TSRTC driver commits suicide in Mahababubabad టీఎస్ఆర్టీసీ సమ్మె: ఆత్మహత్యకు పాల్పడిన మరో డ్రైవర్

Tsrtc driver commits suicide in mahababubabad

TSRTC Workers, High Court, Avula Naresh, Mahabubabad, , RTC MD Sunil sharma, RTC MD Sunil sharma Affidavit, Telangana movement, Ashwathama Reddy, TSRTC, TSRTC Workers, TSRTC Workers Strong Warning, Telangana Bandh, ts government

Tension escalated in Mahabubabad town on Wednesday after an RTC driver committed suicide. Avula Naresh (51) consumed some pesticide in the wee hours of Wednesday.

టీఎస్ఆర్టీసీ సమ్మె: బలవన్మరణానికి పాల్పడిన మహబూబాబాద్ డ్రైవర్

Posted: 11/13/2019 11:28 AM IST
Tsrtc driver commits suicide in mahababubabad

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టి ఏకంగా మండలం (40) రోజులు పూర్తయ్యాయి. ఆర్టీసీ కార్మికులకు అండగా నిలిచిన అధికార ప్రభుత్వం.. దాని నుంచి దూరం జరగడంతో పాటు.. వారిపై అసలు కనికరం లేకుండా ఉద్యోగాలు పోతాయని, చివరి డెడ్ లైన్ కూడా ముగిసిందని హెచ్చరిస్తున్న క్రమంలో ఇప్పటికే పలువురు ఆర్టీసీ కార్మికులు బలైపోయారు. ఆర్టీసీ కార్మికులు పిట్టలా రాలుతున్న వారి సమస్యను అలస్యంగానైనా అర్థం చేసుకోని ప్రభుత్వం వారి గోడుకు కూడా చెవినపట్టనట్టు వ్యవహరిస్తోంది.

ఈ క్రమంలో ఇప్పటికే పలువురు కార్మికులు బలవన్మరణాలకు పాల్పడగా, మరికొందరు కార్మికులు తీవ్ర మానసిక అందోళనకు గురై అసువులు బాస్తున్నారు. ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల మనన్నలను పొందుతున్న ప్రభుత్వం.. రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షలకు పైగా ఉన్న ఆర్టీసీ కార్మికుల కుటుంబాలను ఎందుకు దూరం చేసుకుంటు వారిపై ఎందకింతలా వ్యవహరిస్తోందో అర్థంకాని ప్రశ్న. ఇదిలావుంటే తాజాగా రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు కూడా తెలంగాణ ప్రభుత్వతీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది.

కార్మికులు చేపట్టిన సమ్మెను చట్టబద్దం కాదని ప్రకటించలేమని చెప్పిన న్యాయస్థానం.. సమస్య పరిష్కారానికి సర్వోన్నత న్యాయస్థానానికి చెందిన ముగ్గురు రిటైర్డు న్యాయమూర్తులతో కమిటీని వేస్తామని చెప్పింది. ఈ మేరకు ప్రభుత్వ అభిప్రాయం చెప్పాలని అడ్వొకేట్‌ జనరల్‌ను హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ కేసును ఇవాళ మరోమారు న్యాయస్థానం విచారించనుంది. అయితే సుమారు 40 రోజులుగా తాము ఆకలిదప్పులను చంపుకుని  న్యాయమైన హక్కుకోసం సమ్మె చేస్తున్నా ప్రభుత్వం కనికరించడం లేదని అందోళన చెందిన మరో ఆర్టీసీ కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

తమ సమ్మెపై జరుగుతున్న పరిణామాలపై కలత చెందిన మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబాబాద్ డిపోలో నరేశ్ అనే వ్యక్తి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.  నెల రోజులకుపైగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం, మరోవైపు ఉద్యోగాలు పోతాయని ప్రభుత్వం హెచ్చరించడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ ఉదయం పురుగుల మందు తాగేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నరేశ్ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : High Court  Avula Naresh  Mahabubabad  Ashwathama Reddy  TSRTC Strike  KCR  Hyderabad  Telangana  

Other Articles