DRT officials serve notice to MP Sujana Chowdary ఎంపీ సుజనా చౌదరికి షాకిచ్చిన డీఆర్టీ అధికారులు..

Setback to mp sujana chowdary drt officials serves notices

sujana chowdary, DRT Notices, member of Rajyasabha, maritius bank, defaulter, padmaja, BJP MP, crime, Fraud

Setback to BJP Member of RajyaSabha Sujana Chowdary, as he had been served with notices by DRT Officials inconnection with maritius bank defaulter.

ఎంపీ సుజనా చౌదరికి డీఆర్టీ నోటీసులు, విచారణకు హాజరుకావాలని అదేశాలు

Posted: 12/04/2019 05:11 PM IST
Setback to mp sujana chowdary drt officials serves notices

బీజేపి రాజ్యసభ ఎంపి సుజనా చౌదరికి వత్రం చెడినా ఫలితం మాత్రం దక్కలేదన పరిస్థితి ఎదురైందని రాజకీయవర్గాల్లో పెద్ద చర్చకు తెరలేచింది. టీడీపీ నుంచి బీజేపిలోకి జంప్ అయిన ఈ నేతకు రామేశ్వరం వెళ్లినా శనేశ్వరం.. అన్నట్లు అధికార పార్టీలోకి వెళ్లినా డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యు ట్యాక్సెస్ (డిఆర్టీ) మాత్రం తన పని తాను చేసుకుపోయింది. చెన్నైలోని ఐడిబిఐ బ్యాంకు నుండి తీసుకున్న రూ.135 కోట్లను ఎగొట్టిన కేసులో డిఆర్టి నోటీసులిచ్చి షాకిచ్చింది. ఈనెల 16వ తేదీన డిఆర్టీసీ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరవ్వాలంటూ నోటీసులు స్పష్టంగా చెప్పారు.

సుజనా చౌదరి భార్య పద్మజతో పాటు మరికొందరికి డిఆర్టీ నోటిసులు ఇవ్వటం సంచలనంగా మారింది. బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకున్న ఎగొట్టారంటూ సుజనాపై ఇప్పటికే అనేక ఆరోపణలున్నాయి. మారిషస్ బ్యాంకులో తీసుకున్న రుణంలో రూ. 100 కోట్లను ఎగొట్టిన విషయంలో కేంద్రమంత్రిగా ఉన్నపుడే నాంపల్లి కోర్టు అరెస్టు వారెంటు ఇచ్చిన విషయం అప్పట్లో సంచలనమైంది. మొత్తం మీద టిడిపిలో కీలకంగా ఉన్న రాజ్యసభ సభ్యుడు సుజనాపై అప్పట్లో సిబిఐ, ఈడి, ఐటి శాఖల ఉన్నతాధికారుల నేతృత్వంలో అనేక దాడులు జరిగాయి.

దీంతో కేసులు, అరెస్టు నుండి తనను తాను రక్షించుకోవటానికి సుజనా చౌదరి వెంటనే మరో ముగ్గురితో కలిసి బిజెపిలోకి ఫిరాయించారు. అయితే సుజనా బిజెపిలోకి ఫిరాయించినా ఎగొట్టిన వందల కోట్ల రూపాయల కోసం డిఆర్టి ఆయన భార్య పద్మజకు నోటీసులివ్వటం సంచలనంగా మారింది. పైగా విచారణకు హాజరుకాకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరికలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇదే విషయమై బిజెపి నేతలు మాట్లాడుతూ తనపై నమోదైన కేసులకు సుజనానే సమాధానం చెప్పుకోవాలంటు సూచనలిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sujana chowdary  DRT Notices  member of Rajyasabha  maritius bank  defaulter  padmaja  BJP MP  crime  Fraud  

Other Articles