rahul gandhi gives a cute gift to his student translator రాహుల్ స్పీచ్ ను అనువందించి.. మొప్పుపొందిన విద్యార్థిని..

Rahul gandhi presents a cute gift to his student translator

rahul gandhi speech in wayanad, rahul gandhi speech translated in Malayalam, student translated rahul gandhi speech, Congress, rahul gandhi, English speech, translator, Malayalam, intermiediate student, safa, wayanad, kerala, politics

All India Congress Commitee former President and Wayanad Member of Parliament, Rahul Gandhi presents a cute gift to his student Translator in wayanad visit.

ITEMVIDEOS: రాహుల్ స్పీచ్ ను అనువందించి.. మొప్పుపొందిన విద్యార్థిని..

Posted: 12/06/2019 03:44 PM IST
Rahul gandhi presents a cute gift to his student translator

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కేరళలోని వాయనాడ్ పార్లమెంటు నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులలో పాల్గోన్నారు. ఈ క్రమంలో పలు చోట్ల ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అమేధి తరహాలో తాను సొంతంగా వాయినాడ్ నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చుకునే పనిలో వున్నారు రాహుల్. ఈ సందర్భంగా ఓ విద్యాసంస్థ ల్యాబ్ ప్రారంభోత్సవానికి విచ్చేశారు. సైన్స్ ల్యాబ్ ప్రారంభోత్సవం చేసిన తరువాత స్తానిక పాఠశాల యాజమాన్యంతో పాటు నేతలు కోరడంతో ప్రసంగించేందుకు రెడీ అయ్యారు.

అయితే వాయినాడ్ పాఠశాలలో వున్న వారికి ఆంగ్లం కానీ హిందీ కానీ అర్థం కాదు. ఇక రాహుల్ గాంధీకి మలయాళం బాష రాదు. దీంతో ఎలా.. అని అలోచనలో పడగా, అక్కడున్న కాంగ్రెస్ నేతలకు కూడా ఆంగ్లం నుంచి మలయాళంలోకి తర్జుమా చేయడం రాకపోవడంతో.. స్వయంగా రాహుల్ గాంధీయే మైక్ లో ఎవరైనా తన ప్రసంగాన్ని అనువదించగలరా.? అని అడిగారు. దీంతో కాళాశాలలోని సఫా అనే విద్యార్థిని ముందుకు వచ్చింది. అమె పూర్తి పేరు సఫా షిబిన్. అమె ఎంతో ధైర్యంగా ముందుకు వచ్చింది. రాహుల్ ప్రసంగాన్ని అనువదించింది. ఆమె స్థైర్యాన్ని చూసి రాహుల్ గాంధీ కూడా ప్రోత్సహించారు.

సఫా అక్కడున్న అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ రాహుల్ ప్రసంగాన్ని పొల్లు పోకుండా అనువదించి ఔరా అనిపించింది. ఆమె అనువాదం చేసిన ప్రతిసారి చప్పట్లతో సభా ప్రాంగణం మార్మోగిపోయింది. చివరికి రాహుల్ సైతం సఫా ప్రతిభకు ముగ్ధుడయ్యారు. దీంతో ఈ చిన్నారికి మంచి భవిష్యత్ వుందని ఆమెకు ఓ క్యూట్ గిప్ట్ కూడా ఇచ్చి సంతోషపెట్టారు. రాహుల్ అంతటివాడ్ని అచ్చెరువొందించిన ఆ ఇంటర్ విద్యార్థినిని విద్యాసంస్థ యాజమాన్యం, ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Congress  rahul gandhi  English speech  translator  Malayalam  intermiediate student  safa  wayanad  kerala  politics  

Other Articles