Disha case: Accused reveals, victim burnt alive ‘దిశ’ హత్యాచార నిందితుల ఎన్ కౌంటర్.. అసలేం జరిగింది.?

Hyderabad disha case all accused killed in encounter

Priyanka reddy, veterinary doctor, disha, disha case prime accused, disha case A1 accused, mohammad arif, Siva, Navin, Chennakeshavulu, priyanka reddy lorry drivers, priyanka reddy veterinary doctor, crimes against women, Telangana, Crime

All the four accused in the kidnap, rape and murder of Disha were killed in an alleged ‘encounter’ early Friday morning near Shadnagar, where they committed the crime. The bodies of Arif, the main accused, and Siva, Navin and Chennakeshavulu, have been shifted to the Osmania General Hospital for post-mortem.

ITEMVIDEOS: ‘దిశ’ హత్యాచార నిందితుల ఎన్ కౌంటర్.. అసలేం జరిగింది.?

Posted: 12/06/2019 11:03 AM IST
Hyderabad disha case all accused killed in encounter

యావత్ దేశంలో నిర్బయ కేసు తరువాత అంతటి సంచలనాన్ని రేకెత్తించిన వెటర్నరీ వైద్యురాలు దిశ హత్యాచార కేసులోని నిందితులందరూ హతమయ్యారు. పోలీసుల తక్షణ స్పందన కరువై.. దిశ మానవ మృగాళ్ల మధ్య చిక్కిశల్యమై.. చివరకు పైశాచిక మృగాళ్ల చేతిలో దహనమైన ప్రాంతంలోనే నలుగురు అగంతకుల కథను పోలీసులు ముగించారు. తమకు ఉరిశిక్ష తప్పదని పోలీసులు చెప్పడం.. ఇక న్యాయవాదులు ఎవ్వరూ తమ తరుపున వాదించకూడదని నిర్ణయించుకోవడంతో తమను తామే రక్షించుకోవాలని.. పారిపోతున్న నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసి హతమార్చారు.

అసలేం జరిగిందీ.. ఎక్కడ జరిగింది.? పోలీసులను కాదని నిందితులు ఎలా పారిపోయేందుకు నిర్ణయించుకున్నారు.? తప్పించుకోగలరని అనుకున్నారా.? అన్న వివరాల్లోకి వెళ్తే.. దిశ హత్యాచారం కేసులో నిందితులతో రహస్యంగా సీన్ రీకన్ స్ట్రక్షన్ తీసుకువెళ్లారు పోలీసులు. గురువారం ఉదయాన్నే రహస్యంగా ఇలా తీసుకెళ్లిన పోలీసులు మరోమారు శుక్రవారం కూడా తీసుకెళ్లారు. అయితే నిన్నటి మాదిరిగానే ఇవాళ కూడా తీసుకెళ్తారని నిందితులకు ఎలా అర్థమైయ్యిందో తెలియదు కానీ.. పోలీసులు తమను మరోమారు ఘటనాస్థలానికి తీసుకెళ్తే తప్పించుకోవాలని కూడబలుకుకున్నారు.

అయితే పోలీసులు తమను ఆయుధాలతో కాల్చేస్తారని ప్రస్తావన కూడా వచ్చిందని.. దీంతో వారు పోలీసులు తుపాకులనే లాక్కుని వాటితో సినీపక్కీలో పారిపోదామని నిర్ణయానికి వచ్చారు. యధావిధిగా మరిన్ని వివరాల కోసం శుక్రవారం తెల్లవారుజామున నలుగురు నిందితులు ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులు తో పాటు పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లారు. తమ విచారణలో భాగంగా సీన్ రీకన్ స్ట్రక్షన్ నిమిత్తం వారిని ఘటనా స్థలికి తీసుకు వెళ్లిన వేళ, వారు కూడబలుకు కున్నట్లు తప్పించుకునేందుకు అదను కోసం వేచి చూశారు.

ఇంతలో దిశను లారీ నుంచి ఎలా తీసుకువచ్చింది. ఎలా దహనం చేసింది చూపిన తరువాత పోలీసుల నుంచి తుపాకులు లాక్కుని నిందితులు పారిపోయారు. ఆరిఫ్, శివలు పోలీసుల నుండి రెండు తుపాకులు లాక్కుని పరిగెత్తుతుండగా, మిగతా ఇద్దరు నిందితులు నవీన్, చెన్నకేశవులు వారిని అనుసరించారు. ఈ ఘటన చటాన్ పల్లి జాతీయ రహదారి వంతెన కింద, ఎక్కడైతే దిశను కాల్చి చంపారో అక్కడే జరిగింది. లొంగిపోవాలని, లేకుంటే కాల్చేయాల్సి వుంటుందని పోలీసులు అరుస్తున్నా నిందితులు వినలేదు.

తాము తప్పించుకోవడమే పరమావధి అన్నట్లు నిర్ణయించుకున్న నిందితులు.. ఆ సమయంలో పోలీసుల హెచ్చరికలను లక్ష్యపెట్టకుండా.. తాము లాక్కున్న ఆయుధాలతో పోలీసులపైనే దాడికి దిగేందుకు నిందితులు ప్రయత్నించారు. దీంతో, పోలీసులు కాల్పులు జరపక తప్పలేదు. ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు నిందితులూ మరణించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు నిర్ధారించారు. అసలు ఏం జరిగిందన్న విషయాన్ని అధికారుల కమిటీ విచారణ జరిపి తేలుస్తుందని వెల్లడించారు. కాగా, దిశ ఘటనలో ఎన్ కౌంటర్ ఎందుకు చేయాల్సి వచ్చిందన్న విషయమై డీసీపీ ప్రకాశ్ రెడ్డి వెల్లడించారు.

దిశ హత్యకేసులో నిందితులను తాము తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్ కౌంటర్ చేయాల్సి వచ్చిందని శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి వెల్లడించారు. ఈ తెల్లవారుజామున నిందితులను నిన్నటి మాదిరిగానే సీన్ రీకన్ స్ట్రక్షన్ కోసం ఘటనాస్థలానికి తీసుకువచ్చామని తెలిపారు. అయితే ఈ సమయంలో నిందితుల్లోనే ఆరిఫ్, శివలు తమ పోలీసుల నుంచి తుపాకులు లాక్కుని పారిపోయేందుకు యత్నించారని.. ఈ క్రమంలో వారిని లోంగిపోమ్మని కూడా హెచ్చిరించామని చెప్పారు. అయినా తమ మాటలను వారి వినిపించుకోకుండా కాల్పులు జరిపారని.. దీంతో ఆత్మరక్షణార్థం జరిపిన కాల్పుల్లో నిందితులు మరణించారని ప్రకాశ్ రెడ్డి తెలిపారు. తామేమి ఎన్ కౌంటర్ చేయాలని భావించలేదని స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Priyanka reddy  Disha  veterinary doctor  mohammad Arif  Siva  Navin  Chennakeshavulu  cyberabad police  Crime  

Other Articles