Jana Sena President Pawan Kalyan Visits Tirumala తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పవన్ కల్యాణ్

Jana sena president pawan kalyan visits tirumala

Pawan Kalyan, JanaSena, Tirumala, Tirupathi, Lord Venkateshwara swamy, HInduism, YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, Religion, caste, Chirstianity, HInduism, colourism, pawan kalyan twitter, pawan tweet attack on ycp, YSRCP, Andhra Pradesh, Politics

Jana Sena Party Chief, Pawan Kalyan visited Tirumala as a part of his Rayalaseema tour. He was accompanied by Nadendla Manohar. He donned traditional outfits and offered prayers at the famous shrine today.

ITEMVIDEOS: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పవన్ కల్యాణ్

Posted: 12/04/2019 03:26 PM IST
Jana sena president pawan kalyan visits tirumala

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాయలసీమ పర్యటనలో భాగంగా తిరుపతికి చేరుకున్న ఆయన ఇవాళ ఉదయం పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తో పాటు పలువురు స్థానిక నేతలతో కలసి ఆయన తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. పవన్ కు స్వాగతం పలికిన ప్రొటోకాల్ అధికారులు, వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామి దర్శనం చేయించి, తీర్థ ప్రసాదాలు అందించారు. సంప్రదాయ దుస్తుల్లో తెల్లపు వర్ణం లుంగీ కాషాయ వర్ణపు పై పంచను బ్రహ్మణుల మాదిరిగా చుట్టుకున్న పవన్ కల్యాణ్ తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు.

శ్రీవారి దర్శనానంతరం మీడియా పలుకరించడంతో.. మాట్లాడిన పవన్ కల్యాణ్.. తిరుమల స్వామివారిని దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. తాను 30 సంవత్సరాల క్రితం తిరుపతిలో యోగాభ్యాసం నేర్చుకున్నానని చెప్పారు. ఈ సందర్భంగా తాను నిత్యం అనుసరించే స్తూకి కూడా ఇక్కడ నేర్చుకున్నదేనని.. అదే 'ధర్మో రక్షతి రక్షితః' అని తెలిపారు. ఏడుకొండల వాడి సన్నిధానం నుంచి నేర్చుకున్న దానినే ఇప్పటికీ త్రికరణశుద్దిగా పాటిస్తున్నానని అన్నారు. దేశం సుబీక్షంగా వుండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వెంకటేశ్వరుడుని ప్రార్థించినట్టు తెలిపారు. పవన్ ను చూసేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  JanaSena  Tirumala  Tirupathi  Lord Venkateshwara swamy  HInduism  Andhra Pradesh  Politics  

Other Articles