Disqualified MLAs can fight by-polls:SC కర్ణాటకలో ఉపసమరానికి ఆ 17 మందికి ‘సుప్రీం’ అనుమతి

Karnataka bypolls disqualified mlas can fight by polls says supreme court

Karnataka bypolls, Karnataka byelections, Election Commission, EC, Siddarmaiah, President Ram Nath Kovind, Amit Shah, Union Home Minister, BJP politics, Yediyurappa, BSY, dinesh gundu rao, Bengaluru news, December 5 elections, Karnataka rebel MLAs, disqualified MLAs Supreme Court, SC verdict, BJP poaching, D K Shivakumar, Karnataka CBI, IT raids, Karnataka, politics

The Supreme Court (SC) upheld an order by former Karnataka Assembly Speaker K R Ramesh Kumar disqualifying 17 Karnataka MLAs in July. The order, therefore, allows all the disqualified MLAs to contest in the upcoming bypolls.

కర్ణాటకలో ఉపసమరానికి ఆ 17 మందికి ‘సుప్రీం’ అనుమతి

Posted: 11/13/2019 12:48 PM IST
Karnataka bypolls disqualified mlas can fight by polls says supreme court

కర్ణాటకలో ఉప ఎన్నికల సమరానికి నామినేషన్ల పర్వం నిన్న తెరుచుకున్న నేపథ్యంలో ఇవాళ ఆయా ఎమ్మెల్యేల భవితవ్వాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం తెల్చింది. అనర్హ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన 17 శాసనసభ నియోజకవర్గాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన నేపథ్యంలో క్రితం రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే అత్యున్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పును బట్టి తమ అభ్యర్థులను ప్రకటించే పనిలో పడిన బీజేపి.. సుప్రీంకోర్టు తీర్పు వారికి అనుకూలంగా వస్తే.. వారినే బలపర్చాలన్న నిర్ణయం కూడా తీసుకుందని వార్తలు వినిపించాయి.

ఈ క్రమంలో కర్ణాటక అసెంబ్లీలో మునుపటి కుమారస్వామి ప్రభుత్వాని పడగొట్టి, బీజేపి ప్రభుత్వానికి పరోక్షంగా సహకరించిన 15 మంది కాంగ్రెస్, ఇద్దరు జేడీఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్పై తేల్చిన న్యాయస్థానం వారిని అనర్హులుగా ప్రకటిస్తూ అప్పటి స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. అయితే ఇదే క్రమంలో ఐదేళ్ల పాటు వారిపై విధించిన అనర్హత వేటును మాత్రం సమర్థించని న్యాయస్థానం.. వారిని ప్రస్తుతం ఆయా నియోజకవర్గాల్లో జరుగునున్న ఉప ఎన్నికలలో పాల్గోనేందుకు అనుమతి ఇచ్చింది.

దీంతో సుప్రీంకోర్టు తీర్పుతో తమ నెట్టిన పాలు పోసినట్టు అయ్యిందన్న ఎమ్మెల్యేలు.. తమ భవిషత్తును మరోమారు తమ నియోజకవర్గాల ప్రజల సమక్షంలో ఉప ఎణ్నికల ద్వారా తేల్చుకోనున్నారు. అయితే గెలిచిన పార్టీ నుంచి ప్రజా తీర్పును ఇప్పటికే కాంక్షించిన ఎమ్మెల్యేలు.. తమ అభీష్టం మేరకు మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో మరో పార్టీకి మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలో వారి నిర్ణయంపై ఆయా నియోజకవర్గాల ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.? ఓటర్లు పార్టీలకు కట్టుబడ్డారా.? లేక నేతలకు మద్దతుగా నిలిచారా.? అన్నది ఈ ఎన్నికలతో తేలిపోనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles