Students cash in on Amazon discount code glitch అమజాన్ సంస్థకు రూ.కోట్ల మేర శఠగోపం..

Students sting amazon for hundreds of thousands after discovering reusable discount code glitch

Amazon, Coupon Code, Welcome5, Britain, Students Offer, reusable discount code, discount code glitch, United Kingdom, business, e-commerce

STUDENTS stung online giant Amazon for hundreds of thousands of pounds after discovering a glitch which meant a one-off discount code could be used again and again.

అమజాన్ సంస్థకు రూ.కోట్ల నష్టం.. బ్రిటన్ విద్యార్థులను వరించిన లాభం..

Posted: 10/29/2019 10:35 AM IST
Students sting amazon for hundreds of thousands after discovering reusable discount code glitch

విద్యార్థులను ఆకర్షించి వారి నుంచి పెద్ద మొత్తంలో వ్యాపారం చేసుకుని మంచి లాభాలను గడించాలని ఆశించిన ప్రపంచ దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ చేసిన ప్రయత్నం వికటించింది. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందాన.. ప్రతీసారి విద్యార్ధులను లేక కస్టమర్లకు గాలం వేసి.. ఆఫర్లు ప్రకటించి సొమ్ము చేసుకునే సంస్థకు అదే ఆపర్లలోని లోపంతో కోట్లాది రూపాయాల శఠగోపం పెట్టారు విద్యార్థులు. అమాజాన్ చేసిన ఆపర్లలోని లోపాన్ని గ్రహించిన విద్యార్థులు దానినే అసరాగా చేసుకుని ఉచిత కొనుగోళ్లతో అమెజాన్‌ను ఖాళీ చేశారు.

ఏకంగా పదిరోజుల పాటు ఈ ఉచిత హంగామా కొనసాగగా.. కొందరు విద్యార్థులు తాము కొనుగోలు చేసిన వస్తువులతో తమ ఇళ్లను నింపేశారు. అలాంటిదేం లేదే.? అంటారా.? ఈ ఆఫర్ అందరికీ కాదండీ కేవలం బ్రిటన్ లోని విద్యార్థులకు మాత్రమే.. దీంతో అక్కడి విద్యార్థులే అమాజాన్ సంస్థను డొల్ల చేశారు. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. యూకేలో చదువుకుంటున్న విద్యార్థులను ఆకర్షించేందుకు అమెజాన్  ‘వెల్‌కమ్5’ అనే కూపన్ కోడ్‌ను ప్రవేశపెట్టింది. తొలిసారి కొనుగోలు చేసే వారు ఈ కూపన్‌కోడ్‌ను ఎంటర్ చేస్తే రూ.450 రాయితీ లభిస్తుంది. అంతే మొత్తంలో ఉన్న వస్తువులను కొనుగోలు చేస్తే పూర్తిగా ఉచితం.

అయితే, ఈ కోడ్ ఒక్కసారి మాత్రమే పనిచేస్తుందని పేర్కొంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నారు. కాగా, వాడిన తరువాత కూడా మళ్లీ అదే కూపన్ కోడ్ ను ఎంటర్ చేయగా, మరోమారు తమకు రాయితీ అందింది. ఈ కూపన్ మళ్లీ మళ్లీ ఎంటర్ చేసినా.. మళ్లీ మళ్లీ పనిచేస్తూ.. విద్యార్థుల పాలిట కల్పతరువులా మారింది. ఇంకేముంది విద్యార్థులు తమకు అవసరమైన వస్తువులను తీసుకుని తమ ఇళ్లలో నింపేసుకున్నారు. మరికోందరు తమ వస్తువులను తమ తల్లిదండ్రుల ఇంటికి కూడా పంపారు. ఈ విషయం క్షణాల్లోనే బ్రిటన్ మొత్తం పాకేసింది.

దీంతో అందివచ్చిన అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకున్నారు. రోజంతా బుకింగ్‌లతోనే గడిపేశారు. వందలాది వస్తువులను ఆర్డర్ చేశారు. టూత్ పేస్టును కూడా వారు వదల్లేదు. ఒకానొక దశలో టాప్ సెల్లింగ్ లిస్ట్‌లో అదే ఉండడం గమనార్హం. దాదాపు పదిరోజులపాటు ఈ కొనుగోళ్ల జాతర సాగినా జరిగిన పొరపాటును అమెజాన్ గుర్తించలేకపోయింది. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సంస్థకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. దీనిపై విద్యార్థులు స్పందిస్తూ.. అమెజాన్‌ లాంటి సంస్థకు ఇదేమంత పెద్ద నష్టం కాబోదని వ్యాఖ్యానిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles