Caste row: AP Dy CM Pushpa Srivani to face inquiry! ఏపీ ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణికి హైకోర్టు షాక్.. విచారణ షురూ..

High court issues notice to ap deputy cm pushpa srivani on caste allegations

Kurupam Assembly, Pushpa Srivani, High Court, YSRCP, Shedule Tribe, Congress, BJP, Vizianagaram, Andhra Pradesh, Politics

The High Court of Andhra Pradesh has taken up the petition filed by Congress and BJP Leaders in connection with Andhra Pradesh Deputy Chief Minister Pushpa Srivani caste allegations.

ఏపీ ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణికి హైకోర్టు షాక్.. విచారణ షురూ..

Posted: 11/21/2019 12:22 PM IST
High court issues notice to ap deputy cm pushpa srivani on caste allegations

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణికి హైకోర్టు షాక్ ఇచ్చింది. అమె ఎన్నిక విషయంలో విచారణ నిమిత్తం రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. గుంటూరు జిల్లా తాటికొండ అసెంబ్లీ నియోజకవర్గ అధికార వైసీపీ పార్టీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి క్రితం రోజున ఎన్నికల కమీషనర్ షాక్ ఇచ్చి.. ఈ నెల 26న విచారణకు హాజరుకావాలని అదేశిస్తూ నోటీసులు జారీ చేయగా, ఇప్పుడు ఏకంగా ఉపముఖ్యమంత్రికే హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఈ అంశానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల సార్వత్రిక ఎన్నికలతో పాటు జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో విజయనగరం జిల్లాలోని ఎస్టీ అభ్యర్థులకు రిజర్వు చేసిన కురుపాం నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగిన పుష్ప శ్రీవాణి.. ఆ నియోజకవర్గం నుంచి గెలుపోందారు. అయితే అమె చెల్లుబాటు కాని కుల ధ్రువీకరణ పత్రంతో పోటీ చేశారని అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పాలైన కాంగ్రెస్ అభ్యర్థి ఎన్. సింహాచలం, బీజేపీ అభ్యర్థి ఎన్. జయరాజు గతంలో ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.

ఈ సందర్భంగా ఆమె ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ పిటీషన్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో శ్రీవాణి కొండదొరగా పేర్కొన్నారని, ఈ మేరకు కులధ్రువీకరణ పత్రం సమర్పించారని పేర్కొన్నారు. అయితే అది చెల్లుబాటు కాదని వారు తమ పిటిషన్ లో పేర్కొన్నారు. ఆమె ఎన్నికను రద్దు చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై తాజాగా విచారణ చేపట్టిన హైకోర్టు మంత్రి శ్రీవాణికి నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మరో వైసీపీ ఎమ్మెల్యే కూడా విచారణను ఎదుర్కోనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kurupam Assembly  Pushpa Srivani  High Court  YSRCP  Shedule Tribe  Congress  BJP  Vizianagaram  Andhra Pradesh  Politics  

Other Articles