BJP MLA contestant assets grew by Rs 185 crore బీజేపి ఎమ్మెల్యే అస్తుల చిట్టా చూసి అధికారులు షాక్.!

Karnataka rebel mla mtb nagaraj s assets grew by rs 185 crore in 18 months

BJP contestant, MTB Nagaraju, Property value, Afidavit, Chief Election commissioner, by-elections, karnataka, politics

Karnataka’s richest politician MTB Nagaraj got richer by Rs 185.7 crore in a span of just 18 months, his latest affidavit shows. MTB Nagaraj was one of the 17 rebel MLAs from Congress and JD(S), whose defection in July led to the fall of the coalition government headed by HD Kumaraswamy,

బీజేపి ఎమ్మెల్యే అస్తుల చిట్టా చూసి అధికారులు షాక్.!

Posted: 11/16/2019 07:31 PM IST
Karnataka rebel mla mtb nagaraj s assets grew by rs 185 crore in 18 months

కర్ణాటకలో కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యే, ప్రస్తుత బీజేపీ అభ్యర్ధిగా బరిలో దిగిన నాయకుడు ఎం.టి.బి.నాగరాజు సంపాదన ఏడాదిన్నర కాలంలో ఎంత పెరిగిందో తెలిస్తే.. షాక్ అవ్వకతప్పదు. ఎందుకంటే వేయి కోట్ల రూపాయలకు పైగా ఆస్తులును వెనకేసుకున్న ఈయన ఆస్తి కేవలం ఏడాదిన్నర కాలంలో ఏకంగా రూ. 185 కోట్లు పెరిగింది. వెయ్యికోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి.. కోట్ల రూపాయల టర్నోవర్ వున్న పరిశ్రమలకే సాధ్యంకాని టర్నోవర్ ఈయనకు ఎలా సాధ్యపడిందో అన్న ప్రశ్నలు తలెత్తకమానవు. ఇది విపక్షాల అరోపణలు ఎంతమాత్రము కాదు.. పక్కాగా అక్షర సత్యం.

అఫిడవిట్ లో ఎం.టి.బి.నాగరాజు దాఖలు చేసిన వివరాలు చూసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి నోరు వెళ్లబెట్టాడు. ఇప్పుడు అర్థమైందా.? ఇదంతా ఆయన కర్ణాటక అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా జరగనున్న ఎన్నికలలో పాల్గోనేందుకు ఎన్నికల ప్రధాన అధికారికి ఇచ్చిన అఫిడెవిట్ లో పొందుపర్చిన వివరాలు. ఇక ఈ విషయంలోకి మరింత వివరణాత్మంగా వెళ్తే.. కర్ణాటకలో 17 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల పై స్పీకర్ అనర్హత వేటు వేయడంతో ఈ స్థానాలకు డిసెంబర్ 5న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ జరుగుతోంది.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యే ఎం.టి.బి.నాగరాజు ఈసారి బీజేపీ టికెట్ పై హెూస్కోటే నియోజకవర్గం నుంచి తిరిగి పోటీ చేస్తున్నారు. నామినేషన్ సందర్భంగా ఆయన దాఖలు చేసిన ఆస్తుల అఫిడవిట్ చూసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆశ్చర్యపోయారు. అఫిడవిట్ లో తన ఆస్తుల మొత్తం విలువ రూ. 1201 కోట్లుగా చూపించారు. 2018లో జరిగిన ఎన్నికల్లో ఆయన దాఖలు చేసిన అఫిడవిట్ లో తన ఆదాయం రూ. 1015 కోట్లుగా నాగరాజ్ చూపించారు.

కేవలం పద్దెనిమిది నెలల వ్యవధిలో తన ఆస్తుల విలువ సుమారు రూ. 185 కోట్లు పెరిగినట్లు ఆయన చూపించారు. దేశ అర్థిక పరిస్థితే గణనీయంగా మందగించిన క్రమంలో ఈ ఎమ్మెల్యే అభ్యర్థి అస్తులు ఎలా పెరిగాయో అర్థంకాని ప్రశ్న. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆగస్టులో కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే తన ఆస్తుల విలువలో 25.84 శాతం పెరుగుదల నమోదైందని పేర్కొన్నారు. ఇలాంటి కోట్ల రూపాయల అస్తులున్న వ్యక్తులకు సామాన్య ప్రజల అవస్థలు, ఆకలి బాధలు ఎలా అర్థమవుతాయి. రైతుల కడగండ్లు ఎలా తెలుస్తాయో.. నిరుద్యోగులు, చిరుద్యోగుల వేతలు ఎలా అవగతం అవుతాయో ఆ నియోజకవర్గ ప్రజలకే తెలియాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles