరంగ మార్కెట్లో ఉల్లిని కొనలేక.. సబ్సీడీ ఉల్లి కోసం రైతు బజారుకు వెళ్లిన ఓ వృద్దుడు క్యూలైన్లో అమాంతం ప్రాణాలు విడిచాడు.

ఘటన వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన సాంబయ్య అనే వృద్దుడు (65) ఇవాళ ఉదయం తెల్లవారు జామునే ఉల్లి కోసం మార్కెటుకు వెళ్లాడు. ఉల్లి ధరలు పెరిగిపోవడంతో రైతు బజార్ల వద్ద సబ్సీడి ఉల్లిని కిలోకు రూ.25లకే ప్రభుత్వం విక్రయిస్తోంది. అయితే దీనిని అందుకునేందుకు ఉదయం నుంచే స్థానికులు క్యూలైన్లో నిల్చుంటున్నారు. అందరి మాదిరిగానే సాంబయ్య కూడా ఇవాళ ఉధయమే వెళ్లి క్యూలైన్లో నిల్చున్నాడు. క్యూలో ఉన్న ఆయన అకస్మాత్తుగా కళ్లు తిరిగి పడిపోవడంతో చుట్టుపక్కల వారు  వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Subsidy onions  rythu bazar  sambaiah  Heart stroke  Gudiwada  Krishna  Andhra Pradesh  Crime  

Other Articles