Disha case: cyberabad commissioner visits encounter spot ‘దిశ’ నిందితుల ఎన్ కౌంటర్.. ఘటనాస్థలానికి సీపీ సజ్జనార్..

Hyderabad disha case cyberabad commissioner visits encounter spot

Priyanka reddy, veterinary doctor, disha, disha case prime accused, disha case accused, cyberabad police, commissioner Sajjanar, mohammad arif, Siva, Navin, Chennakeshavulu, priyanka reddy lorry drivers, priyanka reddy veterinary doctor, crimes against women, Telangana, Crime

All the four accused in the kidnap, rape and murder of Disha were killed in an alleged ‘encounter’ early Friday morning near Shadnagar, as they tried to escape. Senior police officials reached to the spot, including cyberabad police commissioner Sajjanar.

ITEMVIDEOS: ‘దిశ’ నిందితుల ఎన్ కౌంటర్.. ఘటనాస్థలానికి సీపీ సజ్జనార్..

Posted: 12/06/2019 11:43 AM IST
Hyderabad disha case cyberabad commissioner visits encounter spot

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్యకేసులో నిందితులందరూ పోలీసుల ఎన్ కౌంటర్ లో హత్యమయ్యారు. అయితే అసలేం జరిగింది.? వారిని ఎందుకు ఎన్ కౌంటర్ చేయాల్సి వచ్చిందన్న విషయాలే ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారాయి. అయితే పోలీసుల మాత్రం ఎన్ కౌంటర్ చేయాల్సిన పరిస్థితులు ఎందుకు ఉత్పన్నమయ్యాయన్న విషయాలపై ఉన్నతస్థాయి విచారణ కమిటీని వేశారురు. అసలు ఏం జరిగిందన్న విషయాన్ని అధికారుల కమిటీ విచారణ జరిపి తేలుస్తుందని వెల్లడించారు.

ఈ కేసులో దిశ అదృశ్యమైన వెంటనే తాము పోలిస్ స్టేషన్ కు వెళ్లినా.. అక్కడి పోలీసుల స్పందన సరిగ్గా లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అంతేకాకుండా చులకనగా మాట్లాడారని దిశ తండ్రి పోలీసులపై అరోపణలు చేసిన క్రమంలో ఈ విషయమై సైబరాబాద్ పోలీసులపై వ్యవహార తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అంతటితో ఆగని జనాగ్రహం నిందితులను తమకు అప్పగించాలని ఏకంగా శంషాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. ఈ క్రమంలో నిందితులందరూ దిశ దహనానికి గురైన చలాన్ పల్లి బ్రిడ్జి వద్దే ఎన్ కౌంటర్ కు గురికావడం పలు ప్రశ్నలకు తావిస్తోంది.

అయితే అసలేం జరిగిందన్న విషయాలతో పాటు.. ఎలా జరిగిందన్న వివరాలను తెలుసుకునేందుకు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్ ఘటనాస్థలానికి వెళ్లారు. అక్కడ పోలీసుల అధికారులను అడిగి ఎన్ కౌంటర్ ఎలా జరిగిందన్న వివరాలను తెలుసుకున్నారు. పోలీసుల ఆయుధాలను లాక్కుని పారిపోతున్న సమయంలో అధికారులు ఏం చేస్తున్నారని, ఇద్దరు నిందితులు తుపాకులు లాక్కుని ఎలా పారిపోయారన్న ప్రశ్నలను అధికారులకు సంధించారు. లొంగిపోకుండా తమపైకి రాళ్లు ఎక్కడి నుంచి రువ్వారన్న వివరాలను కూడా ఆయన పోలీసులను అడిగి తెలుసుకున్నారు.

కాగా ఎన్ కౌంటర్ జరిగిందన్న విషయాన్ని తెలుసుకున్న పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలు, నగరం నుంచి కూడా పలువురు పెద్దఎత్తున ఘటనాస్థలికి వచ్చారు. వందలాది మంది ఆ ప్రాంతంలో చేరి "పోలీసులూ జై", "జస్టిస్ ఫర్ దిశ", "సజ్జన్నార్ జిందాబాద్" అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వారు, తమ వాహనాలను సైతం బ్రిడ్జ్ వద్ద ఆపి ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని చూసేందుకు ఆసక్తి చూపుతుండటంతో ట్రాఫిక్ స్తంభించింది. ఆ ప్రాంతానికి అదనపు బలగాలను ఇప్పటికే తరలించిన అధికారులు, ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించే పనిలో పడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles