Saudi Trainee Kills 3 in Shooting at Florida Naval Base అగ్రరాజ్యంలో మళ్లీ కాల్పుల మోత.. నలుగురు మృతి

Saudi student kills three in attack at florida naval air station

Florida, Gun crime, US, Canada, United States, Gun violence, Saudi Arabia, donald trump, pensacola naval base, US news

An aviation student from Saudi Arabia opened fire in a classroom building at the naval air station (Nas) in Pensacola, Florida, on Friday morning, a US official said

అగ్రరాజ్యంలో మళ్లీ కాల్పుల మోత.. నలుగురు మృతి

Posted: 12/07/2019 12:25 PM IST
Saudi student kills three in attack at florida naval air station

అగ్రరాజ్యం అమెరికాలో మరోమారు కాల్పుల మోతలు ధద్దరిల్లాయి. సాధారణంగా పాఠాశాల్లో లేదా విశ్వవిద్యాలయాల్లో లేదా పనిచేసే చోట మాత్రమే కలకలం రేపే కాల్పులు.. ఈ సారి ఏకంగా నావికా దళంలో మార్మోగాయి. దీంతో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నుంచి భద్రతా దళాలు, ప్రజల వరకు అందరూ ఈ కాల్పులపై అందోళనకు గురయ్యారు. అమెరికాలోని ఫ్లోరిడాలో ప్రాంతంలో గల పెన్సాకోలా నావల్ ఎయిర్ స్టేషన్ లో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ కాల్పులలో నలుగురు నావికాధళ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

పెన్సాకోలా నౌకాశ్ర‌యం ఎయిర్ స్టేషన్ లో శిక్షణ పోందుతున్న సౌదీ ఎయిర్ ఫోర్స్ అధికారి కాల్పులకు తెగబడ్డాడని అధికారులు తెలిపారు. ముగ్గురు శిక్షకులు చనిపోగా, కాల్పులు జరిగిన అధికారిపై వెంటనే ప్రతిస్పందించిన పోలీసులు కాల్పులు జరిపడంతో ఆయన కూడా చనిపోయాడని పోలీసులు తెలిపారు. కాల్పులకు పాల్పడిన సౌదీకి చెందిన అధికారిని.. మహమ్మద్ సయీద్ అలమ్రాణి గా గుర్తించినట్టు పోలీసులు చెప్పారు. అయితే ఈ కాల్పులకు వ్యక్తిగత నేపథ్యంలో సాగినవా లేక ఉగ్రవాదం నేపథ్యంలో జరిగినవా.? అన్న విషయాలపై తాము దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఇక ఈ ఘటనను మరో ముగ్గురు అధికారులు తమ సెల్ ఫోన్లో చిత్రీకరించడం కనిపించిందని, వీరు కాకుండా మరో ముగ్గురు కూడా సౌదీ విద్యార్థులు అక్కడే శిక్షణ పోందుతున్నారని పోలీసులు తెలిపారు. కాగా ఘటనను చిత్రీకరించిన ముగ్గురిని కూడా తాము అదుపులోకి తీసుకున్నామని.. వారిని అన్ని కోణాల్లో విచారిస్తున్నామని అధికారులు తెలిపారు. అయితే వీరికి ఉగ్రవాదానికి మధ్య ఏమైనా సంబంధాలు వున్నాయా అన్న కోణంపై అధికారుల దర్యాప్తు సాగుతుందని సమాచారం. కాగా, ఈ కాల్పుల్లో మరో  ఎనిమిది మంది గాయ‌ప‌డ్డారని అధికారులు చెప్పారు.

కాల్పుల ఘటనపై స్పందించిన అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఈ ఘటనను వ్య‌క్తిగ‌తంగా ప‌ర్య‌వేక్షిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ ఘటన వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందా? అన్న విషయంపై ఏమీ మాట్లాడని ఆయన.. మృతుల కుటుంబాలకు తాము అండగా వుంటామని చెప్పారు. ఘటనపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారని.. దర్యాప్తులో పూర్తైన తరువాత మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. కాగా ఈ ఘటనపై ప్లోరిడా గవర్నర్ రాన్ డి సాన్టిస్ తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Florida  Gun crime  US  Canada  United States  Gun violence  Saudi Arabia  donald trump  pensacola naval base  US news  

Other Articles