Telangana: Woman official burnt alive in Hyderabad అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం..

Man kills tehsildar in hyderabad by setting her ablaze in her office

Vijaya Reddy, Tehsildar attack, Abdullapurmet MRO, Suresh Mudhiraj, land controversy, Pass book, petrol, Sabitha Indra Reddy, Rangareddy, Hyderabad’s Outer Ring Road, Telangana Crime

In a horrific incident that happened in broad daylight, a man killed an on-duty Tehsildar by setting her on fire. The incident happened on Monday afternoon at the office of the tehsildar in Abdullapurmet in Rangareddy district, just beyond Hyderabad’s Outer Ring Road (ORR).

అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం..

Posted: 11/04/2019 05:41 PM IST
Man kills tehsildar in hyderabad by setting her ablaze in her office

హైదరాబాద్ నగరశివారుల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ముక్కుసూటిగా తన విధులను నిర్వహిస్తున్న ఓ అధికారిపై అత్యంక భయానకంగా వ్యవహించిన ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్‌లో చోటు చేసుకుంది. తహశీల్దార్ విజయారెడ్డిపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. అమెను తన కార్యాలయంలోనే సజీవ దహనం చేశాడు. దీంతో ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన వారికి కూడా ఈ ఘటనలో గాయాలయ్యాయి. ఈ ఘటనలో విజయారెడ్డి అక్కడికక్కడ మృతిచెందారు. ఆ తర్వాత దుండగుడు కూడా తనపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్నాడు.

అటో ఎక్కి స్థానికంగా వుంటే అసుపత్రికి వెళ్లి చికిత్స కోసం చేరాడు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి సురేష్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో గాయాలపాలైన మరో ఇద్దరు వ్యక్తులను చికిత్స నిమిత్తం ఆస్సత్రికి తరలించారు స్థానికులు. ఈ భయానక ఘటన మధ్యాహ్నం 1:30 గంటలకు విజయారెడ్డితో మాట్లాడాలంటూ ఓ వ్యక్తి ఆఫీసులోపలికి వెళ్లాడు. అరగంటపాటు చర్చించారు. అకస్మాత్తుగా మంటలు వ్యాఫించడంతో కార్యాలయంలో వున్న మిగిలిన సిబ్బంది అప్రమత్తమైయ్యారు.

ఈ లోగా ఒంటిపై మంటలతో విజయారెడ్డి బయటకు వచ్చి.. గుమ్మం బయటే కుప్పకూలిపోయారు. అమెను కాపాడేందుకు సిబ్బంది చివరి క్షణం వరకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చనిపోయింది ఎవరన్న విషయం కూడా ఎమ్మార్వో కార్యాలయంలోని సిబ్బందికి అర్థంకాలేదు. తరువాత ఆమె చేతి గడియారం. ఇత్యాదులను చూసిన తరువాత అమె అని గుర్తించారు సిబ్బంది. తీవ్రగాయాలపాలై విజయారెడ్డి తహశీల్దార్ కార్యాలయంలోనే మృతిచెందారు. కార్యాలయంలోనే అధికారిపై ఈ తరహా దాడి జరగడంపై సిబ్బంది నివ్వెరపోయారు.

అయితే ఈ ఘటనకు కారణాలు ఏమైవుంటాయన్న విషయంలో పలు వార్తలు వినబడుతున్నాయి. ఎమ్మార్వో వేధింపులేనని ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. విజయారెడ్డికి మంటలు అంటించిన వ్యక్తి సురేష్ అనే రైతుగా గుర్తించారు. హత్యకు దారితీసిన కారణాలపై అతడ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే పొలం రిజిస్ట్రేషన్ విషయంలో ఎమ్మార్వో డబ్బుల కోసం వేధించినట్లుగా సురేష్ ఆరోపిస్తున్నాడు. రిజిస్ట్రేషన్‌ చేసేందుకు లంచం అడిగినందుకే ఆమెను సజీవ దహనం చేసినట్లుగా తెలిపాడు. అనంతరం నిందితుడు వెళ్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.

ఇదిలా ఉంటే చనిపోయిన విజయారెడ్డి... తనకు ప్రమాదం పొంచివుందన్న విషయాన్ని ముందుగానే ఊహించారని ఆమె బంధువుల చెబుతున్నారు. విజయారెడ్డి హత్యపై స్పందించిన ఆమె మేనమామ వెంకట్ రెడ్డి... కొద్దిరోజుల క్రితమే కలెక్టర్ ఆఫీసులో తనకు సెక్యూరిటీ కల్పించాలని అమె పిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. గతేడాది విజయారెడ్డి ఉత్తమ ఎమ్మార్వోగా కలెక్టర్ నుంచి అవార్డు తీసుకుందన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. మూడేళ్ల నుంచి అబ్దుల్లాపూర్‌మెట్‌లో విజయారెడ్డి పని చేస్తున్నారని... ఏ విషయంలో అయినా ఆమె ముక్కుసూటిగా వ్యవహరించేవారని ఆయన గుర్తు చేసుకున్నారు.\

తహశీల్దార్‌ విజయా రెడ్డి దారుణ హత్యను తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం తీవ్రంగా ఖండించింది. పట్టపగలే ఒక మహిళా ఉద్యోగిని క్రూరంగా హత్య చేయడం అత్యంత హేయమైన చర్య అని వారు పేర్కొన్నారు. ఉద్యోగులకు పూర్తి రక్షణ కల్పించాలని కోరారు. దోషులు ఎంతటివారైనా వదలొద్దని కోరారు. తహశీల్దార్‌ హత్యకు నిరసనగా విధులు బహిష్కరిస్తున్నట్టు రెవెన్యూ ఉద్యోగుల సంఘం తెలిపింది. భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తామని ఆ సంఘం నేతలు పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో ఉద్యోగులంతా ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

ఉద్యోగులందరూ మనోనిబ్బరంతో, ధైర్యంగా ఈ పరిస్థితిని ఎదుర్కొందామని పేర్కొన్నారు. ఎమ్మార్వో విజయా రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి తరలించారు. ఆస్పత్రి వద్దకు అప్పటికే భారీగా చేరుకున్న ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పలువురు విపక్ష నేతలు ఎమ్మార్వోపై దాడి చేసిన స్థలాన్ని పరిశీలించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఉద్యోగులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles