SBI cuts interest rates on savings accounts కస్టమర్లకు మరో షాకిచ్చేందుకు సిద్దమైన ఎస్బీఐ..

State bank of india cuts interest rates on savings accounts

Financial News, Personal finance news, investment, interest, rate, state bank of india, fixed, savings, accounts, SBI, deposits, interest rate, state bank of india, fixed accounts, savings accounts, SBI, deposits, Finance

The country’s largest lender, State Bank of India (SBI), has been on an interest rate cutting spree Wednesday morning. In good news to borrowers, the lender cut interest rates on MCLR linked loans by 10 basis points.

కస్టమర్లకు మరో షాకిచ్చేందుకు సిద్దమైన ఎస్బీఐ..

Posted: 10/29/2019 11:57 AM IST
State bank of india cuts interest rates on savings accounts

దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన కస్టమర్లకు షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. దేశంలో అత్యధిక కస్టమర్లు కలిగిన బ్యాంకుగా అవతరించిన తరువాత ఎస్బీఐ కస్టమర్లకు అనేక షాక్ లు ఇస్తూనే వుంది. తాజాగా నవంబర్ 1 నుంచి కొత్త రూల్‌ అమలులోకి రానుంది. వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు బ్యాంక్ ఇప్పటికే తెలియజేసింది. నవంబర్ 1 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది. దీంతో బ్యాంకులో డిపాజిట్ చేసే వారికి తక్కువ రాబడి రానుంది.

స్టేట్ బ్యాంక్ నవంబర్ 1 నుంచి సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లపై వడ్డీ రేట్లలో కోత విధించింది. 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. రూ.లక్ష వరకు డిపాజిట్లు ఉన్న అకౌంట్లకే ఇది వర్తిస్తుంది. దీంతో 1వ తేదీ నుంచి బ్యాంక్ కస్టమర్లకు 3.5 శాతం వడ్డీ రేటు కాకుండా 3.25 శాతం మాత్రమే వడ్డీ లభిస్తుంది. ఎస్బీఐ ఇదివరకే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక రెపో రేటు తగ్గించడం ఇందుకు కారణం.

రెపో రేటు ఇప్పుడు 5.15 శాతంగా ఉంది. ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు 0.10 శాతం తగ్గుదలతో 6.4 శాతానికి దిగొచ్చాయి. ఏడాది నుంచి 2 ఏళ్ల కాలపరిమితిలోని డిపాజిట్లకు ఇది వర్తిస్తుంది. స్టేట్ బ్యాంక్ అలాగే రూ.2 కోట్లకు పైన ఉన్న డిపాజిట్ అకౌంట్లపై కూడా రేట్లను తగ్గించింది. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లలో 0.30 శాతం కోత విధించింది. దీంతో ఈ డిపాజిట్లపై 6.3 శాతం కాకుండా 6 శాతం మాత్రమే వడ్డీ లభిస్తోంది. కేవలం ఎస్‌బీఐ మాత్రమే కాకుండా ఇతర బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను తగ్గిస్తూ వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles