Grant permission for free Sand quarrying: Mudragada ప్రకృతి ఇచ్చిన ఇసుకను.. ప్రజలకు ఉచితంగా ఇవ్వండీ: ముద్రగడ

Mudragada padmanabham writes to jagan mohan reddy over sand row

Mudragada Padmanabham, YS Jagan Mohan Reddy, Sand Shortage Problem, construction workers, Open Letter To Chief Minister. AP Government, Andhra Pradesh, Politics

Former minister Mudragadda Padmanabham has expressed concern over the deaths of construction workers due to shortage of sand. He wrote to Chief Minister Jagan Mohan Reddy.

ప్రకృతి ఇచ్చిన ఇసుకను.. ప్రజలకు ఉచితంగా ఇవ్వండీ: ముద్రగడ

Posted: 11/04/2019 04:30 PM IST
Mudragada padmanabham writes to jagan mohan reddy over sand row

మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. కాపు రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావిస్తూ.. తమ జాతీ చేసుకున్న పాపం ఏమిటలోనని అవేదన వ్యక్తం చేసిన ఆయన రాష్ట్రంలో ఇసుక కొరతపై ప్రభుత్వ తీరు సమర్థనీయంగా లేదన్నారు. పాదయాత్ర సందర్భంగా ప్రజలకిచ్చిన నవరత్నాల హామీలతో పాటు కొత్త పథకాలను కూడా ప్రవేశపెట్టే క్రమంలో ముఖ్యమంత్రి శ్రమిస్తున్నారని పేర్కోంటూనే.. ఈ పథకాల అమలు కోసం నిధుల లేమి స్పష్టంగా కనిపిస్తోందని, అందుకు భూముల విక్రమం కూడా చేస్తామన్న ప్రకటనలు కూడా కనిపిస్తున్నాయని ఆయన సన్నాయినొక్కులు నొక్కారు.

తద్వారా జగన్ పరిపాలన చూస్తుంటే.. అభద్రతా భావంలో ఉన్నారని తెలియజేస్తోందని పేర్కోన్నారు. రాష్ట్రంలో ఇసుక గురించి ప్రజలు పదుతున్న బాధలు వర్ణనాతీతమన్న ఆయన.. ఈ భాధలు తమ కుల రిజర్వేషన్ బాధలతో సరిసమానంగా వున్నాయని ప్రస్తావించారు. ఎన్నో సంక్షేమ పధకాలు రూపకల్పన చేయడంలో శరవేగంగా చొరవ చూపుతున్న ప్రభుత్వం ఇసుక పాలసీ విషయంలో నిర్లక్ష్యం వహించిందని అన్ని వర్గాలు అభిప్రాయపడుతున్నాయని అన్నారు. నదులలో నీరు ఉండేటంతోనే ఇసుక కొరత అని ప్రభుత్వం వినిపిస్తున్న వాదనలో పసలేదని అన్నారు. ప్రభుత్వం తరుపున ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ముమ్మాటికీ తప్పేనని పేర్కోన్నారు.

ఇసుక ప్రజలకు ప్రకృతి ప్రసాదించిన వరమని.. ప్రభుత్వానికి ఎటువంటి పెట్టుబడి లేకుండా వచ్చిన వనరని ముద్రగడ తన లేఖలో స్పష్టం చేశారు. ఇసుక గురించి ప్రజలు పడుతున్న బాధలు చూసి ఈ లేఖ రాస్తున్నాను. ప్రజలు సుఖంగా జీవించే లాగ చర్యలు ఉండాలి తప్ప, ఓట్లు వేసిన వారిని బాధించడం తగదని అన్నారు. తాను పెద్దగా చదువుకోలేదని, మేథావిని కూడా కాదని అంటూనే భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే దిశగా పరిస్థితులను కల్పించడం సముచితం కాదని ఆయన నర్మగర్భవ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఇసుక విదానాన్ని పగడ్భంధీగా అమలుపర్చేంత వరకు ఇసుకను ఉచితంగా అందించాలని సూచించారు.

అయితే ఈ ఉచిత ఇసుక పంఫిణీ నేపథ్యంలో రెవిమ్యా, మైన్స్‌, పోలీసు మొదలగు శాఖలు అనుమతి అవసరం లేకుండా ఎవరికి ఎంత కావాలో అంత ఇసుక ఉచితంగా ప్రజలు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని.. ఈ విధానంతో ప్రజలు సుఖపడతారని తాను భావిస్తున్నట్లు పేర్కోన్నారు. ‘దయచేసి నేను రాసిన విషయాలు పరిశీలించండి. ప్రభుత్వానికి రూపాయి పెట్టుబడిలేదు. ప్రజలను, కార్యాలయాలు, ఇ-సేవలు చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా పక్కా పాలసీ తయారయ్యే వరకూ ఉచిత ఇసుక ఆదేశాలు ఇవ్వడం మంచిదనిపిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రం నుండి ఇసుక ప్రక్క రాష్ట్రాలకు తరలిపోకుండా గట్టి బందోబస్తు చేయడానికి తగు చర్యలు కూడా తీసుకోమని కోరుతున్నట్లు ముద్రగడ లేఖలో ప్రస్తావించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles