మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ల కూటమి ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో అంతకుముందు మహారాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకున్న ఘటనలపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తన మదిలోని మాటలను బయటపెట్టారు. సొంత పార్టీపై తిరుగుబాటు చేసి, బీజేపీతో చేతులు కలిపి, డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసి, ఆ తర్వాత రాజీనామా చేసి, మళ్లీ సొంతగూటికే చేరిన ఆ పార్టీ సీనియర్ నేత అజిత్ పవార్ పై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయనను బీజేపితో చేతులు కలిపేలా చేసింది కాంగ్రెస్ పార్టీ నేతలేనని నర్మగర్భవ్యాఖ్యాలు చేశారు.
మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నావీస్ తో అజిత్ పవార్ టచ్ లో ఉన్నట్టు తనకు తెలుసని చెప్పారు. అయితే అంతదూరం వెళ్లి వారు ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారన్న విషయం తనకు షాక్ కలిగించిందని అన్నారు. ఈ పరిణామం ఎన్సీపీ నేతలకే నచ్చలేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఇంతవరకు అజిత్ వెళ్లడానికి కారణం కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీల భేటీలో కాంగ్రెస్ నేతలు మరికొన్ని పదవుల కోసం డిమాండ్ చేశారు. ఇది నచ్చక సమావేశం నుంచి తాను వెళ్లిపోయానని... తనతో పాటు అజిత్ కూడా బయటకు వచ్చేశారని శరద్ పవార్ తెలిపారు.
అదే రోజు రాత్రి ఫడ్నవీస్ తో అజిత్ మంతనాలు సాగించారని చెప్పారు. అయితే, అంత దూరం వెళతారని మాత్రం ఊహించలేకపోయానని అన్నారు. నవంబర్ 23న డిప్యూటీ సీఎంగా అజిత్ ప్రమాణస్వీకారం చేయడం చూసి తాను కూడా ఆశ్చర్యానికి గురయ్యానన్నారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత అందరూ ఆయనకు మద్దతు పలుకుతున్నారని అన్నారు. ఇక అజిత్ భవిష్యత్ విషయమై మాట్లాడిన ఆయన.. ఆయన లాంటి నేతలకు పార్టీలకు చాలా అవసరమని.. ప్రతినిత్యం పార్టీ కోసం, పార్టీ కార్యకర్తల కోసం పనిచేస్తున్న నేత అయన అని కొనియాడారు. పార్టీలో ఆయనకు ప్రత్యేక స్థానం వుందన్నారు.
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు కోసం ఇటు కాంగ్రెస్, శివసేనతో పాటు బీజేపీతో కూడా ఎన్సీపీ చర్చలు జరిపిందని శరద్ పవార్ తెలిపారు. అయితే, కాంగ్రెస్ నాయకుల తీరు పట్ల అజిత్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారని... ఇదే ఆయన తిరుగుబాటుకు కారణం అయి ఉండవచ్చని చెప్పారు. ఇక తమ నూతన మిత్రుడు శివసేనతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని తేల్చిచెప్పాన శరద్ పవార్.. తమ పాతమిత్రుడైన కాంగ్రెస్ పార్టీతోనే తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో మూడు పార్టీల కూటమి ప్రభుత్వం మనుగడపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jan 25 | 2016 నవంబర్ 8వ తేదీ అనగానే దేశ ప్రజలకు బాగా గుర్తుండిపోయే అంశం పాత పెద్ద నోట్ల రద్దు. దాని పర్యవసానం దాదాపుగా ఆరు నెలలు వరకు దేశ ప్రజలపై వుండిపోయింది. అనేక ఆంక్షలు,... Read more
Jan 25 | కన్నడ చలన చిత్ర పరిశ్రమలో విషాదం అలుముకుంది. యువ నటి, కన్నడ బిగ్ బాస్ సీజన్-3 కంటెస్టెంట్ జయశ్రీ రామయ్య తన ఆశ్రమ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు, ఆమె మృతదేహం సీలింగ్... Read more
Jan 25 | వంశపారంపర్య, వారసత్వ రాజకీయాలపై బీజేపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ధీటుగా ఎదుర్కోన్నారు పశ్చిమ బెంగాల ముఖ్యమంత్రి మమతా బెనర్జి మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ. వారసత్వ రాజకీయాలపై తనతో పాటు తన మేనత్త... Read more
Jan 25 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయితీ ఎన్నికల నిర్వహణకు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పంచాయతీ ఎన్నికలకు రీషెడ్యూల్ చేశారు. పంచాయతీ... Read more
Jan 25 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయితీ ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ మార్చి తరువాత నిర్వహించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎదరుదెబ్బ తగిలింది. పంచాయతీ ఎన్నికలను యధావిధిగా... Read more