Z-plus security for outgoing CJI Ranjan Gogoi రంజన్ గొగోయ్ కి జడ్ ప్లస్ భద్రత కొనసాగింపు

Ranjan gogoi to get z plus security in assam after his retirement

Ranjan Gogoi, Ayodhya verdict, Dibrugarh, Z plus security, Babri Masjid, sabarimala, Triple Talaq, CJI Supreme Court, India, Politics

Outgoing Chief Justice of India Ranjan Gogoi will enjoy Z plus security in Assam where he is likely to settle after his retirement on November 17. Security of Gogoi and four others judges was beefed up ahead of the delivery of Ayodhya verdict last week

రంజన్ గొగోయ్ కి జడ్ ప్లస్ భద్రత కొనసాగింపు

Posted: 11/16/2019 06:39 PM IST
Ranjan gogoi to get z plus security in assam after his retirement

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్డు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ ఈ నెల 17న తన పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రత్యేకంగా తన చివరి పనిదినాన్ని ముగించుకున్న ఆయన.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అనేక కీలక కేసులను పరిష్కరించారు. తన తీర్పులతో యావత్ దేశం సంతోషం వ్యక్తం చేసేలా చేసిన రంజన్ గొగోయ్ పేరు కూడా దేశ ప్రజలందరికీ చిరస్థాయిగా గుర్తిండిపోతుంది. కాగా, పదవీ విరమణ చేసిన ఆయనకు ప్రభుత్వం జెడ్ ప్లస్ భద్రతను మాత్రం కొనసాగించనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

రంజన్ గొగోయి తోపాటు కీలకమైన అయోధ్య తీర్పును వెలువరించిన నాలుగురు అత్యున్నత న్యాయస్థానం న్యాయమూర్తులకు ఈ భద్రతను కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య తీర్పు వెల్లడించడానికి ముందే ఆయనకు తీర్పులో భాగమున్న మరో నలుగురు న్యాయమూర్తులకు జెడ్ ప్లస్ భద్రత కల్పిస్తున్నారు. గొగొయి చెందిన గువహటిలోని ఇంటికి కూడా భద్రత కల్పిస్తున్నామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆయనకు భద్రతను ఆసోం పోలీసులు ఇవ్వనున్నారు. ఇప్పటికే ఆయన ఉండబోయే ఇంటిని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు.

అయితే నవంబర్ 17వ తేదీన రంజన్‌ గొగోయ్‌ పదవీ కాలం ముగిసినా భద్రత మాత్రం కొనసాగుతుంది. రంజన్‌ గొగోయ్‌ పదవీ విరమణ అనంతరం గొగోయ్ స్థానంలో మహారాష్ట్రకు చెందిన జస్టిస్‌ శరద్‌ అర్వింద్‌ బోబ్డే (63) సుప్రీం కోర్డు న్యాయముర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో రంజన్‌ గొగోయ్‌ తన ధర్మాసనంలో విచారణకు లిస్ట్‌ కేసారి నోటీసులు జారీ చేశారు. జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ అసోం రాష్ట్రాకి చెందిన వ్యక్తి. 1978లో గొగోయ్‌ బార్‌ కౌన్సిల్‌లో చేరారు. లాయర్‌గా గౌహతి హైకోర్టులో ప్రాక్టీస్‌ చేశారు. 2001 ఫిబ్రవరి 28న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులైయ్యారు.

జస్టిస్‌ గొగోయ్‌ 2012 ఏప్రిల్‌లో సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తి చెందిన పదోన్నతి పొందారు. భారత 46వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ కొనసాగారు. జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ విరమణ అనంతరం జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే (63) ప్రధాన న్యాయమూర్తిగా పదవి బాధ్యతలు చేపట్టారు. జస్టిస్‌ బోబ్డే 19 సంవత్సరాలు బాంబే హైకోర్టులో పనిచేశారు. రెండేళ్లకు మధ్యప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేశారు. తర్వాత 2013 ఏప్రిల్‌ 12న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆర్టికల్‌ 370 కేసుతోపాటు పలు కీలక కేసులు విచారణ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles