Former Minister Narayana Faces Bitter Experience అనంతలో మాజీమంత్రి నారాయణకు పరాభవం..

Bitter experiance to narayana educationa institutions chairman at anantapur

Narayana manhandled by students organisation, bitter experiance to narayana, narayana anantapur student organisations, P Narayana, Narayana educational institutes, Students obstruct, Amaravati, anantapur, Andhra Pradesh, video viral

Ponguru Narayana, a former minister and head of the Narayana educational institutes, had a bitter experience. Leaders of student unions attacked Narayana in Anantapur.

ITEMVIDEOS: అనంతలో మాజీమంత్రి నారాయణకు పరాభవం..

Posted: 12/04/2019 01:26 PM IST
Bitter experiance to narayana educationa institutions chairman at anantapur

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణకు అనంతపురం జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. తన విద్యాసంస్థలను పర్యవేక్షించేందుకు అనంతపురం జిల్లాకు వెళ్లిన ఆయనను అక్కడి విద్యార్థి సంఘాల నాయకుడోకరు ఘెరావ్ చేయడంతో పాటు కాలర్ పట్టుకుని నిలదీశారు. అంతటితో అగని విద్యార్థి సంఘాలు ఆయన ప్రయాణిస్తున్న కారును రాయితో మోది తమ నిరసనను వ్యక్తం చేశాయి. కాగా, తమ కాలేజీ సిబ్బంది సహకారంతో నారాయణ అక్కడి నుంచి బయటపడ్డారు.

ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే..  అనంతపురంలోని తమ కాలేజీల పరిస్థితులపై అధ్యయనం చేయడంతోపాటు పర్యవేక్షించేందుకు ఆ విద్యాసంస్థల అధినేత నారాయణ వెళ్లారు. అయితే నారాయణ కాలేజీల్లో ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారని.. ఇకపై ఫీజులను పెంచవద్దని జిల్లాకు చెందిన విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి. దీనికి తోడు జిల్లాలో కరువు విలయతాండవం చేస్తోందని.. ఈ క్రమంలో ఫీజులను పెంచి విద్యార్థులను వారి తల్లిదండ్రులను మానసికంగా ఇబ్బందులకు గురిచేయవద్దని కోరారు.

అయినా నారాయణ విద్యాసంస్థలు ఫీజులను పెంచడంతో.. ఆగ్రహానికి గురైన విద్యార్థి సంఘాల నాయకులు.. అధినేత నారాయణ వచ్చారన్న సమాచారాన్ని అందుకుని హుటాహుటిన కాలేజీకి చేరుకున్నారు. ఈ క్రమంలో నారాయణ బయటకు వెళ్తుండగా, అడ్డుకున్న విద్యార్థి సంఘాల నేతలు నారాయణను ఫీజుల పెంపుపై నిలదీశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కాలేజీలు నడుపుతున్నారని, వాటిని మూసివేయాలని ఆవుల రాఘవేంద్ర అనే యువకుడు నారాయణను అందరి ముందూ పట్టుకుని నిలదీశాడు. పక్కనే ఉన్న కొందరు అతన్నుంచి నారాయణను విడిపించి, కారు దగ్గరకు చేర్చగా, ఆయన వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles