Five arrested under POCSO Act in Nagapattinam ప్రేమ పేరుతో బాలికను లోబర్చుకుని.. స్నేహితులతో కలసి..

Five arrested under pocso act in nagapattinam

Velankanni, Nagapattinam, minor girl, POCSO Act, love, blackmail, gangrape, pregnant, Tamil Nadu, crime

Five persons were arrested for allegedly sexually assaulting a 14-year-old girl for a month in nagapattinam of Tamil Nadu. Three accused were on the run. POCSO Act was booked on the accused for allegedly raping and impregnating a minor girl.

ప్రేమ పేరుతో బాలికను లోబర్చుకుని.. స్నేహితులతో కలసి..

Posted: 11/16/2019 05:06 PM IST
Five arrested under pocso act in nagapattinam

అభంశుభం తెలియని అమాయక అడపిల్లలను ప్రేమ పేరుతో లోబర్చుకుని వారిపై అఘాయిత్యానికి పాల్పడటమే కాకుండా.. తన స్నేహితులతో కలసి సామూహిక అత్యాచారం చేయించి.. గర్భవతిని చేసిన ఘటన తమిళనాడులో జరిగింది. అరవ రాష్ట్రంలోని నాగపట్టణం జిల్లా పరిధిలోని నాగై వెల్లంగాణిలో 9వ తరగతి చదవుతున్న 14ఏళ్ల బాలికపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు మానవ మృగాళ్లు. హాస్టళ్లో చదువుతున్న బాలిక తీవ్ర కడుపునొప్పికి గురై కుప్పకూలాంది. దీంతో అసుపత్రికి తీసుకెళ్లిన హాస్టల్ నిర్వాహకులకు విషయం తెలిసి విస్తుపోయారు.

కుటుంబసభ్యులకు విషయాన్ని తెలియజేసిన నిర్వాహకులు.. వారి ద్వారా పోలీసులకు కూడా సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మైనర్ బాలికపై ఈ తరహా అమానుషానికి ఒడిగట్టిన వారిపై బాలబాలికల హక్కుల పరిరక్షణ చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన ఎనమిది మందిలో ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు వారిని రిమాండ్ కు తరలించారు. కాగా మరో ముగ్గురు పరారీలో వున్నారని పోలీసులు తెలిపారు. బాలిక గర్భవతి కావడంతో అమెను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నామని నాగపట్టణం జిల్లా పోలీసు అధికారి సెల్వ నాగరత్నం తెలిపారు.

కడలూరు జిల్లా, వడలూరు ప్రాంతానికి చెందిన దంపతులు.. నాగై వేలంగాణిలోని ప్రైవేటు లాడ్జీ సమీపంలో నివాసం ఉంటూ దినసరి కూలీలుగా పని చేస్తున్నారు. వీరి కుమార్తె(14) పుదుచ్చేరిలోని హాస్టల్ లో ఉంటూ 9వ తరగతి చదువుతోంది. తల్లిదండ్రుల దగ్గరకు అప్పుడప్పుడు విద్యార్థిని వచ్చి వెలుతోంది. గత ఏప్రిల్ నెలలో వేసవి సెలవుల సందర్భంగా తల్లిదండ్రుల వద్దకు వచ్చిన బాలిక అక్కడే రెండు నెలల పాటు ఉండింది. ఆ సమయంలో స్థానికంగా నివాసముంటున్న సూర్యప్రకాష్ (20) అనే యువకుడు అమెకు పరిచయం అయ్యాడు.

ప్రేమ పేరుతో అమెను లోబర్చుకుని బాలికకు సినిమాలు, చిరుతిళ్లు అలవాటు చేశాడు. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంటోందని తెలుసుకున్న సూర్య.. అమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక మీద అత్యాచారం చేయడమే కాకుండా తన స్నేహితులకు విషయాన్ని చెప్పి.. అమెతో ఎవరు ఏం చేసినా తనకు అభ్యంతరం లేదని కూడా చెప్పడంతో.. అతని స్నేహితులు రూబెన్, గోకుల్, వీరయ్యన్, కారల్ మార్క్స్ బాలికను సూర్యతో వున్న సంబంధం విషయమై బెదిరించి అమెపై సామూహిక అత్యాచారం చేశారు. అది చాలదన్నట్లు ఆ ఘటన దృశ్యాలను వీడియోలు తీశారు.

వీడియోల పేరుతో బాధితురాలిని నెల రోజుల పాటు పలు పర్యాయాలు గ్యాంగ్ రేప్ చేశారు. బాలిక తాను రాను అని చెప్పినా.. వీడియోలు మీ తల్లిదండ్రులకు చూపిస్తామని బెదిరించి ఆమెపై అత్యాచారం ఒడిగట్టారు. ఎక్కడ విషయం తల్లిదండ్రులకు తెలుస్తుందో అనే భయంతో బాలిక విషయం బయటకు చెప్పలేదు. అదే భయంలో బాలిక హాస్టల్ కు వెళ్లింది. కాగా, రెండు రోజుల క్రితం తీవ్ర కడుపునోప్పి రావడంతో బాలిక కుప్పకూలిపోయింది. హాస్టల్ సిబ్బంది బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లి.. వైద్యులు అమె గర్భవతి అని చెప్పడంతో నివ్వెరపోయారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

హాస్టల్ సిబ్బంది, పలువురు ఉపాధ్యాయులతో కలసి వెళ్లిన బాలిక కుటుంబ సభ్యులు విషయాన్ని నాగపట్టణం జిల్లా ఎస్పీ సెల్వ నాగరత్నంకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలికను ప్రశ్నించగా తన లవర్ సూర్య, అతని స్నేహితులు పదేపదే అత్యాచారం చేశారని చెప్పింది. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు సూర్య, గోకుల్, రూబన్, వీరయ్యన్, కారల్ మార్క్స్ ను అరెస్టు చేశారు. బాలిక మీద సామూహిక అత్యాచారం చేసిన కేసులో మరో ముగ్గురు తప్పించుకున్నారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Velankanni  Nagapattinam  minor girl  POCSO Act  love  blackmail  gangrape  pregnant  Tamil Nadu  crime  

Other Articles

Today on Telugu Wishesh