Kill me too: Accused wife with police ‘‘ఆ చోటే నన్నూ కాల్చండీ’’: నిందితుడి భార్య

Families of hyderabad rape accused cry foul on police encounter

Disha, veterinary doctor, veterinary disha, disha case parents, disha parents encounter, disha case accused, cyberabad police, commissioner Sajjanar, mohammad arif, Siva, Navin, Chennakeshavulu, Ranga Reddy district, quick justice in hyderabad, Hyderabad rape case, Hyderabad encounter, hyderabad case, disha lorry drivers, disha veterinary doctor encounter, crimes against women, Telangana, Crime

The killing of the four accused in the Hyderabad veterinarian's gang-rape and murder has shocked their families, who questioned the police action of gunning them down in an 'encounter' even before a trial. Chennakeshavulu's pregnant wife Renuka wanted the police to kill her too. "I cannot live without my husband. Kill me too," she said crying inconsolably.

ITEMVIDEOS: ‘‘ఆ చోటే నన్నూ కాల్చండీ’’: నిందితుడి భార్య

Posted: 12/06/2019 05:26 PM IST
Families of hyderabad rape accused cry foul on police encounter

వెటర్నరీ డాక్టర్ దిశపై అత్యాచారం చేసిన కేసులో నిందితులుగా వున్న నలుగురినీ ఇవాళ తెల్లవారు జామూన జరిగిన ఎన్ కౌంటర్లో పోలీసులు వారిని చంపేశారని వార్తలు విన్న నిందితుల కుటుంబ సభ్యులు హతాశులయ్యారు. నిందితులను కాల్చినందుకు తమకు బాధ లేదని.. అయితే ఇలాంటి ఘటనలకు పాల్పడినవారు అనేకమంది జైళ్లలో, భయటా వున్నారని.. వారిని కాదని ఈ కేసులోని నిందితులనే ఎందుకు ఎన్ కౌంటర్ చేశారని నిందితుల కుటుంబసభ్యులు ప్రశ్నిస్తున్నారు.

ఇలాంటి కేసుల్లో నిందితులుగా జైళ్లలో ఉన్నవారిని కూడా చంపేయాలని దిశ కేసు నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్య రేణుక ధర్నా చేస్తోంది. ఈ ఎన్‌కౌంటర్ జరిగినందుకు ప్రజలంతా ఖుషీలో ఉన్నారని, కానీ గతంలో ఇలాంటి సంఘటనలు చేసిన నిందితులను కూడా ఇలానే కాల్చేయండి అంటూ ఆమె డిమాండ్ చేస్తోంది. ఈ నలుగురి ఎన్ కౌంటర్ తో న్యాయం జరగదని, ఇలాంటి కేసుల్లో వున్నవారందరినీ చంపడంతోనే న్యాయం జరుగుతుందని అమె ధర్నా చేస్తోంది.

అయితే ఈ ఎన్‌కౌంటర్ పై ఈ ఉదయం మాట్లాడిన ఆమె.. తన భర్తను ఎన్ కౌంటర్ చేసిన చోటే తనను చంపేయండి అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్తను అన్యాయంగా పోలీసులు చంపేశారని చెన్నకేశవులు భార్య చెబుతోంది. ఒక అమ్మాయి కోసం నలుగురిని పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కేసులో కోర్టు తీర్పు ఇవ్వకముందే పోలీసులు ఇలా చేయడం తప్పని అన్న ఆమె.. తనను కూడా అదే ప్రదేశంలో చంపేయండి అని తన బాధను వ్యక్తపరిచింది. కాగా జోళ్లు శివ తల్లిదండ్రులు కూడా ఇదే విషయాన్ని తెరపైకి తీసుకువచ్చారు. మా బిడ్డలను చంపడం బాధాగానే వున్నా.. ఇలాంటి ఘటనలకు పాల్పడిన అనేక మంది వున్నారని వారందరినీ ఎందుకు వదిలేశారని ఆయన ప్రశ్నించారు.
 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Disha  veterinary doctor  encounter  Disha parents  mohammad Arif  Siva  Navin  Chennakeshavulu  cyberabad police  Crime  

Other Articles