Pawan Kalyan interesting comments on vana bhojanas కార్తీకమాస వనభోజనాలపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Pawan kalyan interesting comments on karthika masam vana bhojanas

Janasena, Pawan Kalyan, karthika masam, vana Bhojanalu, caste priority, kula bhojanalu, Mangalagiri, Amaravati, Telangana, hyderabad suburban area, andhra pradesh, politics

Jana Sena party President Pawan Kalyan made interesting comments on karthika masam vana bhojanas, urges people not to make karthika vana bhojanas as caste bhojanas.

కార్తీక మాస వనభోజనాలను కులాల వారిగా మార్చకండీ: పవన్ కల్యాణ్

Posted: 10/29/2019 05:21 PM IST
Pawan kalyan interesting comments on karthika masam vana bhojanas

సామాజిక విషయాల పట్ల తనదైన శైలిలో నిర్మొహమాటంగా అభిప్రాయాలు వెల్లడించే జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి రాజకీయాలకు అతీతంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ కార్తీక మాసంలో అలుముకున్న ఆద్యాత్మిక వాతావరణం నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కార్తీక మాసం సందర్భంగా హైదరాబాద్ శివారులోని తన వ్యవసాయ క్షేత్రంలో వన రక్షణ పేరుతో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పార్టీ శ్రేణులతో కలిసి పవన్ మొక్కలు నాటారు. అందరితో నాటించారు.

మొక్కలను నాటడం ఒక్కటే సరిపోదని.. వాటిని సంరక్షించే బాధ్యత కూడా మనదేనని పవన్ పార్టీ శ్రేణులకు సూచించారు. పవిత్ర కార్తీకమాసంలో పర్యావరణ కోసం ముందుకు కదిలామన్నారు. మొక్కలు నాటడం నిరంతర ప్రక్రియ అని.. అది పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తుందన్నారు. వన సంరక్షణ కార్యక్రమం ద్వారా ప్రకృతితో మమేకం కావాలని పిలుపునిచ్చారు.

కార్తీక వన సమారాధన కార్యక్రమాలపైనా పవన్ తనదైన శైలిలో స్పందించారు. వన సమారాధనలు కుల భోజనాల కార్యక్రమాలు కాకూడదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమారాధన ఏ ఒక్క వర్గానికో పరిమితం కాకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. మనిషి ప్రకృతితో ఎలా మమేకం కావాలో పురాణాలు, వేదాలు వివరిస్తున్నాయని పవన్ అన్నారు. కార్తీక వన సమారాధన కార్యక్రమాలు కూడా అందులో భాగమేనని ఆయన వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles