TSRTC JAC ready to call off strike ‘‘సమ్మె విరమణకు టీఎస్ఆర్టీసీ జేఏసీ సిద్దం..’’

Tsrtc employees willing to end strike if govt takes all of them back unconditionally

TSRTC Workers, High Court, TSRTC bus strike, telangana transport strike, KCR,Telangana bus strike, IAS officials, RTC MD Sunil sharma, RTC MD Sunil sharma Affidavit, Telangana movement, Ashwathama Reddy, TSRTC, TSRTC Workers, TSRTC Workers Strong Warning, Telangana Bandh, ts government

Union leaders of the Telangana State Road Transport Corporation agreed to call off their ongoing indefinite strike on Wednesday, with the condition that the state government and TSRTC management should take back all the 48,000 plus employees of the state-run bus service unconditionally.

సమ్మె విరమణకు టీఎస్ఆర్టీసీ జేఏసీ సిద్దం.. కండీషన్స్ అప్లై..

Posted: 11/20/2019 06:54 PM IST
Tsrtc employees willing to end strike if govt takes all of them back unconditionally

టీఎస్ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 48 రోజుల సమ్మెను ఇవాళ ముగింపు పడింది. విధుల్లో చేరడానికి తాము సిద్ధమంటూ ఆర్టీసీ జేఏసీ, కార్మికులు సంచలన నిర్ణయం ప్రకటించింది. జేఏసీ నిర్ణయంతో రాష్ట్రంలో ఇక బస్సులు యథేచ్ఛగా తిరిగే అవకాశం ఏర్పడింది. కార్మికులు విధుల్లో చేరడానికి.. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం సానుకూల వాతావరణ కల్పించాలని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి కోరారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తున్నట్లు ఆయన తెలిపారు. బేషరతుగా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని.. విధుల్లో చేరిన కార్మికులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆయన కోరారు. లేబర్ కోర్టులో తమకు న్యాయం జరుగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

కార్మికులు ఎలాంటి పత్రాలపై సంతకాలు చేయరని.. విధుల్లోకి వెళితే డ్యూటీ చార్టులపై మాత్రమే సంతకాలు చేస్తారని అశ్వత్థామ రెడ్డి తెలిపారు. జేఏసీ నాయకులు, విపక్ష నేతలతో సుదీర్ఘ చర్చల అనంతరం బుధవారం (నవంబర్ 20) సాయంత్రం ఆర్టీసీ సమ్మెపై ఆయన కీలక నిర్ణయం ప్రకటించారు. ప్రభుత్వం, యాజమాన్యం స్పందన తర్వాతే సమ్మెపై తుది నిర్ణయం ఉంటుందని తెలిపారు. సమ్మె విరమిస్తున్నట్లు నేరుగా ప్రకటన చేయకున్నా.. విధుల్లో చేరడానికి సిద్ధమంటూ అదే అర్థం వచ్చేలా మాట్లాడారు.

48 రోజులుగా సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం, కోర్టుల్లోనూ చుక్కెదురవడంతో కార్మికులు ఆందోళనకు గురయ్యారు. రెండు నెలలుగా జీతాలు లేకపోవడం కార్మికుల జీవితాలను ఆగమాగం చేసింది. గతంలో కూడబెట్టిన అరకొర సొమ్ములు కూడా సమ్మె కాలంలో కరిగిపోయాయి. నిత్యావసరాలు, పిల్లల చదువులు, వృద్ధ తల్లిదండ్రుల బాధ్యత, ఆస్పత్రి తదితర ఖర్చులు భారమై కార్మికులకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. గత్యంతరం లేని పరిస్థితుల్లో కొంత మంది కార్మికులు రోజువారీ కూలీలుగా అవతారమెత్తారు. మరి కొంత మంది కులవృత్తులను నమ్ముకున్నారు.

ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెను కొనసాగించాలా వద్దా అనే అంశంపై కార్మిక సంఘాల నేతలు తీవ్ర మల్లగుల్లాలు పడ్డారు. హైకోర్టు తీర్పు అనంతరం ఆర్టీసీ కార్మిక సంఘాలు మంగళవారం విడివిడిగా కార్మికుల అభిప్రాయాలు సేకరించాయి. బుధవారం సాయంత్రం అత్యవసరంగా సమావేశమైన ఆర్టీసీ జేఏసీ.. సమ్మె విరమణపై చర్చించి ఆ వెంటనే నిర్ణయం ప్రకటించింది. వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టిన నేపథ్యంలో సమ్మెను విరమించి విధుల్లో చేరడం ఉత్తమమని ఎక్కువ మంది కార్మికులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

గత 48 రోజులుగా సమ్మె చేసి, ఒక్క డిమాండ్‌కు కూడా ప్రభుత్వం అంగీకరించకపోయినా విధుల్లో చేరితే భవిష్యత్తులో కనీసం ఉద్యోగ భద్రత కూడా ఉండదని.. తాడోపేడో తేలేంత వరకు సమ్మె కొనసాగించాల్సిందేనని మరి కొంత మంది కార్మికులు అభిప్రాయపడినట్లు సమాచారం. అయితే తమ ప్రయత్నం తాము చేశామని, మరిన్ని రోజులు సమ్మె చేస్తే కార్మికులు జీవితాలు మరింత దిగజారుతాయని జేఏసీ నేతలు అభిప్రాయపడ్డారు. మొత్తం మీద ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఆర్టీసీ జేఏసీ సమ్మె విరమణకే సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో నెలన్నరగా రాష్ట్రంలో నెలకొన్న సందిగ్ధత తొలగిపోవడానికి అవకాశం ఏర్పడింది. ఇక ప్రభుత్వం ఆర్టీసీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : High Court  sadak bandh  TRS Agents  IAS officials  Ashwathama Reddy  TSRTC Strike  KCR  Hyderabad  Telangana  

Other Articles