Another fiasco in sacred Yadadri యాదాద్రిలో శాంతమూర్తి.. ఇక ఉగ్రనరసింహుడా.?

Another wrongdoing at yadadri temple has diety been tampered with

Yadadri Narasimha, Swayambhu deity Lord Narasimha, Yadagiri Gutta Narasimha Swamy Temple, yadadri diety tampered, Narasimha Swamy Temple, diety tampered, Chinna Jeeyar Swamy, KCR pictures Yadadri temple pillars, yadadri, KCR pictures, yadadri temple, Agama rules, telangana, politics

A major controversy raged over the chiselling of the Swayambhu deity Lord Narasimha at Yadradri. There are allegations that the deity, who is considered Swayambhu or sui generis and making changes to the deity's form and shape is considered sacrilegious.

యాదాద్రిలో మరో అపచారం.. స్వయంభువు విగ్రహానికి మార్పులు.?

Posted: 12/04/2019 04:28 PM IST
Another wrongdoing at yadadri temple has diety been tampered with

తెలంగాణవాసులు పరమపవిత్రంగా ఆరాధించే యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం మహిమాన్వితమైనదని అనాధికాలం నుంచి భక్తులు విశ్వసిస్తుంటారు. మూలవిరాటు స్వయంభువుగా వెలిసిన పుణ్యక్షేత్రమిది. స్థలానికి వున్న ఐతిహ్యం, విశిష్టతో భక్తులు అనునిత్యం యాదగిరీశుడిని దర్శనానికి బారులు తీరుతుంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ తిరుపతిలా దీనిని అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం పూనుకుంది. ఏ ముహూర్తంలో ఇందుకు శ్రీకారం చుట్టిందో కానీ.. ఇన్నాళ్లు సవ్యంగా సాగినా ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తికావస్తున్న దశలో మాత్రం అపచారాలకు ఆలవాలంగా మారుతుంది.

ఇప్పటికే సీఎం కేసీఆర్ చిత్రాలతో పాటు అధికార పార్టీ ఎన్నికల గుర్తుతో పాటు ప్రభుత్వ పథకాలను ఆలయ రాతి శిలలపై చెక్కడం ఇప్పటికే తీవ్ర దుమారం రేగడంతో.. వాటి విషయంలో వెనక్కు తగ్గిన ప్రభుత్వం.. ఈ విషయమై కమిటీని వేసి.. ఆ రాతి శిలలను కూడా యాదాద్రి నుంచి తప్పించింది. దీంతో ఇక మరో రెండు మూడు నెలల్లో ఆలయంలో మహాసుదర్శన యాగం నిర్వహించిన అనంతరం భక్తుల సందర్శనకు అనుమతిస్తారని వార్తలు వస్తున్న క్రమంలో.. మరో మహాపచారం జరిగింది. ఆలయంలోని మూలవిరాట్టైన లక్ష్మీనరసింహస్వామి విగ్రహాన్ని చెక్కి మార్పులు చేశారన్న వార్తలపై కలకలం రేగుతోంది.

ఆగమ శాస్త్ర నిబంధనలకు విరుద్ధంగా పనులు సాగుతున్నాయని తెలుస్తోంది. సీఎం కేసీఆర్ వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి చినజీయర్ స్వామి పర్యవేక్షణలో ఆనందసాయి అనే ఆర్కిటెక్ట్ ఆధ్వర్యంలో యాదాద్రిని ఆలయ నగరంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ క్రమంలో యాదాద్రిని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే పనిలోభాగంగా కొత్త నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి. మూలవిరాట్టు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కొలువై ఉన్న గుహలో కూడా కొన్ని నిర్మాణాలు చేశారు. మూల విరాట్టును మరింత బాగా కనిపించాలని సంకల్పించారని తెలుస్తోంది.

ఈ పని కోసం మూడు నెలల క్రితం ఒక స్థపతిని పిలిపించగా స్వయంభువు విగ్రహాన్ని చెక్కడం మహా పాపమని మూల విరాట్టును తాకనే తాకనని ఆ స్థపతి చెప్పి వెళ్లిపోయాడని తెలుస్తోంది. ఆలయంలో పని చేసే ఒక శిల్పి మూల విరాట్టును శాంతమూర్తి నుండి ఉగ్ర మూర్తిగా చెక్కినట్లు తెలుస్తోంది. 15 రోజుల క్రితం కొందరు ఈ వివరాలను చినజీయర్ స్వామికి తెలిపారని సమాచారం. చినజీయర్ స్వామి ఆగ్రహం వ్యక్తం చేసి ఈవోను పిలిపించగా అలా ఏమీ చేయలేదని ఈవో చినజీయర్ స్వామికి చెప్పినట్లు సమాచారం. ఒక స్థపతి శాండ్ బ్లాస్టింగ్ మాత్రమే చేశారని చెప్పినట్లు సమాచారం.

యాదాద్రి ఈవో, ముగ్గురు ప్రధాన అర్చకులను ప్రగతి భవన్ కు రావాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. మాజీ స్థపతి సుందరరాజన్ కు కూడా చెన్నై నుండి రావాలని ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆగమ శాస్త్ర పండితులు మూల విరాట్టును చెక్కితే అది ముమ్మాటికి తప్పే అని చెబుతున్నారు. ప్రధాన అర్చకులు మాత్రం సింధూరం మాత్రం తొలగించామని ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని చెప్పినట్లు సమాచారం. మూల విరాట్టును ఎప్పుడూ ఎవరూ ఉలితో చెక్కలేదని సింధూరం తొలగించటం వలనే స్వయంభువు కోరలు బయటపడి ఉగ్రరూపం కనిపిస్తోందని ప్రధాన అర్చకులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles