Congress welcomes Disha accused Encounter ‘దిశ’ నిందితుల ఎన్ కౌంటర్ ను స్వాగతించిన కాంగ్రెస్

Congress welcomes disha accused encounter in lok sabha

Disha, veterinary doctor, veterinary disha, disha case parents, disha parents encounter, disha case accused, cyberabad police, commissioner Sajjanar, mohammad arif, Siva, Navin, Chennakeshavulu,Parliament, Winter Session, Lok Sabha, Rajya Sabha, parliament live, winter session live, lok sabha updates, lok sabha adjourned, crimes against women, Telangana, Crime

Leader of the Congress in the Lok Sabha, Adhir Ranjan Chowdhury, says: “The Unnao victim has 95% burns, what is going on in the country? On one hand there is a Lord Ram temple being built and on the other hand, Sita Maiya is being set ablaze. How are criminals feeling so emboldened?”

పార్లమెంటును కుదిపేసిన ‘దిశ’ నిందితుల ఎన్ కౌంటర్

Posted: 12/06/2019 04:38 PM IST
Congress welcomes disha accused encounter in lok sabha

దిశ హత్యాచార నిందితుల ఎన్ కౌంటర్ అంశంపై పార్లమెంట్ ఉభయసభలను కుదిపేసింది. దేశంలో మహిళలకు అసలు రక్షణ లేకుండా పోతోందని.. ఉన్నావ్ ఘటనను లోక్ సభలో ప్రస్తావించిన కాంగ్రెస్.. హైదాబాద్ పోలీసుల చర్యలను స్వాగతించింది. ఎన్ కౌంటర్ పై లోక్ సభలో తొలుత విపక్ష కాంగ్రెస్‌ జీరో అవర్ లో లేవనెత్తింది. దేశంలో మహిళలపై దాడులు దారుణంగా పెరిగిపోతున్నాయని, ప్రభుత్వాలు రూపొందించిన చట్టాలు కనీసం అమలుకు నోచుకోవడం లేదని కాంగ్రెస్‌ లోక్ సభాపక్ష నేత అదీర్‌ రంజన్‌ చౌదరి సభలో పేర్కొన్నారు.

అనంతరం షాద్ నగర్‌ ఘటనపై తెలంగాణ పోలీసులు వ్యవహరించిన తీరును ఆయన లోక్‌సభలో ప్రస్తావించారు. దిశ కేసుకు సంబంధించి పోలీసులు నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేసి హతమార్చడాన్ని చూసి ఈ ప్రభుత్వం సిగ్గుపడాలని అన్నారు. మహిళల రక్షణకు సర్కార్ తీసుకుంటున్న చర్యలను ఈ ఎన్ కౌంటర్లు ప్రశ్నిస్తున్నాయని అన్నారు. అయితే హైదారాబాద్ పోలీసుల చర్యలను తాము స్వాగతిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్‌ సభ్యులతో పాటు పలు పార్టీలకు చెందిన ఎంపీలూ దిశ నిందితుల ఎన్ కౌంటర్ కు మద్దతుగా తమ గళాన్ని వినిపించారు.

అయితే ఉత్తర ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ కోర్టులో విచారణకు హాజరయ్యేందుకు వెళ్తున్న ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలిపై దుండగులు పెట్రోల్‌ పోసి నిప్పంటించిన ఘటనపై కాంగ్రెస్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి ఘటనలు జరుగుతుంటే దేశంలో మహిళలు క్షేమంగా ఎలా జీవిస్తారని ప్రశ్నించింది. అయోధ్యలో రామాలయాన్ని నిర్మిస్తున్న ఈ తరుణంలో ‘ సీతలను కాల్చేస్తున్నారని ‘ ఆయన ఆవేశంగా వ్యాఖ్యానించారు. ఉన్నావ్‌ ఘటన నిందితులకు కూడా ఎన్‌కౌంటర్‌ చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. ఉన్నావ్‌ ఘటనకు నిరసనగా సభ నుంచి వాకౌట్‌ చేస్తున్నట్లు కాంగ్రెస్‌ ప్రకటించింది.

మరోవైపు రాజ్యసభలోనూ దిశ నిందితుల ఎన్ కౌంటర్ ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తమయింది. నిర్భయ నిందితులకు శిక్ష పడి ఏడేళ్లు గడుస్తున్నా.. ఉరిశిక్షను ఎందుకు అమలు చేయడం లేదంటూ ఆప్‌ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిర్భయ తల్లి ఆశాదేవి గత ఏడేళ్లుగా తమ కూతురి హత్యాచార ఘటనకు ఎప్పుడు న్యాయం జరుగుతుందా.? అని ఎదురుచూస్తున్నారని అవేదన వ్యక్తం చేసింది. దేశంలో మహిళలకు కనీస రక్షణ లేకుండా పోయిందని, కఠిన శిక్షలు పడేలా చట్టాలను మార్చాలని ఆప్‌ డిమాండ్‌ చేసింది.

అయితే విపక్షాల ఆరోపణలపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌, ఉ‍న్నావ్‌ ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. కానీ ఇలాంటి ఘటనలను రాజకీయం చేయడం సరైనది కాదని విపక్షాలపై  ఎదురుదాడికి దిగారు. మహిళలపై దాడులకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు అమలు చేసి తీరుతామని మంత్రి లోక్‌సభలో స్పష్టం చేశారు.  తమ ప్రభుత్వంలో మహిళల సంక్షేమ కోసం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు చెప్పుకొచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles