Telangana liquor is on high sale than AP తెలంగాణ మద్యానికి పెరిగిన గిరాకీ.. ఎంతో రుచిరా.!

Telangana liquor is on high sale than ap in bordering districts

Telangana liquor, Excise department, telangana liquor sales, Telangana liquor sale, Andhra Pradesh excise rules, AP excise policy, Ap Telangana bordering districts, Telangana Crime

Telangana liquor is on high sale than Andhra Pradesh in bordering districts as the price of liquor is less and shop closing time too is very late, when compared.

తెలంగాణ మద్యానికి పెరిగిన గిరాకీ.. ఎంతో రుచిరా.!

Posted: 11/16/2019 06:04 PM IST
Telangana liquor is on high sale than ap in bordering districts

నిధుల లేమితో అంగలార్చుతున్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన ఆదాయ వనురుగా అవతరించిన మద్యాన్ని వదులేసుకుంది. ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని మహిళా ఓటర్లకు ఇచ్చిన మాటకు కట్టుబడిన వైసీపీ ప్రభుత్వం మద్యం దుకాణాలను నియంత్రిస్తూ కొత్త ఎక్సైజ్ పాలసీని తీసుకువచ్చింది. దీంతో రాష్ట్రానికి ఆదాయం తగ్గింది. అయితే తగ్గిన ఆదాయాన్ని మరోలా రాబట్టుకునేందుకు ఏకంగా మధ్యం ధరలకు కూడా విపరీతంగా పెంచింది అక్కడి ఎక్సైజ్ శాఖ. ఈ విధానం ఆంధ్ర సరిహద్దు జిల్లాల్లోని తెలంగాణ మద్యం దుకాణాల వ్యాపారుల పాలిట కలిసివస్తోంది.

అంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మందుబాబులు ఏకంగా తెలంగాణకు క్యూకడుతున్నారు. తెలంగాణలో మద్యం ధరలు తక్కువ కావడంతో పాటు దుకాణాలు కూడా రాత్రి పదకొండు గంటల వరకు తెరచి వుండటంతో మందుబాబు.. ఏపీలో డబ్బులు పెట్టి మద్యం కొనడం కంటే.. తెలంగాణలో మద్యం కొనుగోలు చేయడం తమకు కలసి వస్తుందని, తక్కువ ధరకే కిక్కు లభిస్తోందని బారులు తీరుతున్నారు. తమ రాష్ట్రంలో రాత్రి 8 గంటలకే దుకాణాలు మూతపడుతుండడంతో అల్లాడిపోతున్న సరిహద్దు గ్రామాల్లోని మద్యం ప్రియులు తెలంగాణ మద్యం పాలసీకి జై కోడుతున్నారు.

దీంతో ఏపీ సరిహద్దులోని తెలంగాణ గ్రామాల్లో ఉన్న మద్యం దుకాణాలకు సరికొత్త కళ వచ్చిచేరింది. అటు నల్గోండ, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల మద్యం దుకాణాలు కళకళలాడుతున్నాయి. గతంతో పోలిస్తే ఏకంగా మూడు రెట్లు అధికంగా మద్యం అమ్ముడుపోతున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. ఏపీలోని తెలంగాణ సరిహద్దు గ్రామాలైన కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు, నందిగామ, వీరులపాడు మండలాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఆనుకుని ఉన్నాయి. ఈ మండలాల్లోని ప్రజలు తమకు సమీపంలోని తెలంగాణ పల్లెల్లో ఉన్న మద్యం దుకాణాలపై పడుతున్నారు.

దీంతో సూర్యాపేట, ఖమ్మం జిల్లాలలోని మద్యం షాపులకు తాకిడి పెరిగింది. ఇటు కర్నూలు జిల్లాకు అనుకుని వున్న మహబూబ్ నగర్ జిల్లాలోనూ అదే పరిస్థితి కనబడుతోంది. కొందరు ఇదే అదునుగా అక్రమ అమ్మకాలకు తెరతీశారు. తెలంగాణ నుంచి కొనుగోలు చేసి తీసుకొచ్చిన మద్యాన్ని స్థానికంగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నందిగామ ఎక్సైజ్ అధికారులు తెలంగాణ నుంచి మద్యంప్రియులు అక్రమంగా తీసుకొచ్చిన 203 మద్యం సీసాలను పట్టుకున్నారు. చందర్లపాడుకు చెందిన యంపతి మల్లేశ్వరి, పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటకు చెందిన కోపల్లి ప్రకాశ్‌రావును అదుపులోకి తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Cops parade bar dancers for safety check probe launched

  భద్రత కోసమే.. అభద్రతాభావంతో.. బార్ గర్ల్స్ వీడియో వైరల్..

  Dec 09 | ముంబైలో బార్ గాళ్స్ ను చెప్పులు లేకుండా పోలిస్ స్టేషన్ కు నడిపించుకుంటూ తీసుకెళ్లిన ఘటనపై ముంబై పోలీస్ ఉన్నతాధికారులు శాఖపరమైన విచారణను అదేశించారు. ముంబై లాంటి ప్రాంతాల్లో బార్లలో బార్ గాళ్స్ ను... Read more

 • Buxar jail in delhi preparing hanging ropes for nirbhaya case convicts

  నిర్భయ దోషులకు అదే రోజున ముహూర్తం ఫిక్స్..?

  Dec 09 | అది 2012, డిసెంబర్‌ 16వ తేదీన.. తనను కట్టుకోబోయేవాడితో పాటు ఢిల్లీలో ఓ ప్రైవేటు బస్సు ఎక్కిన పారామెడికల్ వైద్య విద్యార్థినికి ఆ రాత్రే కాళరాత్రిగా మారింది. ఇందుకు కారణమైన ఆరుగురిలో నలుగురికి అదే... Read more

 • Anam ramnarayana requests speaker to change his place

  ‘‘సీటు మార్చండీ అధ్యక్షా’’ నవ్వులు పూయించిన ఆనం రిక్వెస్ట్..

  Dec 09 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శీతకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజునే అధికార, విపక్షాల మధ్య వేడిని రాజేస్తున్నాయి. సభ ప్రశ్నోత్తరాల సమయంలో అధికార-ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం నడిచింది. విద్యుత్ రంగంలో గోపాల్ రెడ్డి కమిటీ... Read more

 • Andhra pradesh government announces mega dsc for 7900 post

  నిరుద్యోగ యువతకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..

  Dec 09 | ఆంధ్రప్రదేశ్ ఫ్రభుత్వం నిరుద్యోగ యువతకు మరో గుడ్ న్యూస్ అందించింది. ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలనే ఔత్సాహికులకు వారి అదృష్టాన్ని పరీక్షించుకునే తరుణం వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అంటూ గత కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్న డీఎస్సీని వచ్చే నెలలో... Read more

 • Man dies in queue for subsidy onions in gudiwada

  వృద్దుడి ఉసురు తీసిన ఉల్లి.. గుడివాడలో ఘటన

  Dec 09 | ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదన్నది పెద్దల నానుడి. అలాంటి ఉల్లి ఏకంగా మనుషుల ప్రాణాలను కూడా తీస్తోందని మాత్రం ఎవ్వరూ ఊహించివుండరు. కానీ అదే జరుగుతోంది. ఉల్లి ధరకు రెక్కలు వచ్చి..... Read more

Today on Telugu Wishesh