Want to see accused shot dead: Unnao victim’s father ‘‘వాళ్లలాగే వీళ్లను కాల్చేయండీ’’: ఉన్నావ్ మృతురాలి తండ్రి

Want to see accused shot dead or hanged unnao victim s father

Unna rape survivor death, Hyderabad encounter, Hyderabd vet rape and murder, justice to victims, Unnao rape victim father, speedy justrice, Uttar pradesh police, Safdarjung Hospital, Unnao rape victims set ablaze, Harishankar Trivedi, Ram Kishore Trivedi, Umesh Bajpai, Yogi Adityanath, Hyderabad, Telangana, Crime

'I do not want money or any other kind of help. I want to see that the accused are shot dead or hanged to death', he says. Sitting on the doorstep of their house, the victim’s father was categorical in saying that he demands justice on the lines the Hyderabad case.

‘‘వాళ్లలాగే వీళ్లను కాల్చేయండీ’’: ఉన్నావ్ మృతురాలి తండ్రి

Posted: 12/07/2019 02:57 PM IST
Want to see accused shot dead or hanged unnao victim s father

ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి మరణం పట్ల ఉత్తరప్రదేశ్‌ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కేసును నమోదు చేయడంతో పాటు బాధితురాలికి రక్షణ కల్పించడంలోనూ పోలీసులు, ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యారని స్థానికులు, ప్రజాసంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. న్యాయస్థానికి వెళ్లున్న బాధితురాలిపై కిరోసిన్ పోసి నిప్పంటించి దారుణంగా హతమార్చారని.. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులందరికీ ఉరిశిక్ష లేదా ఎన్ కౌంటర్ లో కాల్చివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

నిందితులకు మరణ శిక్షే సరైనదని ఆమె సోదరుడు అభిప్రాయపడ్డారు. ‘‘మా సోదరి ఇక మాతో లేదు. ఈ ఘోరానికి కారణమైన ఐదుగురి నిందితులకు మరణ శిక్ష విధించాలన్నదే నా ఏకైక డిమాండ్‌’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని సఫ్దార్‌జంగ్‌ ఆసుపత్రిలో బాధితురాలు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. కాగా, బాధితురాలి తండ్రి మాట్లాడుతూ..‘‘నా కూతురు మరణానికి కారణమైన వారిని పోలీసులు కాల్చి చంపితేనే నాకు నిజమైన ఓదార్పు. నాకు ఆర్థిక సహాయంగానీ ఇరత ఎలాంటి సహకారం అసవరం లేదు. పోలీసులు వారిని పరిగెత్తించి కాల్చి చంపాలి. లేదా ఉరి తీయండి. అని డిమాండ్ చేశారు.

అత్యాచారం ఘటన జరిగిన నాటి నుంచి నిందితులు మమ్మల్ని ప్రతిరోజూ వేధిస్తూనే ఉన్నారు. ధనబలంతో మాకు న్యాయం జరగకుండా చూడాలని ప్రయత్నిస్తున్నారు. వారిని ఎదిరించే ధైర్యం గ్రామంలో ఎవరికీ లేదు. పైగా వారి బెదిరింపులను ప్రజలే వచ్చి మాకు చెబుతున్నారు’’ అంటూ వాపోయారు. మరో సమీప బంధువుకు సైతం దోషుల కుటుంబసభ్యుల నుంచి బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. వారి ధన బలం ముందు పోలీసులు, ప్రభుత్వాలే వెనుకంజ వేస్తున్నాయని, అందుకే అత్యాచార కేసులో ఇద్దరు నిందితుల్లో ఒకరు మాత్రమే అరెస్టయ్యారని, మరోకరు ఇప్పటికీ ఇంకా పరారీలోనే వున్నట్లు పోలీసు రికార్డుల్లో వుందని అన్నారు.

కాగా, న్యాయస్థానానికి వెళ్తున్న తమ కూతురిపై పెట్రోల్ పోసి దారుణంగా హత్య చేసేందుకు మాత్రం పరారీలో వున్నవాడు ఎలా వచ్చాడో పోలీసులే సమాధానం చెప్పాలని ఆయన నిలదీశాడు. ఈ ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ స్పందించారు. బాధితురాలి మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ కేసులో నిందితులందరినీ అరెస్టు చేశామని.. త్వరితగతిన విచారణ పూర్తి చేస్తామన్నారు. నిందితులకు కఠిన శిక్షపడేలా చూస్తామన్నారు. సీఎం వ్యాఖ్యలపై పలువురు ప్రజాసంఘాల కార్యకర్తలు స్పందిస్తూ.. ఇన్నాళ్లు పరారిలో ఉన్నావాడినే పట్టుకోలేని వారు ఇప్పుడెలా శిక్షిస్తారని నిలదీస్తున్నారు.

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఉన్నావ్‌కు చెందిన యువతి గత ఏడాది డిసెంబరులో అత్యాచారానికి గురైంది. పెళ్లి పేరుతో ఆమెను నమ్మించి మోసం చేసిన ఓ నిందితుడు అప్పట్లో అరెస్టై, గత నెల 25నే విడుదలయ్యాడు. అనంతరం మరికొందరితో కలిసి ఆమెను హత్య చేసేందుకు పన్నాగం పన్నాడు. అత్యాచార కేసు విచారణలో భాగంగా రాయ్‌బరేలీలోని కోర్టుకు హాజరయ్యేందుకుగాను గురువారం ఉదయం బాధితురాలు బయలుదేరగా.. ఐదుగురు వ్యక్తులు కలిసి ఆమెపై దాడి చేశారు. కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. అత్యాచారం కేసులో నిందితులుగా ఉన్న శివం త్రివేది, శుభం త్రివేది కూడా సజీవదహనానికి యత్నించినవారిలో ఉన్నారు. తీవ్రగాయాలపాలైన బాధితురాలిని మెరుగైన చికిత్స కోసం వాయుమార్గంలో గురువారం దిల్లీకి తరలించినా ఫలితం లేకపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : unnao  rape case  Unnao Rape  Encounter  Punishment  gang rape  cyberabad police  Crime  

Other Articles