man disguised as a woman to feed aged parents తల్లిదండ్రుల పోషన కోసం.. పగలు లేడీ.. రాత్రి బీడి..

Madurai man disguised as a woman for feeding aged parernts

Madurai man turns lady housemaid, Madurai man turns woman housemaid, Shiva gangai, ManaMadurai, Raju lady maid, Raju day woman, Raju night man, Man disguised as a woman, housemaid, viral photos, Tamil Nadu, weird news

Shiva gangai man who disguised as a woman to do the job of a housemaid was caught by the locals. Raju (40) says he is doing this to feed his aged parents, HIs male and female photos are going viral online.

తల్లిదండ్రుల పోషన కోసం.. పగలు లేడీ.. రాత్రి బీడి..

Posted: 12/07/2019 01:30 PM IST
Madurai man disguised as a woman for feeding aged parernts

అతను నిరక్షాసి.. అయితే తనకు ఉద్యోగం కూడా ఎవరూ ఇవ్వడం లేదు.. నలభై ఏళ్లు వస్తున్నా అతనికి పెళ్లి కూడా కాలేదు. అయితేనేం.. తన తల్లిదండ్రులను పోషన బాధ్యత మాత్రం తనదే అని గుర్తెరిగిన వ్యక్తి.. ఊరు కాని ఊరుకెళ్లి.. తన వేషం మార్చి.. పడరాని పాట్లు పడుతూ.. రాత్రి కాగానే తన గ్రామానికి వచ్చి తల్లిదండ్రులను చూసుకుంటున్నాడు. కాన్వెంటులో చదివించినా.. కారుల్లో తిప్పినా.. మాకేం అస్తులు ఇస్తున్నావ్.. అంటూ ప్రశ్నించే సంతానం అధికమవుతున్న ఈ రోజుల్లో.. కన్నవారి కోసం కష్టాలను కూడా ఇష్టంగా స్వీకరించే వ్యక్తులు ఎంతమంది వుంటారు.

ఈ కష్టాలను పడుతున్న వ్యక్తి తమిళనాడులోని మదురైకి చెందిన వాడు. అదేంటి మేము మాత్రం ఉదయం లేచి రాత్రి వరకు ఒళ్లు హూనం చేసుకుని కష్టపడటం లేదా.? అంటే ఆ కష్టంలో భార్యపిల్లల వాటా కూడా వుంటుందిగా.? కానీ ఇక్కడ ఈ వ్యక్తికి ఆ ఛాన్సు కూడా లేదు. ఇక పోతే పోట్ట చించినా అక్షరం ముక్క రాదు. కానీ ఇళ్లలో పనిచేయడం మాత్రం తెలుసు. అంట్లు తోవడం.. బట్టలు ఉతకడం ఇలాంటి పనులు చేస్తాడు. కానీ పురుషులకు ఈ పనులు ఎవరిస్తారు.? అందుకనే ఈ వ్యక్తం ఏకంగా ఆమ్మాయి వేషంలో మార్చుకుని ఇళ్లలో పాచిపనులు చేస్తున్నాడు.

గత ఆరు నెలలుగా ఇలానే చేస్తూ పొట్టపోసుకుంటున్న అతడి ఫొటోలు తాజాగా సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో వైరల్ అయ్యాయి. శివగంగై జిల్లా మానామదురై గ్రామానికి చెందిన అతడి వయసు 40 ఏళ్లు. ఊరి నుంచి ప్రతి రోజు బస్సులో లుంగీ, షర్టుతో మదురై చేరుకుంటాడు. అక్కడ ఎవరూ కనిపించని ప్రదేశంలో లుంగీ, షర్ట్ విప్పేసి తలకు విగ్ ధరించి ఆడవేషం వేస్తాడు. అనంతరం ఆ ప్రాంతంలోని మూడు ఇళ్లకు వెళ్లి పాచిపనులు పూర్తిచేసుకుని మళ్లీ అదే ప్రాంతానికి వస్తాడు. ఆ దుస్తులు విప్పేసి మళ్లీ మగాడిగా మారిపోయి ఇంటికి వెళ్లిపోతాడు.

గత కొంతకాలంగా అతడి వేషాలను చూస్తున్న ఆ ప్రాంత ప్రజలు అనుమానించారు. తాజాగా అతడిని పట్టుకుని నిలదీశారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తన పేరు రాజా అని, రాజాత్తిగా పేరు మార్చుకుని ఇంటి పనులు చేస్తున్నానని చెప్పడంతో వారు షాకయ్యారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పోషించుకునేందుకు ఇంతకుమించిన మార్గం కనిపించలేదని వాపోయాడు. తనకు పెళ్లి కాలేదని, తాను పనిచేస్తున్న ఇళ్లవారు ఇప్పటి వరకు తనను అనుమానించలేదని చెప్పుకొచ్చాడు. ఎప్పుడో ఒకప్పుడు ఈ విషయం బయటపడుతుందని తనకు తెలుసని, అయినప్పటికీ తన పరిస్థితి తెలిసిన తర్వాత ఎవరూ తనను పనిలోంచి తీసేయరన్న నమ్మకం ఉందని రాజా పేర్కొన్నాడు. ఉదయం పూట లేడీ లా రాత్రి పనులు ముగించుకుని ఇంటికెళ్లేప్పుడు మాత్రం ఒక బిడీని కాల్చి వెళ్తుంటాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Madurai  Shiva gangai  Raju lady maid  housemaid  viral photos  Tamil Nadu  weird news  

Other Articles

Today on Telugu Wishesh