Ensure safety of women working late hours: UP Police రాత్రి వేళ ఒంటరిగా మహిళ.. హోటల్ కు తీసుకెళ్లిన ఎస్పీ

Cop spots woman walking alone at night takes her to hotel pulls up employer

Alok Priyadarshi, Ambedkaranagar, Hardoi, woman employee, nights, woman, safety situation, Hotel, promote, Uttar Pradesh, Crime

SP Alok Priyadarshi, a police officer in Uttar Pradesh’s Hardoi, was appalled to see a woman employee walking home alone at night post completing her shift at a nearby hotel. Considering the safety situation, he decided to drop her back at the hotel.

రాత్రి వేళ ఒంటరిగా మహిళ.. హోటల్ కు తీసుకెళ్లిన ఎస్పీ

Posted: 12/05/2019 04:58 PM IST
Cop spots woman walking alone at night takes her to hotel pulls up employer

అర్థరాత్రి మహిళ ఒంటరిగా తిరిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్య వచ్చినట్లు అని జాతిపిత మహాత్మాగాంధీ అప్పట్లో ఎందుకు వ్యాఖ్యాలు చేశారో కానీ.. వాటి అర్థం నిర్భయ, దిశ, అభయ ఘటనలు జరిగిన క్రమంలో బోధపడుతోంది. ఇవి కేవలం దేశవ్యాప్తంగా సంచలనమైన ఘటనలు మాత్రమే. ఎన్నో ఎన్నెన్నో ఘటనలు నమోదె అవుతున్నాయి. ప్రతి నిమిషానికి మహిళలు, పిల్లలపై ఏదో రకంగా అఘాయిత్యాలు, లైంగికదాడులు జరుగుతున్నాయన్నది మాత్రం అక్షర సత్యంగా మారుతుంది., వీటిలో ఠాణాల వరకు వెళ్లినవి కొన్ని అసలు వెలుగులోకి రానివి మరికొన్ని.

గాంధీజీ అన్న మాట అర్థరాత్రి కానీ ఇవాళ సమాజాంలో పట్టపగలు మహిళలు ఒంటిరిగా కనబడితే చాలు.. మానవరూపంలోని మగపైశాచిక మృగాళ్లు కామంతో కాటేస్తున్నాయి. మహిళకు రక్షణ.. గాల్లో దీపం వంటిదేనని దిశ ఘటనతో తేటతెల్లమైంది. దిశ కేసులో అరెస్టయిన నిందితులకు సత్వరంగా మరణ దండన విధిస్తేనే.. ఇలాంటి ఘటనలు తగ్గుముఖం పడతాయని ప్రజలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పుడు దేశమంతటా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పోలీసులు మహిళల రక్షణకు ఎంత అప్రమత్తంగా ఉండాలో చెప్పేందుకు ఈ ఘటన స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.

ఉత్తరప్రదేశ్‌లో రాత్రి వేళ గస్తీ నిర్వహిస్తున్న ఎస్పీ అలోక్ ప్రియదర్శికి రోడ్డు మీద ఒంటరిగా నడుచుకెళ్తున్న ఓ మహిళా ఉద్యోగి కనిపించింది. దీంతో ఎస్పీ ఆమె వద్దకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె ఓ హోటల్ లో పనిచేస్తుందని, పని పూర్తి కావడంతో ఇంటికి తిరిగి వెళ్తున్నానని చెప్పింది. దీంతో ఆయన ఆమెను పోలీస్ వాహనం ఎక్కించుకుని ఆమె పనిచేస్తున్న హోటల్ కు తీసుకెళ్లాడు. మహిళా ఉద్యోగులను రాత్రి వేళల్లో ఇలా ఒంటరిగా వదలకూడదని, తప్పకుండా వారికి క్యాబ్ సదుపాయం కల్పించాలంటూ హోటల్ యజమానికి చివాట్లు పెట్టారు.

దీంతో ఆ హోటల్ యజమాని ఆమె కోసం క్యాబ్ బుక్ చేసి ఇంటికి పంపాడు. ఇకపై నగరంలో హోటళ్లయినా, సంస్థలైనా రాత్రి వేళల్లో డ్యూటీ చేసే మహిళలను ఒంటరిగా కాకుండా క్యాబ్ బుక్ చేసి పంపాలని అలోక్ ఆదేశించారు. లేనట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకోవల్సి ఉంటుందని హెచ్చరించారు. అలోక్ చేసిన పనికి సోషల్ మీడియా ప్రశంసలు కురిపిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. అయితే ఘటనలు జరిగిన క్రమంలోనే కాకుండా ప్రతి నిత్యం ఇలాంటి చర్యలకు యాజమాన్యాలు పూనుకోవాలని కూడా పోలీసులు సూచిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Alok Priyadarshi  Ambedkaranagar  Hardoi  woman employee  nights  woman  safety situation  Hotel  promote  Uttar Pradesh  Crime  

Other Articles