Wads of currency notes rain on Kolkata street కొల్ కతాలోని బెంటిక్ వీధిలో కరెన్సీ నోట్ల వర్షం.!

It s raining rs 2000 and rs 500 notes on kolkata street

Kolkata Currency notes rain, locals, Currency notes rain, DRI raid, Bentinck Street, kolkata, west bengal Currency notes rain, Kolkata latest news, Kolkata news live, Kolkata news today, Today news Kolkata, Kolkata today news, kolkata news latest, Kolkata news, Kolkata good news, west bengal, crime

Bundles of currency notes rained on an arterial Central Kolkata street from a multi-storied office complex. Loose notes and bundles of various denominations -- Rs 2,000, Rs 500 and Rs 100 -- were thrown from one of the floors of the building on 27, Bentinck Street, as local shopkeepers, residents and commuters rushed in to collect the notes.

ITEMVIDEOS: కొల్ కతాలో కరెన్సీ నోట్ల వర్షం.! అందుకునేందుకు ఎగబడ్డ జనం.!!

Posted: 11/21/2019 11:37 AM IST
It s raining rs 2000 and rs 500 notes on kolkata street

ఓ రెండేళ్ల క్రితం దుబాయ్ లో కరెన్సీ నోట్ల వర్షం కురిసిందని విన్నాం. అలాంటిదే మన దగ్గర కూడా జరిగితే బాటుంటుందని చాలా బలంగా అనుకున్నట్లు వున్నారు పశ్చివ బెంగాల్ రాష్ట్రవాసులు. కొంత సమయం తీసుకున్నా నిన్న పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో కాసుల వర్షం కురిసింది. అంటే బలంగా కోరుకుంటే జరిగిపోతుందా.? అన్న సందేహాలు కలుగుతున్నాయా.? ఈ విషయంలో క్లారిటీని పక్కనబెడితే.. ఈ వర్షాన్ని కురిపించింది మాత్రం ఓ కంపెనీ అని తెలిసింది. వర్షాన్ని కురిపించే కంపెనీలు కూడా వున్నాయా.? అంటే ఔనని చెప్పక తప్పదు.

పశ్చిమ బెంగాల్ రాజధాని కొల్ కతాలోని ఓ బహుళ అంతస్తుల భవనం నుంచి క్రితం రోజు మధ్యాహ్నం నోట్ల వర్షం కురిసింది. తొలుత నోట్లను చూసి విస్మయానికి గురైన స్థానికులు ఆ తరువాత వాటని తమ జేబుల్లో పెట్టుకునేందుకు పోటీ పడ్డారు. ఆరో అంతస్తు నుంచి ఈ నోట్ల వర్షం కురిసింది. దీంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా రద్దీగా మారింది. అయితే కొద్దిసేవు మాత్రమే కురిపిన నోట్ల వర్షం ఆ తరువాత ఆగిపోయింది. ఈ నోట్ల వర్షం వివరాల్లోకి వెళ్తే.. కొల్ కతా నగరంలోని బెంటిక్ స్ట్రీట్‌లోని ఓ భవనంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు దాడులు జరిపారు.

ఈ విషయం తెలుసుకున్న పక్కనే ఉన్న హోఖ్ మెర్కంటైల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సిబ్బంది ఆరో అంతస్తులోని కిటికీ నుంచి నోట్ల కట్టలను కిందికి విసిరేశారు. పై నుంచి కురుస్తున్న నోట్ల వర్షాన్ని చూసిన జనం తొలుత ఆశ్చర్యపోయారు. అయితే నోట్ల వర్షం వీడియోలను తీసిన జనం ఆ తరువాత అందినంత పట్టుకుని ఎంచక్కా వెళ్లిపోయి.. వీడియోను నెట్టింట్లో పోస్ట్ చేశారు. కిందపడిన నోట్లలో రూ.2,000, రూ.500, రూ.100 నోట్లు ఉన్నాయి. నోట్లు విసిరేసిన ఘటనపై డీఆర్ఐ అధికారులు మాట్లాడుతూ.. తమ సోదాలకు, నోట్లు వెదజల్లడానికి కారణం ఉందని అనుకోవడం లేదన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : locals  Currency notes rain  DRI raid  Bentinck Street  kolkata  west bengal  crime  

Other Articles