devotees throng shiva temples as karthika masam begins తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ.. శైవక్షేత్రాల్లో భక్తుల కిటకిట.!

Devotees throng shiva temples as karthika masam begins

Kartika Masam, Kartika Masam Vana Bhojanalu, Kartika Masam Shivaradhana, Amavasya, Srisailam devotees, Srikalahasti devotees, Kaleshwaram devotees, Srisailam, Srikalahasti, Kaleshwaram, Tourism, Telangana, Andhra Pradesh, Politics

Devotees from Andhra Pradesh, Telangana throng to temples of Lord Shiva and Maha Vishnu as The auspicious Karthika Masam begins from today.

తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ.. శైవక్షేత్రాల్లో భక్తుల కిటకిట.!

Posted: 10/29/2019 11:17 AM IST
Devotees throng shiva temples as karthika masam begins

హిందువులు పవిత్రంగా భావించే కార్తీక మాసం ఇవాళ్టి నుంచి ప్రారంభం కావడంతో శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హిందూ సంప్రదాయంలో ఆధ్యాత్మిక విశిష్టత కలిగిన మాసాల్లో కార్తీక మాసం చెప్పుకోదగినది. కార్తీక మాసం అనగానే పరమ శివునికి ప్రీతి పాత్రమైనదిగా భక్తజనం భావిస్తారు. కానీ ఇది విష్ణుమూర్తి ఆరాధనకూ అత్యంత ప్రధానమైనది. శివకేశవులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో ఇటు శైవ క్షేత్రాలు.. అటు వైష్ణవ క్షేత్రాలు అన్నిటిలోనూ ప్రత్యెక పూజాదికాలు నిర్వహిస్తారు. భక్త జనకోటి ఈ పూజాదికాల్లో పాల్గొని తదాత్మ్యత చెందుతారు.

ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రం, మహిమాన్వితమైనది కార్తీకం. ఈ మాసం శుక్లపక్ష పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు ఈ మాసంలో అనేక వ్రతాలు చేస్తుంటారు. మరీ ముఖ్యంగా కేదారేశ్వర వ్రతాలు, నోములు, సత్యనారాయణ స్వామి వత్రాలు ఇలా అనేకం ఆద్యాత్మిక కార్యక్రమాల్లో భక్తకోటి నిమగ్నమవుతుంటారు. హరిహరపుత్రుడు స్వామి అయ్యప్ప భక్తులు కూడా ఈ మాసం నుంచే అయ్యప్ప దీక్షను స్వీకరించి మాలాధారణ గావిస్తారు. మండలం రోజులు పూర్తైన తరువాత శబరిమల కొండకు వెళ్లడం పరిపాటి. అందుకనే శ్రీమహావిష్ణువుతో సమానమైన దేవుడు, గంగతో సమానమైన తీర్థం, కార్తీకమాసంతో సమానమైన మాసం లేదని అంటారు.

ఇక ఈ ఏడాది ఇవాళ్టి నుంచి (29-10-2019) కార్తీక మాసం ప్రారంభం అవుతోంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తూ కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో పాఢ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిధుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తుంటారు. కార్తీకమాసం హరిహరాదులకు ప్రీతికరం..అందులోను ఈశ్వరారాధనకు చాలా ముఖ్యమైనది. దేశం నలుమూలలా ఉన్న వివిధ ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి లక్షకుంకుమార్చనలు, విశేషంగా జరుపుతూ ఉంటారు. అలా విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై కొంగుబంగారంలా సంతోషం కలిగిస్తాడు. కాబట్టి ఆ స్వామికి ''ఆశుతోషుడు'' అనే బిరుదు వచ్చింది.

ముఖ్యంగా శ్రీశైలం, శ్రీకాళహస్తి, త్రిలింగ క్షేత్రాలతో పాటు ఇంద్రకీలాద్రి భక్తులతో నిండిపోయింది. నిన్న సూర్యోదయం వేళ అమావాస్య ఘడియలే ఉండటంతో, నేటి నుంచి కార్తీకమాసం మొదలైనట్టు పంచాంగకర్తలు ఉటంకించిన సంగతి తెలిసిందే. ఇక శ్రీశైలంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఆలయ అధికారులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కార్తీక మాసోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆలయ వేళల్లో మార్పులు చేస్తున్నట్టు ప్రకటించారు. రద్దీ రోజుల్లో సుప్రభాతం, మహా మంగళ హారతి, లక్ష కుంకుమార్చన, నవావరుణ పూజ, బిల్వార్చన తదితర సేవలను రద్దు చేసినట్టు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ నుంచి బయలుదేరి ఒక్కరోజులో పంచారామాలను దర్శించుకుని వచ్చేలా ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kartika Masam  Amavasya  Srisailam  Srikalahasti  Kaleshwaram  Tourism  Telangana  Andhra Pradesh  Politics  

Other Articles