Korutla MLA's PA washed away ఎస్సార్ఎస్పీ కాలువలో విద్యాసాగర్ రావు పీఏ గిరీష్ గల్లంతు

Korutla mla s pa washed away in srsp waters

Girish Singh, PA, Korutla legislator K. Vidyasagar Rao, sriramsagar, SRSC canal, liquor party, L.Ramana, Girish Thakur Singh, Tagore Girish Singh, Telangana politics

Girish Thakur Singh, the personal assistant of Korutla MLA K Vidyasagar Rao, accidentally got washed away in the SRSP canal. According to information, the incident occurred at Dharoor camp area on the outskirts of Jagtial town.

ఎస్సార్ఎస్పీ కాలువలో విద్యాసాగర్ రావు పీఏ గిరీష్ గల్లంతు

Posted: 11/04/2019 02:28 PM IST
Korutla mla s pa washed away in srsp waters

మద్యం సేవించి నీటి కాలువలోనే లేక ఈత కొలనులోనో దిగడం.. అసలు నీటిలోకి దిగాలన్న ఆలోచన రావడమే తప్పు అని ఇదివరకు ఎంతో మంది వైద్యులు, పోలీసు అధికారులు, పెద్దలు కూడా చెప్పారు. అయినా.. మందులో వున్న మజా ఏమిటో కానీ.. మందేసిన తరువాత నీరు కనబడితే అందులోకి దిగి ఈత కొట్టాలని మనస్సు ఉబలాట పడుతోందని అంటారు మందుబాబులు. ఇదే తరహాలో స్నేహితులతో కలిసి సరదాగా ఎస్సారెస్పీ కాలువ వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే పీఏ ఒకరు నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు.

నీటిలోకి దిగే సమయానికి ఆయన మద్యం సేవించి వున్నాడని కూడా వార్తలు అందుతున్నాయి. అతని స్నేహితులు కాలువలోని నీటిలోకి దిగొద్దు అని వారిస్తున్నా.. వారి మాటలను పట్టించుకోకుండా నీటిలోకి దిగి గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు వద్ద వ్యక్తిగత సహాయకుడు గిరీశ్ సింగ్ థాకూర్ పనిచేస్తున్నారు. ఆదివారం ఆయన మరో ముగ్గురు స్నేహితులు విజయ్, బాలన్, రామకృష్ణలతో కలిసి అంతర్గాం శివారులో ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్‌ను చూసేందుకు వెళ్లారు.  

ఈ క్రమంలో స్నేహితులు వద్దని వారిస్తున్నా సరదాగా ఈత కొట్టేందుకు ప్రాజెక్టు కాకతీయ కాల్వలో దిగిన గిరీశ్ ప్రవాహ ఉద్ధృతికి కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు మొదలుపెట్టారు. మరోవైపు, పోలీసులు కూడా గజ ఈతగాళ్లతో కలిసి అంతర్గాం, థరూర్ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ఆయన ఆచూకీ లభ్యం కాలేదు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Girish Singh  PA  Korutla MLA K. Vidyasagar Rao  SRS canal  L.Ramana liquor party  Telangana  Crime  

Other Articles